ఉదయించేదిశగా
ఏకాకిని
ప్రభవించేక్రమంలో
ద్వైరూపిని.
పరాక్రమా క్రమంలో
త్రిగుణాత్మ స్వరూపాన్ని
నడయాడే దిసలో
చతురంభోధి పరీత
భూ వలయాన్ని .
ఈవికాసవిలసనా
వైరుధ్యాలలో
కబోదిలాంటి
కళాకారుణ్ణి .
అవతలి వారి ప్రశంసాపర్వాల్లో
అనవరతం సుఖ స్నాతను .
వెలుగు విస్తరిస్తున్నంతకాలం
వివేక చూడామణి ని
చీకటి చిరుసవ్వడి సేయగానే
సాయం సంధ్యావరణంలో
వయసు ఉడిగిపోతుందనుకుంటూ
భయవిహ్వలతతో వణికిపోయే
వామన స్వరూపాన్ని .
వానర ప్రవృత్తిలోంచి
బయటపడలేకపోతున్న
ఓ వింత మృగాన్ని
శాఖాచంక్రమణ దశలో
దిశా నిర్దేశం చేసుకోలేకపోతున్న
దీనుణ్ణి
మరుగుజ్జులాంటి మనసున్న
మనిషిని . .
No comments:
Post a Comment