Monday, August 3, 2015

స్వయంవరం
క్యాంటీంకు టిఫిన్ కెల్లి ఒచ్చేసరికి నా టేబుల్ పైన అందమైన వెడ్డింగ్ కార్డ్ వుంది. దాన్ని చూడగానే వెంటనే తిరగెయ్యాలన్న తృష్ణ కలిగింది.పైన  అడ్రస్ చూడగానే ఆశ్చర్యం వేసింది.ఎప్పుడో దగ్గరదగ్గర ముప్పయ్యేళ్ళ కిందట పరిచయం. ఇద్దరం బ్యాంకులోనే చేసే వాళ్ళం.తనేమో బాగా సీనియర్ .కానీ చాలా ప్రేమాభిమానాలటొ చుసుకునే వాడు నన్ను. ఎందుకో తెలియదు. నన్ను నా వయసకు మించిన గౌరవాన్నందించే వాడు. పిల్లలను  బాగా చదివించమని వీలుదొరికినప్పుడల్లా సలహాలిస్తుండే వాడిని. ఆడపిల్లలనయినా సరే వివక్షంటూ చూపకుండానే చదివించమని మరీ మరీ చేప్పే వాడిని. మాలో ఎక్కడ కుదురుతుంది సార్ బురఖాల రాజ్యం మాది. మతానికీ కట్టు బాట్లకూ ప్రాధాన్యం ఎక్కువ సార్. మీరన్నట్లు మీ నో టి చలవన ఆరోజులంటూ  ఒస్టే అవకాశాల్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం సార్. అనే వాడు గౌస్ మొహిద్దిన్ .
ఆయన మనవరాలి పెళ్లి కార్డ్కొడుకు కూతురన్న మాట. అతను మేం కలిసి పనిచేసిన రోజుల్లో జులాయ్ గానె తిరిగే వాడు. ఎన్న్ సార్లు చెప్పి చెప్పె ఒక లైన్లో పడ్డాడు .తర్వాత మంచి బిజినెస్ మ్యాన్ గా స్థిరపడ్డాడు. హ్య్దరాబాద్లో రెయల్ యెస్టేట్ వ్యాపారం ఊపందుకుంటున్న ప్రారంభదశలో  హైదరాబాదుకు మకాం మార్చాడు .బాగానే వెనకేసుకున్నాడు . ఎవరో బ్రాహ్మలమ్మాయిని రెండొ పెళ్ళి చేసుకున్నాడని విన్నాను.మొదటమ్మాయికి తలాక్ చేప్పాడని ఈఅమ్మాయిని చేసుకున్నాక చేదోదు వాదొ డు గావుంటూ బిజినెస్లో సలహాలూ సంప్రదింపులనందిస్తూ ఒక ఉన్నత స్థాయికి చెరుకునేలా చేసిందని విన్నాను.

వధువు ఎంబీబియస్ చదివింది.వరుడు సాఫ్ట్  వేర్ ఇంజనీర్.కానీ ముస్లిం కాదు.క్రిస్టియన్ మతస్తుడు.
ఎంతకాలం నించి తెలుసు అని అదిగాను మొహిద్దీన్  ను ఫోన్లో. దాదాపు మూడెండ్లనుండీ పరిచయమట రావు గారూ.
అమ్మాయె అతని పద్ధతి నచ్చి మరీ ప్రపోస్ చేసిందట. ఆకుర్రాడు .అంత ఇంటరెస్ట్ చూపించలేదట.
అమ్మాయే అతని వెంటపడి వాళ్ళ తల్లితండ్రులను వొప్పించిందట.
పె ళ్లి మాత్రం చాలా సింపుల్గానే  చేయడానికే ఇద్దరూ ఇష్టపడ్డారుట . ఆడంబరాలకూ ఐశ్వర్య ప్రకటనలకూ హంగామాలకూ చోటివ్వకూదదనీ  ఇద్దరూ అనుకున్నారట. ఆర్భాటాలకెలితే  బాగుపడేది మధ్య ఈవెంట్ మేనెజ్ మెంట్ వాళ్ళే ఇరుక్ట్తుంబాల వాళ్ళూ కాదని ఇలాంటి నిర్ణయానికొచ్చారట. నొ గిఫ్ట్స్ ప్లీజ్  అని పెద్దాక్షరాలతో మరీ నోట్ రాయించారట.ఆహ్వాన పత్రికలమీద.అన్ని యేర్పాట్లూ మొహిద్దీన్ కొడుకు దగ్గరుండె చూసుకున్నాడు. అతని భార్యకూడా అందరినీ నమస్కారం చేస్తూ రిసీవ్ చేసుకున్న తీరు అందరినీ బాగా ఆకర్షించింది. వధూ వర్లుకూదా నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగానే ఉన్నారు.
వేదికమీదకెళ్ళాక అరగనృటలో పెళ్లితంతు పూర్తయింది. అక్కడ కొచ్చిన వారందరికీ నూతన వధూవరులు నమస్కారాలు చేస్తూ వాళ్ళ వాళ్ళ ఆశీస్సులు అందుకున్నారు.
అందరినీ వధూవరులిద్దరూ స్వయంగా దగ్గరుండి మరీ వీడ్కోలు చెప్పడం ముచ్చటేసింది.
వీడ్కోలు కుముందు వాళ్ళిద్దరూ 10 నిమిషాలు వాళ్ళ భావాలను ప్రకటించుకునే అవకాశం కల్పించారు. చెప్పినట్లుగా మురిపెం మాటలు కాకుండా హృదయగత భావాలను సుస్పష్టంగా ప్రకటించారు
తమది ఒకరకంగా అక్షరాలా ఆదర్శ వివాహమేనని ఇందుకు ఇరువైపులా పెద్దలు తమ తమ అంగీకారాలు తెలిపినందుకు జీవితాతం కృతజ్ఞతలు
తెలుపుకుంటామనీ తెలిపారు .ఒకరి భావాలు మరొకరు అర్ధం చేసు కోవడానికీ ముచ్చటగా మూడేళ్లు పట్టింది .అసలీ
ప్రపోజల్ మీకందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా నేనే చేసానని చెప్పడానికి గర్విస్తున్నాను. సిగ్గు పడడంలేదనీ ఉన్నదున్నట్లు మాత్లాడడం నాకలవాటేననీ ఇంకొలా చెప్పడం లేదని  మనవిచెస్తున్నాను.







No comments:

Post a Comment