కరుణాంతరంగ------
-----------------------
అలనాటి యమునాతటిచెంతన
తీరిగ్గా తిష్టవేసి
శ్యామసుందరునిపై రసరమ్య
గీతాల నాలపించిన గోపికలలో
గొప్పవై కుదురుకున్న
నిరపరాధిగా ముద్రపడిన
రాధమ్మవు నీవేకదా?
గాలిపడగలూ నీటిబుడగలతో
గాలిదుమారంలో చిక్కుకున్న
మొహనవంశీలతవు నువ్వేగదా?
కనులతోనే భావనా ప్రపంచాన్ని
ప్రేక్షకులముందు సాక్షాత్కరింపజేసిన
మహానటి సావిత్రమ్మవు నీవు కాదా?
మావూరి వాగొడ్దున కుదేలై కూలబడి
కుంటలోని నీటిని తాగి కడుపును నింపుకుని
లల్లాయిగీతాలతో జనహృదయాలను
తస్కరించిన తరుణీలలామవు నీవుకావా?
ప్రణయ భావ కవితాఝరిలో
హృదయేశ్వరివై కన్నుల్లో
అనంతాంబరపు నీలినీడలను నింపుకున్న
ఊహాప్రేయసి ఊర్వశివి నువ్వేకదా
ఆరమణీయపుష్ప వనంలోని మేడలోని
మారుమూల గదితలుపులు తీసి మెల్లగా
కిందివరుసలోని మెట్లను దిగి వచ్చిన కరుణాంతరంగ
పదునయిదేండ్ల ఈడుగల బాలిక రాచపిల్ల పోలికలు గల
కుంతీకుమారివి నువ్వేకదా?
============================================
-----------------------
అలనాటి యమునాతటిచెంతన
తీరిగ్గా తిష్టవేసి
శ్యామసుందరునిపై రసరమ్య
గీతాల నాలపించిన గోపికలలో
గొప్పవై కుదురుకున్న
నిరపరాధిగా ముద్రపడిన
రాధమ్మవు నీవేకదా?
గాలిపడగలూ నీటిబుడగలతో
గాలిదుమారంలో చిక్కుకున్న
మొహనవంశీలతవు నువ్వేగదా?
కనులతోనే భావనా ప్రపంచాన్ని
ప్రేక్షకులముందు సాక్షాత్కరింపజేసిన
మహానటి సావిత్రమ్మవు నీవు కాదా?
మావూరి వాగొడ్దున కుదేలై కూలబడి
కుంటలోని నీటిని తాగి కడుపును నింపుకుని
లల్లాయిగీతాలతో జనహృదయాలను
తస్కరించిన తరుణీలలామవు నీవుకావా?
ప్రణయ భావ కవితాఝరిలో
హృదయేశ్వరివై కన్నుల్లో
అనంతాంబరపు నీలినీడలను నింపుకున్న
ఊహాప్రేయసి ఊర్వశివి నువ్వేకదా
ఆరమణీయపుష్ప వనంలోని మేడలోని
మారుమూల గదితలుపులు తీసి మెల్లగా
కిందివరుసలోని మెట్లను దిగి వచ్చిన కరుణాంతరంగ
పదునయిదేండ్ల ఈడుగల బాలిక రాచపిల్ల పోలికలు గల
కుంతీకుమారివి నువ్వేకదా?
============================================
No comments:
Post a Comment