పరివర్తనం
=================రావెల
ఒక శబ్దం
మరొక నిశ్శబ్దం
రెండింటిమధ్యనా
వాలి సోలిపోతున్న
మానవ రూపం
నచ్చిన రాగాలుకొన్ని
నచ్చని భావజాలం కొంత
అన్నింటినీ కలగలుపుకుని
అశ్వహృదయగతిన
తాదాత్మ్యం చెందుతూ నేను.
ఎక్కడినుంచో ఓ పిల్లతెమ్మెర
గ్రీష్మర్తువులో సాయంసమయానికి
నా చెంతకు చేరి బుగ్గను తాకిన వైనం
నా మనసు మల్లెపువ్వై పరిమళిస్తుంది.
సురభిళమైన సువాసనల సోయగాల
సంద్రమై ప్రవహిస్తుంది.
యేఋతువైతేనేం
అకాలం కానంతవరకూ హాయేగదా!!
పట్టమీల పరుగెట్టే ధూమశకటం
పరిణామక్రమాలను పరిశీలించడం సహజమేగదా!
వసంతంలో నిత్య హరితమై
శిశిరంలో జీర్ణసుందరియై
హేమతంలో కృష్ణపక్షమై
శరదృతువులో హిమ సోయగమై
విలసిల్లే ప్రకృతిమాతకు
స్వాగత సత్కారాలను యేర్పాటు
చేయడం మన కర్తవ్యం తరలిరండి.
ఈ పరివర్తననంతటినీ పండుగలాగా
ప్రతి ఇంటి ప్రాంగణం నూ రంగవల్లులతో
అలంకరించి ఆహ్వానం పలుకుదాం రండి.
=======================31-7-15
=================రావెల
ఒక శబ్దం
మరొక నిశ్శబ్దం
రెండింటిమధ్యనా
వాలి సోలిపోతున్న
మానవ రూపం
నచ్చిన రాగాలుకొన్ని
నచ్చని భావజాలం కొంత
అన్నింటినీ కలగలుపుకుని
అశ్వహృదయగతిన
తాదాత్మ్యం చెందుతూ నేను.
ఎక్కడినుంచో ఓ పిల్లతెమ్మెర
గ్రీష్మర్తువులో సాయంసమయానికి
నా చెంతకు చేరి బుగ్గను తాకిన వైనం
నా మనసు మల్లెపువ్వై పరిమళిస్తుంది.
సురభిళమైన సువాసనల సోయగాల
సంద్రమై ప్రవహిస్తుంది.
యేఋతువైతేనేం
అకాలం కానంతవరకూ హాయేగదా!!
పట్టమీల పరుగెట్టే ధూమశకటం
పరిణామక్రమాలను పరిశీలించడం సహజమేగదా!
వసంతంలో నిత్య హరితమై
శిశిరంలో జీర్ణసుందరియై
హేమతంలో కృష్ణపక్షమై
శరదృతువులో హిమ సోయగమై
విలసిల్లే ప్రకృతిమాతకు
స్వాగత సత్కారాలను యేర్పాటు
చేయడం మన కర్తవ్యం తరలిరండి.
ఈ పరివర్తననంతటినీ పండుగలాగా
ప్రతి ఇంటి ప్రాంగణం నూ రంగవల్లులతో
అలంకరించి ఆహ్వానం పలుకుదాం రండి.
=======================31-7-15
No comments:
Post a Comment