మౌనపరిభాష
--------------------
రణగొణ ధ్వనులమధ్యన
రాణకెక్కుతున్న శబ్దకాలుష్యాన్ని
దూరంగా తరిమెయ్యాలని
నిరంతరం స్వేదాన్ని వెలారుస్తూ
నిరవధికంగా
శ్రమిస్తున్నాను .
ఆమరుక్షణమే నిశ్శబ్దాన్ని
ప్రేమించడం ప్రారంభించాను .
నానాటికీ అస్తవ్యస్తమౌతున్న
నగరజీవనం ---దుర్భరమైపోతుంటే
పల్లె సీమల చెంతకు పలాయనం చిత్తగించేలా
మనసును
పారేసుకుంటున్నాను .
జలవనరులనన్నింటినీ
కాలుష్యాల కాసారాలుగా మారుస్తున్న
కర్మాగారాలను
విషతుల్యంగా భావించి
ఈసడిస్తూ పోతున్నాను .
భరించ వీలులేనంతగా తయారయిన
వాహనాల రొదలను గుండెను నిబ్బరంజేసుకుని మరీ భరిస్తున్నాను.
ఆరోగ్యం ఎవరి ఆదరణకూ నోచుకోని
అనవసరపు వస్తువుగా పరిణమించిన0దుకు
అంతరాంతారాళల్లో కృంగికృశించిపోతున్నాను .
ఎవరినవ్వు చూసినా
దర్శనమిస్తుండడం బాధకలిగిస్తున్నది.
ప్రేమాభిమానాలుకూడా కృత్రిమత్వాన్ని
సంతరించుకుని ఉనికినికోల్పోతున్న వైనం
గుండెను పిండి చెస్తున్నది
.
అన్ని లక్షణాలూ
అవలక్షణాల్లా సాక్షాత్కరిస్తుండడం
మనసును మునగదీస్తున్నది
ఎవరి అరుపులనూ కేకలనూ
భరించగలిగే స్థితిలోలేను
నేతల వాగ్దానాల కాలుష్యపు తరగలను
ఇసుమంతైనా ఓపలేకున్నాను
నన్ను క్షమించండి
నిశ్శబ్దాన్ని నమ్ముకుని నా శేష జీవితాన్ని
మౌనపరిభాషలోకి అనూదితంచేసుకోనివ్వండి .
No comments:
Post a Comment