Monday, August 17, 2015

అనూదితమైన కరస్పర్శతో----
------------------రావెల

===============
తెగిన గాలిపటంలా నువ్వూ
నిన్ను అల్లుకుని తిరుగుతూన్న నేను.
ఇద్దరం ఇట్టా ఇంటికీ మింటికీ కాకుండా
ఇలా ఇక్కడే ఇబ్బందిగా మిగిలిపోయాం.

పువ్వుల దగ్గర నవ్వులు నేర్చుకున్నామని
ఎంతగా మురిసి విరబూసి పరిమళ భరితమై
ప్రశమిస్తూ పరవశించిపోయామో ఒక్కక్షణం
గుర్తుకు తెచ్చుకో-- ఆపరీమళ సుగంధాల
సువాసనలను మరలా పుణికి పుచ్చుకునే ప్రయత్నంలో
సఫలీకృతమవాలని సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుదాం.

ప్రతి ప్రభాతమూ ఒక సుందర స్వప్నమై ప్రభవించాలనీ
అసురసంధ్యవేళ  సమీపించేదాకా ఆనందం
మన హృదయ ప్రాంగణంలో  పరివేష్టితమై అంచులంటా అంటిపెట్టుకుని
నిరంతరం ధునిలా ప్రవహించాలని పవళింపువేళకు
మనం తదేక దృష్టితో ప్రకృతిమాత పరవశమైపోయేలా
మన దైనందిన జీవితాన్ని ధర్మ మార్గానుయత్తులమై
ప్రగాఢ విశ్వాసంతో ప్రకటితమైన లక్ష్యాలను
నిర్దేశించుకుని వాటిసాధనలో ధన్యులమై మిగిలిపోవాలనీ
స్వార్ధరహితంగా పరోపకారార్ధులమై పునీతంకావాలనీ
ఆశా జీవులుగా అర్ధవంతమైన జీవనమార్గాన్ని
అద్వితీయంగా మలచుకుంటూ అడుగుముందుకు వేద్దాం సరేనా నడువు!!!
=======================================================

No comments:

Post a Comment