Monday, August 3, 2015

అమృతోపమైన నీ సంభా షణలోని సారాన్ని
స్వాదుయోగ్యంగా భావించి
సమున్నతంగానూ ఎంచుకుని
శిరోధార్యంచేసుకునేదిశగా

ముందుకడుగులువేస్తున్నాను ప్రభూ !!!
------------------------------
అసలు సాపత్యమేమన్నా-------
------------------
అల్లంత దూరాన
ఆశల పల్లకీ నధిరోహించి
ఊహల వుయ్యాలలూగుతూ
ఉత్సాహ భరితమైన కాంతి పుంజంలా  నీవు
ఇటువైపున నేను
ఒంతరితనం పాఠశాలలో
నిరంతర సహాధ్యాయిగా
సంక్లిష్టమైన స్థితిలో
నిలువునా విస్తరిస్తున్న
చీకటిలో  నిరంతరం  కుమిలిపోతూ
నిస్సహాయం గా  నేను.
బాధల గతాన్ని భావితరాలకు
అందించ నుంకించని మానసంతో
రాబొయే సమరానికి కాబోయే ధీరునిలా
సమాయత్తమౌతూ ,
ఆశావహమైన అదృష్ట వంతుల
సాహచర్యాన్ని అభిలషిస్తూ నేను.

నీవేమో నిండు గొదావరిలా తొణకక బెణకక
ప్రవాహసదృశంగా ముందుకురకలు వేస్తూ
అడుగడుగునా నూత్న మర్యదలను సంతరించుకుంటూ
నీకూ నాకూ మధ్యన అసలు సాపత్యమేమన్నా కుదురుతుందా అని
సంశయాత్మతో క్రుశిస్తూ 
కునారిల్లుతూ

No comments:

Post a Comment