Saturday, August 1, 2015

అన్వేషణ
---------------------అందరూ జాలితో నావైపుచూపు మరల్చకుండా చూస్తున్నారు
సంతోషాలున్నాయ్
సంతాపాలూ ఉన్నాయ్ 
ప్రతిప్రాణీ భరించలేనంతగా
ప్రశ్నలములుకులు పెనవేసుకుని
ప్రతినిత్యం శూలాల్లా గుచ్చుకుంటూనే వున్నాయ్.
ఆహ్వానాలనందిస్తూనేవున్నాయ్.
ఉవ్వెత్తున ఎగసిపడే సందేహాలకు
సమాధానాలు చిక్కకుండా పరుగెడుతూనే వున్నాయ్.
అందిపుచ్చుకునే అవకాశాన్ని మెదడు అందిస్తూనే వున్నది.
చిక్కు వచ్చిపడిందల్లా చిక్కి శల్యమౌతున్న మనోధైర్యాన్ని
చిక్కులపాలిట బడి క్రుంగి కృశించకుండా
దగ్గరుండి నడిపించగల ధీరోదాత్తుడయిన
స్నేహశీలికోసమే ఈ నా నిరంతరాన్వేషణ.
===============================

బాధలున్నాయ్
ఐనా ఆశల చివుళ్ళు అనవరతం
సంధ్యాసమయాల్లో
జనన మరణాలమధ్యన ఆధ్యాత్మికతను

No comments:

Post a Comment