Monday, August 3, 2015

ప్రణయాంజలి  --1
జీవితం ఒక మధురాతి మధుర స్వప్నమైతే
ప్రణయాంతరంగ వదనం ఒక సుమసౌరభం.
కౌగిలిని సుందర సురిచిర అనుభూతిగా తలిస్తే
ప్రేమ ఒక చిత్రరచనా కౌశలంగా భాసిస్తుంది
జీవితం ఒకబహు వర్ణ లిఖితకళాఖండమయితే
వలపు తెమ్మెర ఒక ఇంద్రధనస్సులోని
సప్త వర్ణ సంకలిత మౌ మేలు కలయిక యై రహిస్తుంది

జీవితం ఒక శక్తిసమన్విత శుభాశ్రిత  పర్వమని భావిస్తే
ప్రణయం  భారతాంతర్హిత భావనయై రామణీయకమైబహుధా రాణిస్తుంది
 రమణీయార్ధ ప్రతిపాదితమై నిలువెల్లా చకచ్చకితమై  పల్లవిస్తుంది
---------------------------------------------------------------------

జీవన గీత-2
జీవితం ఎప్పటికీ ఒక కేలండర్ లాంటిది కాదు, కాలేదు, కాబోదు కూడా
నెలకొక పేజీ చొప్పన చినగడానికి
ఆఖరి నెలలో ఒంటరిదాన్నయానని కృంగి కృశించడానికి
జీవితం గిర్రున తిరిగే క్షణాలూ నిమిషాలూ పరంగా విలువైన దయితే
అది ప్రభవించే సూర్యునిలా  ప్రశమించే చంద్రునిలా నిరంతరం  నిరవధికంగా నినదిస్తూనే వుంటుంది .


తెరుచుకున్న జ్ఞాన కవాటాలు న్ను నిన్నుగా   తేలిక పరచుకునే వ్యవధి నివ్వవు
ఎవరెస్టు కన్నా ఎత్తుగా నీ ఊహల కిర్మీరాలు శిఖరాయమానమై నిలుస్తాయి
అనపరతం  నీవు అప్రమత్తుడవై  జాగరూకతతో ప్రవర్తిల్లు
ఒక సారి పతన దిశగా పరుగులెట్టావో,అగాధాల అంచుల్లోకి
జారి పడడం మాత్రం ఖాయమని గ్రహించు..

========================================

No comments:

Post a Comment