శ్వేతపత్రం
_________________
తెల్లటి ఈకాగితమ్మీద నల్లటి ఈ గీతలేమిటి?
పడుచు పోరి బుగ్గలమీద పరుచుకున్న ముద్దుల్లా
ఆవేశానికి ఆహుతయే
ఆలోచనారహితయువతమనసులా
నిశ్చలంగా సాగిపోయే బతుక్కి
నిఘంత్వర్ధంకాదు నే చెప్పేది
చకచ్చకితంగా వెలుగొందిననాడే
జగజ్జేగీయమానంగా ప్రభవించినప్పుడే
బతుక్కి పరిపూర్ణత్వం సంప్రాప్తిస్తుందని
జీ వితానికి ఓ హితబోధచేసా
ఆవేశానికికాదు అధికారం ఆలోచనకుండాలి
ఆశయాలు వల్లిచగలిన కొశలంగాదు
ఆంచరించగలిగే నైపుణ్యం వుండాలి
అంతే క్షణాల్లో వింత మార్పులు చోటు చేసుకున్నాయ్
నీటితో నిండినకొలనులో
నిమ్నొతాలనుకుదిపేపరిణామం
కదలకుండా స్థాణువై నిలిచిన భవితవ్యానికి
కాలచక్రంతో బాటు
పరుగులిగిడగలిగినవిద్యుచ్చాలనం.
_________________
తెల్లటి ఈకాగితమ్మీద నల్లటి ఈ గీతలేమిటి?
పడుచు పోరి బుగ్గలమీద పరుచుకున్న ముద్దుల్లా
ఆవేశానికి ఆహుతయే
ఆలోచనారహితయువతమనసులా
నిశ్చలంగా సాగిపోయే బతుక్కి
నిఘంత్వర్ధంకాదు నే చెప్పేది
చకచ్చకితంగా వెలుగొందిననాడే
జగజ్జేగీయమానంగా ప్రభవించినప్పుడే
బతుక్కి పరిపూర్ణత్వం సంప్రాప్తిస్తుందని
జీ వితానికి ఓ హితబోధచేసా
ఆవేశానికికాదు అధికారం ఆలోచనకుండాలి
ఆశయాలు వల్లిచగలిన కొశలంగాదు
ఆంచరించగలిగే నైపుణ్యం వుండాలి
అంతే క్షణాల్లో వింత మార్పులు చోటు చేసుకున్నాయ్
నీటితో నిండినకొలనులో
నిమ్నొతాలనుకుదిపేపరిణామం
కదలకుండా స్థాణువై నిలిచిన భవితవ్యానికి
కాలచక్రంతో బాటు
పరుగులిగిడగలిగినవిద్యుచ్చాలనం.
రంగులవల
*********************
ఊసరవెల్లులు తిరుగుతున్నాయ్
ఉన్మత్త పిశాచాల్లా
జంతు లోకానికే పరిమితంకాకుండా
వింతగా మానవసమజంలోకీ చొచ్చుకొస్తున్నాయ్
తక్కువ సంఖ్యలో లభిమే వసువుల్లోనే
ఎక్కువసంఖ్యలో ఎదుగుతూవస్తున్నాయ్
పూటపూటకూ ధరలను ఆకాశానికెత్తేసీసంఖ్యాకంగా
పాపాన్ని మూఒటగట్టుకుంటున్నాయ్
ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన
పార్టీల్లోనూ ప్రత్యక్షమౌతున్నాయ్
రోజుకొ పార్టీ ని ఫిరాయిస్తూ
తాజాగా వెలుగొందుతున్నాయ్
సాహితీసీమల్లోనూఇవి
స్వేచ్చగాతిరుగాడుతున్నాయి
సిద్ధాంతాలరాద్ధాంతాలతో
అస్తిత్వాన్నికోల్పోయి
ద్వేషవైషమ్యాలతో చివురులుతొడిగి
చిరంజీవులౌతున్నాయ్ .
జంతుప్రపంచంలోనూ
వింతమానవహృదయాల్లోనూ
ఊసరవెల్లులు విహరిస్తున్నాయ్
ఉన్మత్త పిశాచాల్లా
---------------------------------------------
*********************
ఊసరవెల్లులు తిరుగుతున్నాయ్
ఉన్మత్త పిశాచాల్లా
జంతు లోకానికే పరిమితంకాకుండా
వింతగా మానవసమజంలోకీ చొచ్చుకొస్తున్నాయ్
తక్కువ సంఖ్యలో లభిమే వసువుల్లోనే
ఎక్కువసంఖ్యలో ఎదుగుతూవస్తున్నాయ్
పూటపూటకూ ధరలను ఆకాశానికెత్తేసీసంఖ్యాకంగా
పాపాన్ని మూఒటగట్టుకుంటున్నాయ్
ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన
పార్టీల్లోనూ ప్రత్యక్షమౌతున్నాయ్
రోజుకొ పార్టీ ని ఫిరాయిస్తూ
తాజాగా వెలుగొందుతున్నాయ్
సాహితీసీమల్లోనూఇవి
స్వేచ్చగాతిరుగాడుతున్నాయి
సిద్ధాంతాలరాద్ధాంతాలతో
అస్తిత్వాన్నికోల్పోయి
ద్వేషవైషమ్యాలతో చివురులుతొడిగి
చిరంజీవులౌతున్నాయ్ .
