Monday, August 3, 2015

క్షామదేవతా--
--------------------రావెల
ఎంతపెద్దకళ్ళో దానివి
ఎక్కడపచ్చదనం కనబడితే
అక్కడ వాలిపోతుంది.
కళ్ళల్లో కన్నీటి సంద్రాలను
కడలి వేగంతో కాటేస్తుంది
కర్షకసోదరులజీవితాల్లో
నిప్పులకుంపటిని రాజేస్తుంది.
మంచి తనానికీ మానవత్వానికీ మధ్యన
అగాధాలను సృజిస్తుంది
మనిషితనాన్ని కనబడనీయకుండా
అదృశ్యరూపం దాల్చేలా సాయపడుతుంది.
వర్షాభావ స్థితిగతులతో బంతాట ఆడుకుంటుంది
కరువుకాటకాలనేపధ్యంలో కకావికలయేలా
కారణజన్మురాలై శాసిస్తుంది.
తాగునీరులేక సాగునీరు పారక
జనం గుండెలు చెరువయేలా జాతికి ద్రోహం తలపెడుతుంది.
ఆర్ధికస్తితిగతులనస్తవ్యస్తంజేసి అయోమయాన్ని పురిగొల్పుతుంది. 
--------------------------------------------------------------

No comments:

Post a Comment