Tuesday, August 18, 2015

కలగాపులగంగా
--------------రావెల

గిజిగాడికోసంవెదుకుతూ ఓ గూడు
పత్తేదారుల నైజాన్ని పుణికి పుచ్చుకుంటూ.
అంతరాంతరాళాల్లో అన్వేషణల పర్వంలో
అస్త్వవ్యస్తమౌతున్న జీవన సమరంలో
ఓ పాంధుడిలా పర్యవేక్షిస్తున్న ప్రవాసంలొ.

ముడతలతో మూలనపడివున్న ముసలమ్మలా
మబ్బులమధ్యన నయగారాలు పోలేకపోతూ
వ్యధచెందుతున్న ఆర్తత్రాయ పరాయణుడిలా
భగవత్సాక్షాత్కారాన్ని కాంక్షించే భక్త శిఖామణిలా
వెదుకులాటలో వేదనాంతరంగాన్ని ఆ విష్కరించుకోవాలన్న
తపనను వ్యక్తీకరిస్తూ  తహతహలాడుతూన్న తనువు.

దారితప్పిన బాటసారి మనస్సు పడుతూన్న బాధల గాధలను
ప్రకటించాలన్న భావనకు సుదూరంగా కనబడుతూన్న దారులను
విశ్లేషణాత్మకంగా వింగడిస్తూ హృదయగతమైన శోధనలు.
 ఒడ్దుకు చేరుకునే మార్గం కోసం వెదుకుతూ
వ్యధార్త హృదయపు యదార్ధ దృశ్యాలను క్రోడీకరించుకుంటూ.
ఆశోపహతులైన అదృష్టహీనులను క్రమపట్టికలో ఉదాహరిస్తూ.
=====================================

No comments:

Post a Comment