జంతుప్రపంచంలోనూ
వింతమానవహృదయాల్లోనూ
ఊసరవెల్లులు విహరిస్తున్నాయ్
ఉన్మత్త పిశాచాల్లా
---------------------------------------------
మౌనభంగం
రావెల పురుషోత్తమరావు
9394100531
గదితలుపులు మూసుకుంటున్నాయ్
గతస్మృతులను భరించే సహనంలేక
పరిపరివిధాలా పరుగెడుతుంది మనసు
పదిలంగా నిలదొక్కుకునే పాటు దొరక్క
ఎన్నేళ్ళు గదిచిపోతున్నా ప్రేయసి
కన్నీటి చెలమల్లోనే సాక్షాత్కరిస్తున్నది
మూడు ముళ్ళకూ దూరమయే ప్రణయం
మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయే ప్రమాదం వున్నది
కాంతి పుంజాలను సైపజాలని ఊహలు
కాళ రాత్రిని గాఢంగా కౌగిలంచుకుంటున్నవి
శబ్దతరంగాలను భరింపజాలని క్షణాలు
శూన్య సంకేతాలను చుంబిస్తున్నాయి
యే దిశగానుంచో గాలి ఈలవేసిన చప్పుడు
నాపాలి దైవం కరుణించినదేమో సుమా ఇప్పుడు
అదిగో ప్రణయిని పలకరిస్తున్న పిలుపుల ప్రతిధ్వనులు
ప్రణయపయోధిలో కేళీ విలసానికి,స్వయంగా సన్నాహాలు చేస్తున్న దాఖలాలు
గదితలుపులు మెల్లగా తెరచుకుంటున్నాయి
మధురభావనలను ప్రతిపాదించుకుంటూ
పదిలంగా తిష్ఠ వేస్తున్నదిమనస్సు
పరాకును చిత్తగించమని పదే పదే విన్నవించుకుం టూ
రావెల పురుషోత్తమరావు
9394100531
గదితలుపులు మూసుకుంటున్నాయ్
గతస్మృతులను భరించే సహనంలేక
పరిపరివిధాలా పరుగెడుతుంది మనసు
పదిలంగా నిలదొక్కుకునే పాటు దొరక్క
ఎన్నేళ్ళు గదిచిపోతున్నా ప్రేయసి
కన్నీటి చెలమల్లోనే సాక్షాత్కరిస్తున్నది
మూడు ముళ్ళకూ దూరమయే ప్రణయం
మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయే ప్రమాదం వున్నది
కాంతి పుంజాలను సైపజాలని ఊహలు
కాళ రాత్రిని గాఢంగా కౌగిలంచుకుంటున్నవి
శబ్దతరంగాలను భరింపజాలని క్షణాలు
శూన్య సంకేతాలను చుంబిస్తున్నాయి
యే దిశగానుంచో గాలి ఈలవేసిన చప్పుడు
నాపాలి దైవం కరుణించినదేమో సుమా ఇప్పుడు
అదిగో ప్రణయిని పలకరిస్తున్న పిలుపుల ప్రతిధ్వనులు
ప్రణయపయోధిలో కేళీ విలసానికి,స్వయంగా సన్నాహాలు చేస్తున్న దాఖలాలు
గదితలుపులు మెల్లగా తెరచుకుంటున్నాయి
మధురభావనలను ప్రతిపాదించుకుంటూ
పదిలంగా తిష్ఠ వేస్తున్నదిమనస్సు
పరాకును చిత్తగించమని పదే పదే విన్నవించుకుం టూ
చాంద్రాయణం
***************
భయం గుప్పిట్లో
పడక్కుర్చీలో పడుకుని
ప్రపంచదర్శనం చేస్తుంటాను
విశ్రాంతిగా విరామ సమయాల్లో
వీలుదొరకినప్పుడల్లా వ్యతిరిక్తమైన భావాలను ప్రోదిఛేసి
విషగుళికల్లా ఇంటీంటికీ పంపిణీ చేసే వార్తాపత్రికల
జోరును చూసి నవ్వుకుంటూ, మరో దిక్కుతోచక
వాటినే పునః పునః తిరగేస్తుంటాను.
