వైవిధ్యంగా-------------
రఫీ కారు మెకానిక్ ముఖ్యంగా కారు ఏసి రిపేరులులో అతన్ని మించినవారు ఆ టౌన్లోలేరనే చెప్పుకోవచ్చు అతని మనసులో కార్పొరేట్ కల్చర్ యేర్పడలేదనే చెప్పుకోవచ్చు .అలాంటి రఫీకి ఒకసారి సడన్ గా గ్యాస్ లాగా ఒచ్చి ఇబ్బంది పెట్టింది . గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నా నొప్పి తగ్గలేదు .వాళ్లావిడకి భయం వేసింది. 108 కి ఫోన్ చెసి ఒచ్చాక క్రిష్ణశర్మ గారి ఆసుపత్రికి తీసుకెల్లింది. అందరూ ఆవిడని ఆడి పోసుకున్నారు . ఆ శర్మగారు కేవలం డబ్బు మనిషనీ యెవరు వెళ్ళీనా ఇంకాఐ సి.సి యూ లో వారం పాటు వుంచి ఒ ముప్పయ్ వేలు బిల్లు చేసి చెల్లింఛాక వొదిలేస్తాడు అన్నారంతా.. ఆయన మాకు దక్కితేచాలు డబ్బు రేపయినా
రెక్కల కష్టంతో సంపాదించుకుంటాం అని మొండికేసి మరీ వైద్యం
చేయించింది. తీసుకెల్లిన వెంటనే 3 వేల రూపాయల ఇంజక్షన్ చేసారు. ముందే డబ్బులివ్వబోతే అక్కర్లేదమ్మా ముందు మనిషిని బాగు చేద్దాం అని భరోసా ఇచ్చారు డాక్టర్గారు.
మనసులోని ఆయనకు కోటికోటి దణ్ణాలు పెట్టుకుంది జానీబీ , రఫీ భార్య.
వారం తర్వాత డిస్చార్జ్ చేస్తూ మీ ఆయన గండం నుంచి గట్టెక్కాడు.కానీ ఇకనుంచీ జాగ్రత్తగా వుండాలి సుమా మందు అలవాటు వుంటే మానెయాలి. గుట్కాలు తినడం మంచిదికాదు గ్రీన్ టీ మంచిది.నువ్వే ఆయన్ను కట్తదిచెయాలి లేకపోతె దక్కదుసుమా అని అన్ని జాగ్రత్తలు
చెప్పి పంపారు. మనసులో ఆయనకు దండం పెట్టుకుంటూ పిల్లల అదృష్టం సార్ ఆయన్ను మాకు దక్కించారు
ఇక ఆయన్ను జాగ్రత్తగానే కపాడుకుంటాను అన్నది.
-2-
ఇంటికొచ్చిన దగ్గర నించీ ఇరుగు పొరుగు మాటలు విని జానీబీని తిట్టడం సాగించాడు రఫీ ఉట్టి పున్యానికే విసుక్కోవడం కసురుకోవడం సర్వ సామాన్యమైది. .మనకు పెధాన మంత్రి గారన్నట్టు
నాడబ్బులు చెట్టుకు కాస్తే రాలేదే పగలనా రాత్రనాకా కాయకష్టం చేసి సంపాదిస్తే నువ్వు అదంతా ఆసుపత్రిలో డాక్టర్ గారి ఎదానపోసావే. నీకేంతెలుస్తుంది డబ్బు విలువ. అంటూ బూతుల పంచాంగం లంకించుకోవ డ0 నిత్యక్రిత్యమైంది.
నీ డబ్బులు నేను కూలీ నాలీ చెసి సంపాదించి ఇస్తాగాని కోపం నీ ఆరొగ్యానికి మంచిదికాదయ్యా మంచం మీద తొంగోని పడుకో అని బతిమాలేది జాన్ బీ.
ఆతర్వాత ఆర్నెల్లకు మల్లీ అలాంటి నొప్పే ఒస్తే జాంబీ తమ్ముడు హై ద్రాబాదులో మందుల కంపెనీలో చేసేవాడువచ్చి తనకు తెలిసిన దాక్తర్లు ఉన్నారని తీసికెల్లి అన్ని పరీక్షలూ చేయిస్తాను రమ్మంటే అంతగా ఇస్ట పదకపోయినా పెద్దసుపత్రుల్లో వైద్యం మంచిదేగదాని వెళ్ళారు కుటుంబం యవత్తూ.
