జంకేలనే నీకు
యేడనున్నా నీవు నాదానివే గంద
ముక్కు ముక్కెరపైన భానయ్య కిరణాలు
ఇంద్ర చాపాలుగా మారినాయే సూడు
దినమంతా శ్రమకోర్చి నువ్ కట్ట పడుతుంటె
తిని కూకోవాలంటె నాకు. సిగ్గవుతాదె
నాకేదొ పని యిచ్చి ఆదుకోవాలంటు
నీ అయ్యతోసెప్పి ఆలకించవె మనసు.
సోమరోడిని కాదు సొంత మడిసినె, నేను
నా నీడనే నీకు సొర్గమూ సుకమూ.
యేడనున్నా నీవు నాదానివే గంద
జంకేలనే నీకు జవరాల ఇకపై.
మనసు మనసూ కలిసి
గుండె గుండె తో చేరి
ఆటగ పాటగాచే సి మనువాడగా మనము
సాగిపోదా బతుకు సాగిలగా బడకుండా
సరసులో హంసలా
నింగిలో నిండు చంద్రునిలా
యేడనున్నా నీవు నాదానివే గంద
జంకేలనే నీకు జవరాల ఇకపై.
-------------------------------------
No comments:
Post a Comment