Monday, August 3, 2015

సన్నుతి
సీ// ఉయ్యల తొట్టిలో ఉంగాలు వల్లించు
చిన్ని పాపాయికి వన్నెలద్ది
వడి వడి నడకల తడబడు శిశువుకు
చేయూత నివ్వగా చెంగలించె
అంటరానితనము ఇంటింటికెగబ్రాక
గబ్బిలము తోడుత  గతిని మార్చె
వయసు ముదిరిననాడు వజ్ర హాసము వోలె
కాటిసీను కవిత గణుతికెక్కె
నొప్పింపజేయ తామెప్పింపజూసెను
ఖండకావ్య రచన కౌగిలించ
తే //గీ  :అలతి అలతి పదాల  తెలుగు పద్యములల్లి
అందరి హృదయాల నధివసించె
జాషువా కవివరుని జాతిరత్నముగానె
ఊహసేయవలయు ఉర్వినందు


No comments:

Post a Comment