Monday, August 3, 2015

ఉత్తర కాండ
నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
పల్లమెరిగిన నీరు ప్రవాహసదృశమై
కొండలనూ గుట్టలనూ దాటుకుని
ఉద్ధృతవేగధృతిలో కొంపలన్నింటినీ
నీటిలోకి ముంచుతూ ఉరవళ్ళతో ఉరికురికి పరుగెట్టింది
జనవాసాలన్నీ నీటన మునిగి హాహాకారాలతో పర్వత శ్రేణులన్నీ
ప్రతిధ్వనించే వేళ మౌనాన్నాశ్రయించిన మహామునిలా దైవం మిన్నకున్నది .
ఎందుకిలా జరిగిందనో జరిపించా వనో --?అడిగే ధైర్యం యే ఒక్క వ్యక్తీ కూడగట్టుకున్న దాఖలాల్లేవు .
అడవులను నరికి కొండలనూ గుట్టలనూ తవ్వీ తరగని  నిధులకోసం చేసిన పాపానికి ఇది సరయిన గుణపాఠం కాదా---ఈ ఈ ప్రాయశ్చిత్తం చాలదా అనిన్నీ
దేవుడు నిర్దాక్షిణ్యంగా నిలదీసి నిలువు పాతరేస్తాడేమోనని మనిషి భయకంపితుడై వణికి పోతున్నాడు
ఉత్తరాఖండమంతా తత్తరపాటు కలిగిస్తుంటే రాజకీయ మృగాలు మేమున్నమంటూ
గద్దల్లా పీక్కు తినాలని తద్వారా వారి వారి పార్టీలకుప్రయోజనం కల్పించుకొవాలనీ
మళ్ళీ గద్దెనెక్కెందుకు  ఇదొక మెట్టు గా భావించడం ఎంతనీచమో అర్ధమయింది.
మరోసారి తన స్వార్ధ పరమైన  నైజాన్ని నేతలు ప్రకటిస్తుంటే
మనిషి  నిలువు గుడ్లేసి నివ్వెరపోవడం తనవంతయిపోయినదని కృశించిపోతున్నాడు

----------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment