Monday, August 3, 2015

ఇదీ  భారతం
కాలుష్యపు కోరల్లో చిక్కుకుని
కకావికలౌతున్న నగర జీవనం
సంసృతీ సంప్రదాయాలకు భిన్నంగా
సాగిలబడి పోతున్న మానవత్వం
కరువయిపోతున్న విలువలకు
ఖజానాలుగా
మారురున్న పల్లె సీమలు
అంగడి బొమ్మలుగా మాత్రమే
చిత్రించబడే ఆడతనం

అక్షరానికీ అక్షరానికీ మధ్య
అంతరాల ఆంతర్యాలు
అన్నీ మనసుకెక్కించుకుని
ఆందోళన పడుతున్న మనిషితనం
వెలుగు తెరల వెనుకన
వేదన కల్గించే విషాద గాధలు
బాల్యాన్ని ఎరగావేసి
 ఆటంటూ పాటంటూ
వేదికలెక్కుతున్న వెకిలితనం.

నిరంతరవార్తాస్రవంతులతో
చెవులకు చిల్లులు పొడిచే
రాజకీయ నేతల
 హీనచరిత్రల కధనాలు
అధికారపీఠమెక్కి కులికే
అవినీతి సామ్రాట్టుల,
ఐశ్వర్య ధామాలు
కక్షలను కావేషాలను
 రంగరించి పోసే
నికృష్టపు
 దుష్టదర్శనాల
ధారావాహికలు
ప్రణయం, కాదంటే
ప్రళయమే నని 
వింతవింత పోకడలతో
విజృంభిస్తున్న పడుచుదనం
పోరగాళ్ళ పోకిరీ చేష్టలు .

బూతుపదంలేనిదే
భవితవ్యమంటూ లేదని
అసభ్యమూ అశ్లీలమూ ఐన పదాల
 పోహళింపుతో
 మల్లెల వేళల్లో ముళ్ల పొదలను
పేరుస్తూ
ఇదే నిత్యమనీ నిఖిలమనీ 
 భ్రమపడుతూ
 మిడిసిపడుతున్న [వి] చిత్రసీమలో
సౌమనస్యాన్ని సాహిత్య సీమలను,
విషపూరితం చేస్తున్న విద్యల విలువ
తెలుసుకోలేని వింతపశువులు .

అన్నీ నిన్నటికధలై అంతరించిపోవాలని
సర్వేశ్వరుడినిప్రార్ధిస్తూ
 కాలం వెళ్ళ దీస్తున్న వృద్ధాప్యం.


No comments:

Post a Comment