Monday, August 3, 2015

ఆబాలగోపాలం
--------------------రావెల
బాల్యం
ప్రవహించే నీటిపై
విసరబడ్డ చిల్ల పెంకులా
గెంతుతూ గెంతుతూ
చిద్రమై
కనుచూపు మేరలోనే పేలవమై
అదృశ్యమైపోయింది.
యవ్వనం
ఎగసిపడే కెరటంలా
ఉవ్వెత్తుకెగిరి
ఊహల పల్లకీలో
ఊరేగుతూ సాగిపోయింది.
నడివయసు
నడమంత్రపు సిరిలాగా
నరం మీద కురుపులా
సంప్రదాయానికీ,
ఆధునికతకూ మధ్యన
సగం చిక్కి శల్యమౌతున్నది.
ఇక భానుమూర్తి
పశ్చిమాద్రిన గ్రుంకేసమయం
వృద్ధాప్యం
కోర్కెలనబడే పాదులను
కన్నీటి చలమలతో నింపుతూ
ఉదయాస్తమానాల మధ్య
ఊపిరిని బిగబట్టి
ఉస్సురుస్సురనుకుంటూ
తిక్కిరిబిక్కిరౌతూ సాగుతున్నది.

No comments:

Post a Comment