ఒక వృద్ధగురువు తన శిష్యుడి ఫిర్యాదులు వినీవినీ విసుగుచెందాడు.
ఒక ఉదయం అతన్ని కొంత ఉప్పు తీసుకురమ్మని పంపాడు.
తీసుకువచ్చాక, అతన్ని చేతినిండా ఉప్పు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి తాగమన్నాడు. ఎలావుందని అడిగాడు గురువు. భరింపలేని రుచి అన్నాడు శిష్యుడు.
గురువు చిరునవ్వు నవ్వి, ఆ యువకుడిని, మరలా చేతినిండా ఉప్పు తీసుకొని సరస్సులో కలపమన్నాడు.
వారిద్దరూ సరస్సు ఒడ్డుకి నిశ్శబ్దంగా నడిచారు. శిష్యుడు చేతిలోని ఉప్పు సరస్సులో కలిపాడు. ఇప్పుడా సరస్సులో నీరు తాగమన్నాడు వృద్ధగురువు. త్రాగాక, ఇప్పుడా నీటిరుచి ఎలావుందని అడిగాడు. 'తాజాగా వుంది ' శిష్యుడు. గురువు 'నీకు ఉప్పదనం తెలిసిందా '. అతను లేదన్నాడు.
ఆ వృద్ధుడు అతని ప్రక్కన కూర్చుని మృదువుగా ఇలా చెప్పాడు ' జీవితంలోని బాధ ఉప్పులాంటిది. అది ఎక్కువా కాదు, తక్కువా కాదు. అది ఎప్పుడూ ఒకే మోతాదులో వుంటుంది. కానీ దాని రుచి మనం ఆ బాధని ఉంచిన పాత్రపైన ఆధారపడివుంటుంది. కనుక, నీకు బాధ కలిగినప్పుడల్లా నువ్వు చెయగలిగిన ఒకే పని, దానిని అనుభవించే వ్యక్తిని విశాలం చెయ్యటం. కనుక అలాంటపుడు, నువ్వు ఒక గ్లాసులా వుండకు. సరస్సు వలే వుండు '

కంటికి అతిదగ్గరగా రాయిని
పెట్టుకుంటే అది చూపుకు ఓ బండరాయిలా అడ్డుపడుతున్నట్లనిపిస్తుంది.
అదే దాన్ని దూరంగా వుంచి
వీక్షించగలిగితే చిన్న పలుగు రాయిలా యధాస్థితిలో సాక్షాత్కరిస్తుంది.
మన మామూలు చూపుకేమాత్రం
అవరోధం కలిగించదు. అల్లాగే సమస్యలనూ అదే దృష్టి తో చూడగలగాలి .
No comments:
Post a Comment