Saturday, August 1, 2015

ఇవ్వాళ స్నేహపుటౌన్నత్యాన్ని తలచుకునేరోజు
ఆనందాన్ని ఆసాంతం పంచుకోగలిగిన శుభ దినం .
మనిషినీ మనసునూ ఒక గాటన భగవంతుడు
కట్టిపడేసి కలసివుంటే కలదు సుఖమని బోధించిన రోజు.
నీకష్టాలకు వినేందుకు కర్ణపుటాలుగా
నీ సుఖసంతోషాలను చూసి
ఆనందించేందుకు నేత్రాలుగా
చెలికాడు పనిచేసే పవిత్రమైన భావనలను
అందిపుచ్చుకునే అమృతోపమైన రోజు.
మనిషి మనిషిగా బ్రదకడం మేలని
ప్రకృతిమాత విన్నవించిన మంగళకరమైన రోజు.

No comments:

Post a Comment