కలవారి భాగ్య మయ ప్రస్థానాలకు
కలలతో కాలిడిన కోడళ్ళ ం తో కూడిన భావజాల 0 తో
కూడిన భావజాల ంతో మిళితమైన కండకావర ప్రసంగాలూ
కక్షలతో కావేషాలతో కాగిపోయే కళ్ళ కార్ఖానాలూ
వయసులోని వనితల వొపు సొంపుల ప్రదర్శనలతో
వేడెక్కుతూ మార్మోగిపోయెవాణిజ్య ప్రకటనల వేలం వెర్రులూ
తాయెత్తులతో ధన కనక వస్తు వాహన యోగం ,
తప్పక వస్తుందని ఊరించే ,ఊదరగొట్టే
మాయామర్మాల తోకూడిన జిత్తులమారి
స్వామీజీల సందేశాల సం రం భాలూ
అన్నింటినీ ఒక చెవ్వితోవిని
మరో చెవిగుండా వదిలేస్తున్నాను
పురుషుడి గా ఉద్యోగం లక్షణంగా చేసికుంటూ
పిల్లలందరూ వారి వారి స్థానాల్లో సెటిలయిపోగా
తీరిగ్గా పదకకుర్చీకే పరిమితమైపోయి
ప్రపంచదర్శనం రోజూ పరిమితవేళల్లో
మునివే ళ్ళమీద చాం ద్రాయణంలా
చేస్తూ పోతుజీవితకాలాన్ని
బహుధా వ్యర్ధపరుస్తున్నాను .
***************
భయం గుప్పిట్లో
పడక్కుర్చీలో పడుకుని
ప్రపంచదర్శనం చేస్తుంటాను
విశ్రాంతిగా విరామ సమయాల్లో
వీలుదొరకినప్పుడల్లా వ్యతిరిక్తమైన భావాలను ప్రోదిఛేసి
విషగుళికల్లా ఇంటీంటికీ పంపిణీ చేసే వార్తాపత్రికల
జోరును చూసి నవ్వుకుంటూ, మరో దిక్కుతోచక
వాటినే పునః పునః తిరగేస్తుంటాను.
కలవారి భాగ్య మయ ప్రస్థానాలకు
కలలతో కాలిడిన కోడళ్ళ ం తో కూడిన భావజాల 0 తో
కూడిన భావజాల ంతో మిళితమైన కండకావర ప్రసంగాలూ
కక్షలతో కావేషాలతో కాగిపోయే కళ్ళ కార్ఖానాలూ
వయసులోని వనితల వొపు సొంపుల ప్రదర్శనలతో
వేడెక్కుతూ మార్మోగిపోయెవాణిజ్య ప్రకటనల వేలం వెర్రులూ
తాయెత్తులతో ధన కనక వస్తు వాహన యోగం ,
తప్పక వస్తుందని ఊరించే ,ఊదరగొట్టే
మాయామర్మాల తోకూడిన జిత్తులమారి
స్వామీజీల సందేశాల సం రం భాలూ
అన్నింటినీ ఒక చెవ్వితోవిని
మరో చెవిగుండా వదిలేస్తున్నాను
పురుషుడి గా ఉద్యోగం లక్షణంగా చేసికుంటూ
పిల్లలందరూ వారి వారి స్థానాల్లో సెటిలయిపోగా
తీరిగ్గా పదకకుర్చీకే పరిమితమైపోయి
ప్రపంచదర్శనం రోజూ పరిమితవేళల్లో
మునివే ళ్ళమీద చాం ద్రాయణంలా
చేస్తూ పోతుజీవితకాలాన్ని
బహుధా వ్యర్ధపరుస్తున్నాను .
--------------------------------------------------------------------
ముక్తకాలు
ఒక గౌతమ బుద్ధుడు
మహాత్మాగాంధి, అశోకుడు
వరుసగా అందరూ
హింసల గదులకు,
తాళాలు వేస్తూ
శాంతి గీతాలను
సామూహికంగా, గానంచేస్తూ.
[2]
ఒక నన్నయభట్టు
తిక్కన. వేమన
శ్రీ శ్రీ, జాషువా
గురజాడ రాయప్రోలూ
సాహితీ సరస్వతిని
సమాజానికి
చేరువగా చేర్చేలా
రచనలు చేస్తూ
హితబోధలు చేస్తూ
[ 3]
ఒక కందుకూరి
ఒక ఉన్నవ
కొండా వెంకటప్పయ్య పంతులుగారూ
మనిషిని పట్టి పీడిస్తూన్న
మూర్ఖపు, రుగ్మతలనుండి
విముక్తులను జేసే ప్రక్రియలలో
సేవానిరతిని ప్రదర్శిస్తూ
[4]
ఎందుకు?
