Monday, August 3, 2015

                                      స్వయంకృతం
అది నేషనల్ హై వే ని ఆనుకుని ఐదెకరాల పొలం స్తలంలో నిర్మించబడ్డ కాలేజీ. మొదట్లో జూనియర్ కాలేజీగా మొదలయినా అచిరకాలంలోనే అది పెద్ద డిగ్రీ  కాలేజీగా ఇంజనీరింగ్ కాలేజీగా పెరుగుతూ ఒచ్చింది ఇంకా విశాలమైన ప్రా0గణాలను నిర్మించి ,కలుపుకుంటూ. కాలేజీ తో పాటు హైవే కావడం తో ట్రాఫిక్ కూడా క్రమేపీ పెరుగుతూ వొచ్చిందిచిన్నగా ప్రమాదాలూ చోటు చేసుకోవడం మొదలయింది. అంతేకాదు యేటికేడాదీ మృతులసంఖ్యకూడా పెరుగుతూ పోతున్నది.
ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందనా రావడంలేదు ఒక్క స్పీడ్ బ్రేకర్ కట్టలేకపోయింది ప్రభుత్వం. ఇంతకన్నా వారి అలసత్వానికి సోదాహరణం యేం కావాలి చెప్పండి. పౌర  సంఘాల వాళ్ళు పత్రికలకు లేఖల రూపంలో వందల సంఖ్యలో జాబులు రాశారు. వినియోగ దారుల సంఘంగా యేర్పడి కమీషన్ కు పిటీషన్ పెట్టారు  అయినా చలనం లేదుప్రభుత్వ శాఖల వాళ్లు పెడ చెవిన పెట్టారే గాని ఆలకించిన పాపాన పోలేదు. సరికదా పౌర సంఘం వాళ్ళమీదనే ప్రచుత్వ ఉద్యోగులను బెదిరించారనీ , విధులు నిర్వహించకుండా అడ్దుకున్నారనీ  కేసులు పెట్టి వేధించారు. ఇక లాభంలేదని ఆఖరి అస్త్రంగా మానవ హక్కుల కమీషన్ కు .మనుషులుగా జీవించే ప్రాధమిక హక్కును కాలరాస్తున్నారని
ఫిర్యాదు చేసారు
అన్న్ని శాఖల్లాగా వీళ్ళూ ఊరుకోకుండా . సగం యస్ సగం వేసుకుని నెలలోగా నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు .. దాంతో కదలిక ఒచ్చింది. ఎవరో ఒక గుత్తేదారిచేత అయిందని పించారు తూ తూ మంత్రంగా
ఆపైన ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందే గాని అసలు లేకుండా పోలేదు.
ఒకటీఅరా జరుగుతూనే వున్నాయి. మళ్ళీ  పౌరహక్కుల సంఘం వారు పట్టు వదలని విక్రమార్కుల్లా రివ్యూ పిటీషన్ దాఖలు జేస్తే కమీషన్ వాళ్ళు ఒక న్యాయవాదిని వాళ్ళ తరుఫున కమీషర్ గా నియమిస్తూ నెలరోజుల్లొ పరిశీలించి
ని వేదిక ఇవ్వలని ఆదే శించారు . ఒక శుభ ముహూర్తాన   కమీషన నర్ గా నియమితమైన న్యాయవాది మరికొందరు మధ్య వర్తులతో ఫలానా తేదీన ఒస్తామని తెలియజేసారు. అందరూ సరిగ్గా పదిగంటల సమయానికి అక్కడకు చేరుకున్నారు పౌర హక్కుల వాళ్లు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర
జనం గుమిగూడి ఉన్నారు .మళ్ళీ యేదో ప్రమాదం సంభవి0చినట్లుందని దూరంగా ఉండగానె అర్ధమౌతున్నది ప్రమాదంలో అసువులు బాసింది అమ్మాయి .బంగారు తీగలా మెరిసిపోతున్నది. అక్కడచేరిన ఆడంగులంతా తిట్ల0దుకున్నారు.
వీళ్ళ దెవసంగూలసంవత్సరాలతరబడి పోరాడినా ఒక్క చిన్న పనిని చేయలేకపోయారు. ఇలా ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారో ఎదవన్నర వెధవలు అంటూ గునుస్తున్నారు . అందరూ అయ్యో పాపం యే కన్న తల్లిదం డు పిల్లో అధికారుల నిర్లక్ష్యం తో ప్రాణం మీదకు తెచ్చుకుంది.
ఇప్పటికయినా వాళ్ళ కళ్ళు తెరుచుకుని కాస్త గట్టిగా స్పీడ్ బ్రేకర్ను వేస్తే బాగుండు అనుకుంటున్నారు ఇంతకీ అమ్మాయి పోలీసుల పంచనామాలో ..శాఖ ..గారమ్మాయని నిర్లక్ష్యానికి బలయిందనీ ఒక్కొక్కరూ తిట్టుకుంటూ కదలిపోయారు... వచ్చి జేబులో గుత్తేదారుకివ్వవలసిన చెక్కు తనకు రావాల్సిన వాటా పైనే దృష్టి పెట్టా డే గాని ఇంకా వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెట్టిన పాపాన పోయినట్లు లేదు.చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. తండ్రి పాపానికి బంగారంలాంటి పిల్ల బలయిపోయిందని అందరూ ముక్కు చీదుకుంటూ ఉస్సురుస్సురనుకుంటూ అక్కడనించి బాధగా కదలిపోయారు.


No comments:

Post a Comment