పొస్ట్ మార్టం
------------
మనిషి బొమ్మ క్రిందనపడి
బద్దలుగా పగిలిన చప్పుడు
కక్షలతో కావేషాలతో
అతని కుక్షినంతా నింపి
తృప్తిపడే
రాజకీయ చతురాననులు నేడు
అసంఖ్యాకంగదా
వారి బహుముఖీన చైతన్యం
బయట పడింది.
అతని మెదడులో
పెరకగుండామిగిన మంచితనపు పెరడునంతా
అందుకేనేమో దానికనుగుణంగా
నేడు దేశమంతా రకరకాల పాళ్ళలో నానారకాలా
నానారకాలా హింసాద్వేషాలు కుయుక్తుల కర్మాగారాలు.
సస్య శ్యామల సుక్షేత్రం
లాంటి అతని హృదయమంతటా
కలుపుమొక్కల కశ్మలంలా
మారిపోయి
విషప్పురుగులకు పర్యాటక
కేంద్రమై మిగిలింది.
అతని చేతులు రెండూ
అవినీతికి అధర్మానికి సోఈదాహరణానికి నిదర్శనంలా
లోహము దిమ్మెల్లా తయారయి
అసూయాద్వెషాలతో నిప్పులకొలిమిలా భగమంటూ
అఖండ జ్వాలలా అనునిత్యం
మండు తూనే ఉంటాయి..
అతని కళ్ళు కుళ్ళిపోయిన ఈ
సమాజ వ్యవస్థని నేరుగా తిలకించలేని
గాజు గుళ్ళ మాదిరిగా
పరివర్తనం చెందాయి.
అధర్మాన్న్నీ
అన్యాయానీ ముందుగానే
పసిగట్టాల్సిన అతని నాసికాపుటాలు
ఎప్పుడో తిరిగి
తెరుచుకోవడానికి వీలు గాకుండా మూసుకుని ముడుచుకు పోయాయి
ఇదండీ అతని విశ్వరూపం
మృత్యు ముఖద్వారంలోంచి
తొంగి చూస్తున్న మృణ్మయరూపుని విచిత్ర స్వరూపం
No comments:
Post a Comment