Saturday, August 1, 2015

కింకర్తవ్యం
----------------------
మనిషితనంతటతాను
చీకటిలో కలిసిపోతున్నాడు.
వెలురేకలక్కందనంత దూరంగా
వేగంగా జరిగిపోతున్నాడు.

ఒక్కోసారి ఇదేమనిషి విషాద సంద్రమై
పొంగి ప్రవహిస్తుంటాడు.
అగాధాల అట్టడుగుదాకా వెళ్ళి అదృశ్యరూపం దాలుస్తాడు.


గాలిని స్థంభింపజేయగలనని
గప్పాలు కొడుతుంటాడు.
కడుపులో శివలింగాలున్నాయని
మాయ మాటలతో మార్మోగుతాడు.

ఎందుకు మనిషి యిలా
మాయల ఫకీరులా ప్రవర్తిస్తున్నాడు?.
సంస్కృతీ సంప్రదాయాలకు
సవాలుగా పరిణమిస్తున్నాడు.

పరుల మేలుకోరలేని
 పశువులా మారిపోతున్నాడు.
ఇతరులబాగునుచూసి
కన్నుకుట్టేలా విషాదమేఘమై
వెలవెలబోతున్నాడు.

భ్రమల వికసనంలో
బ్రష్టహేతువై మిగిలిపోతున్నాడు.
మానవత్వపు దారులను మరిచి
మరో దిశగా పయనిస్తున్నాడు.
కింకర్త్వ్యతా మూఢుడై కిమ్మిన్నస్తిగా
మూలకు జరిగిపోతున్నాడు.

No comments:

Post a Comment