ఈలోపు రఫీకి తెలియకుండానే సర్మ డాక్టర్ గారిపై గుండెలో కక్ష పెరుగుతూ ఒచ్చింది. ఈసారి ఆయన కారు రిపేరుకొస్తేఅంతకంత ఆయన దగ్గర్నించి డబ్బు గుంజాలని మనసు కుత కుత లాడేలా చేసుకున్నాడు రఫీ.దీనికి తోడు రఫీ మేనమామ అంతగా వైద్యానికి పేరురాని పల్లె వైద్యుడు ఇంకా బాగా ఎక్కించడంతో రఫీ రోజు రోజుకీ ఊగి పోతున్నాడు ఆరోజు ఎప్పుడొస్తుందా
-3-
అని ఎదురుచూస్తున్నాడు హైద్రాబాద్ రాగానే రఫీ బావమరిది కేర్ ఆసుపత్రిలో తనకు తెలిసిన కార్దియాలజిస్ట్ దగ్గరకు తీసుకెల్లాడు. అతను యాంజియో అదీ తీయాలని యేదయినా ట్రీట్మెంట్ మొదలెట్టాలంటే రెం డు. లక్షల రూపాయలు ముందుగా డిపాజిట్ చేయాలని చెప్పాడు. జాన్ బీ వైద్దిగానికి వెనకాడొద్దు భాయ్ అని హామీ ఇచ్చింది. దాంతో అతనే రెండు. లక్షల రూపాయలు డిపాజిట్ చేసి మరీ పరీక్షలు మొదలెట్టించాడు . నాల్రోజులతర్వాత అందరినీ రమ్మని అప్పటిదాకా రఫీ ఒక్కడే వుంటే చాలని చెప్పారు.
అప్పటీకీ రఫీ గుండె రగలడం మానలేదు సరికదా దిన దినాభివృద్ధి చెందడ0 మొదలెట్టింది .
ఈ నాల్రోజులూ జాన్ బీ మొక్కని దేవుళ్లు లేరనే చెప్పుకోవాలి . తను బతికి బాగా బయట బదితే వడ్డికాసులవాడీకి జుట్టు ఇస్తాననికూడా మొక్కుకుంది.
నాల్రోజులు భారంగానె గడిచాయి. ఐదో రోజు బిక్కు బిక్కుమంటూ ఆసుపత్రికి అంతా వెళ్ళారు.దాక్తరుగారిని కలవడానికి రెం డు. గంటలు పైనె పట్టింది . డాక్టర్ గారు
గుంటూరు డాక్టర్ గారిచ్చిన డి వీ డి తిరిగి ఇచ్చేస్తూ మీకు గుంటూర్లో వైద్యం చేసిన డాక్టర్ ఎవరు? అని అ డగ్గానే రఫీ పళ్ళు పట పటా కొరుకుతూ జాంబీ వైపు చూసాడు .జాంబీ మత్రం నిబ్బరంగా కిస్ట శరమ గారండీ అని గట్టిగానే చెప్పింది .
ఆయన
మీపాలిటి దెవుడమ్మా ఆ రోజు ఆయన ఆ ఇంజక్షన్ చేయకపోతే ఇప్పుడు మీ ఆయన పరిస్తితి ఇలా వుండెదికాదు. మంచి మందులు వాడి మీ ఆయన ప్రాణాన్ని కాపాడా
డ మ్మా . ఇప్పుడు ఆయనకేం విడిగా వైద్యం అవసరంలేదు. ఆమందులు వాడూతూ రెం డు నెలలకొకొక సారి ఆ డాక్టర్ గారిదగ్గరే వైద్యం చేయించుకోండి .ఇబ్బందేం రాదు. అని మీ
డిపాజిట్ రిసెప్షన్ లో తిరిగి ఇసారు తీసుకుని మీకేమైనా ఇవ్వాలనుంటే చిన్న పిల్లలలకు గుండె ఆపరేషన్ ఉచితంగా వైద్యం చేసే నిధికి విరాళం ఇవ్వండి అది నిబంధనేమీకాదండొయ్ మీ సంతోషం .అంతే మీరిక మీవూరెళ్ళొచ్చు. జాగ్రత్త రెం డు. నెలలకొకసారి దాక్టర్గారిని కలవడం మరిచిపోవద్దుసుమా అని చెప్పాడు.
రఫీ గుండె మరో రకంగా కొట్టూ కోవడం మొదలేట్టింది కృతజ్ఞతా సూచకంగా ..
ఇప్పుడు రఫీ ఆలోచనంతా ఆ డాక్టర్ గారి రుణం యేవిధంగా తీర్చుకోవాలన్నదే.
ఇది జరిగిన నాల్రోజులకు దాక్టర్ గారు తన కారు తీసుకుని రఫీ షెడ్దుకు రావడం తటస్తించింది. ఏసి సరిగా పనిచెయడంలేదు ఆధరైజుడు షోరూంకెలితే నలభై వేల రూపాయల రెపేరు అవుతుందనీ ఎ సి కిట్ అంతా మార్చాలని చెప్పారు రఫీ.
మళ్ళీ వాళ్ళే
నీదగ్గరకెల్ళ్లి చూపించమని చెప్పరు అనడంతో రఫీ కళ్లనీళ్ళ పర్యంతమై తన హైద్రాబాద్ యాత్ర గురించి చెప్పాడు.
ఎసి పెద్దగా రిపేరులేదనీ రెండువేలతో అయి పోతుందనీ చెప్పాడు. దాక్టర్ గారు జేబులోంచి
డ బ్బులు తీసి ఇవ్వబోతుంటే సార్ రిపేరు అయి , మీకు నచ్చాక ఇద్దురుగానిలెండి అని రిపేరు మొదలెట్టాడు రఫీ కళ్ళలో నీళ్ళు నిండి పోగా.
No comments:
Post a Comment