కిమ్మిన్నాస్తిగా
=================రావెల
----------------------------
చేతుల్లోంచి జారిపడి
ముక్కలయిపోయిన గాజుసీసాలా
నీతో గడిపిన నాలుగు దశాబ్దాల
మధురస్మృతులూ నిమ్మకు నీరెత్తినట్లు
స్థాణువులై నిలిచిపోయాయి.
వాన పడేటప్పుడు అకాశం చెసే గడబిడలా
గుండెగొంతుకంతా గరళం త్రాగిన గళంలా
చేదువిషాన్ని నిశ్శేషంగా భరిస్తూ నిజజీవితాన్ని
ముందుకు నడిపించాలని విశేష కృషి సల్పుతున్నది.
గోడచేర్పులోపించిన వెండికంచంలా
నా వ్యధార్త జీవిత యదార్ధ దృశ్యం
అవసరానికి ఆదుకునే నిన్నే పదే పదే
తలచుకుని కృంగికృశిస్తూన్నది.
పోస్టుచేయబడని ఉత్తరంలా గడియపడని
తలుపుల మధ్య తలపులు తంపటిలో కాగిపోతూ
కనీటినికూడా శేషజీవితం ఆవిరవుతూంటే
చేసేదేమీలేక చూస్తూ కూర్చుంటున్నది.
అంత సంతోష సంబరాల మధ్య సాగిన సంసారం
ఇంతగా దు ఖనదిలో ఈదవలసి వస్తుందని ముందస్తుగా
వూహించలేకపోయిన గుండె కరగినీరవుతూ కన్నీటి
కడలివైపుకు దిశానిర్దేశo చేసి కిమ్మిన్నాస్తిగా వూరుకుంటున్నది.
====================================
=================రావెల
----------------------------
చేతుల్లోంచి జారిపడి
ముక్కలయిపోయిన గాజుసీసాలా
నీతో గడిపిన నాలుగు దశాబ్దాల
మధురస్మృతులూ నిమ్మకు నీరెత్తినట్లు
స్థాణువులై నిలిచిపోయాయి.
వాన పడేటప్పుడు అకాశం చెసే గడబిడలా
గుండెగొంతుకంతా గరళం త్రాగిన గళంలా
చేదువిషాన్ని నిశ్శేషంగా భరిస్తూ నిజజీవితాన్ని
ముందుకు నడిపించాలని విశేష కృషి సల్పుతున్నది.
గోడచేర్పులోపించిన వెండికంచంలా
నా వ్యధార్త జీవిత యదార్ధ దృశ్యం
అవసరానికి ఆదుకునే నిన్నే పదే పదే
తలచుకుని కృంగికృశిస్తూన్నది.
పోస్టుచేయబడని ఉత్తరంలా గడియపడని
తలుపుల మధ్య తలపులు తంపటిలో కాగిపోతూ
కనీటినికూడా శేషజీవితం ఆవిరవుతూంటే
చేసేదేమీలేక చూస్తూ కూర్చుంటున్నది.
అంత సంతోష సంబరాల మధ్య సాగిన సంసారం
ఇంతగా దు ఖనదిలో ఈదవలసి వస్తుందని ముందస్తుగా
వూహించలేకపోయిన గుండె కరగినీరవుతూ కన్నీటి
కడలివైపుకు దిశానిర్దేశo చేసి కిమ్మిన్నాస్తిగా వూరుకుంటున్నది.
====================================
No comments:
Post a Comment