ఏమిటి ?
ఎలా?
అజ్ఞానానికి,
విజ్ఞనానికి
అవే ప్రశ్నలు
జవాబుగామిలుతూ
5
బీరు
విస్కీ
రమ్ము
వైను
అనీ మత్తును
ముద్దాడీంచేవే
మసకమసక చీకట్లలో
మనిషినిముంచేస్తూ
మనసును నిండా
మునగదీస్తూ
6
గాలి మనం నమ్మిన
ఆశాజీవి
ఊపిరికొసలను
పట్టి ఊదుతూ
బలంగా
బయటికి ఒదులుతూ
అందరినీ , క్రియలతో
విశ్వసింపజేస్తూ
ఒక గౌతమ బుద్ధుడు
మహాత్మాగాంధి, అశోకుడు
వరుసగా అందరూ
హింసల గదులకు,
తాళాలు వేస్తూ
శాంతి గీతాలను
సామూహికంగా, గానంచేస్తూ.
[2]
ఒక నన్నయభట్టు
తిక్కన. వేమన
శ్రీ శ్రీ, జాషువా
గురజాడ రాయప్రోలూ
సాహితీ సరస్వతిని
సమాజానికి
చేరువగా చేర్చేలా
రచనలు చేస్తూ
హితబోధలు చేస్తూ
[ 3]
ఒక కందుకూరి
ఒక ఉన్నవ
కొండా వెంకటప్పయ్య పంతులుగారూ
మనిషిని పట్టి పీడిస్తూన్న
మూర్ఖపు, రుగ్మతలనుండి
విముక్తులను జేసే ప్రక్రియలలో
సేవానిరతిని ప్రదర్శిస్తూ
[4]
ఎందుకు?
ఏమిటి ?
ఎలా?
అజ్ఞానానికి,
విజ్ఞనానికి
అవే ప్రశ్నలు
జవాబుగామిలుతూ
5
బీరు
విస్కీ
రమ్ము
వైను
అనీ మత్తును
ముద్దాడీంచేవే
మసకమసక చీకట్లలో
మనిషినిముంచేస్తూ
మనసును నిండా
మునగదీస్తూ
6
గాలి మనం నమ్మిన
ఆశాజీవి
ఊపిరికొసలను
పట్టి ఊదుతూ
బలంగా
బయటికి ఒదులుతూ
అందరినీ , క్రియలతో
విశ్వసింపజేస్తూ
పరివర్తనం
++++++++++++++++
ఎప్పటినుంచో నాకు
దూరాలనన్నింటినీ
కలిపి కుట్టాలన్న దృక్కోణం వైపు
దూసుకెళ్లాలన్న తపన
మనసులనన్నింటినీ గుది గుచ్చుకుంటూ
మార్గయానం చేయాలన్న కామన.
ఎంతో కాలంగా
వ్యక్తినిష్ఠంగా
ఒంటరి ద్వీపాల్లో
విహరించి విసిగిపోయానేమో
క్లేశాలమాటున దాగిన
కోశాలవైపు
దృష్టి సారించలేదు.
వాడిగా బ్రతకాలనుకోవడం
సువాసనలను వెదజల్లుతూ
ఒక్కరోజునైనా పరిమళ భరితంగా
ప్రసరించాలన్న దిదృక్ష
నానాటికీపెరిగిపోయి
పటిష్టపడుతున్నది.
మృగదశను వీడడానికి
మనిషికి కింకెన్ని శకాలు కావాలి?
మనిషి మనిషిగా మనగలిగేలా చేయడానికి
మరో యుగపురుషుడు అవతరించాలా?
పరివర్తనానికి పరమార్ధం తెలుసుకుంటే
మానవ జీవితం అన్వర్ధమై నిలుస్తుంది
మానవత్వం విజయదుందుభి మోగిస్తుంది
మకిలతనం కనుమరుగై క్రమేపి అదృశ్యమై పోతుంది
++++++++++++++++
ఎప్పటినుంచో నాకు
దూరాలనన్నింటినీ
కలిపి కుట్టాలన్న దృక్కోణం వైపు
దూసుకెళ్లాలన్న తపన
మనసులనన్నింటినీ గుది గుచ్చుకుంటూ
మార్గయానం చేయాలన్న కామన.
ఎంతో కాలంగా
వ్యక్తినిష్ఠంగా
ఒంటరి ద్వీపాల్లో
విహరించి విసిగిపోయానేమో
క్లేశాలమాటున దాగిన
కోశాలవైపు
దృష్టి సారించలేదు.
వాడిగా బ్రతకాలనుకోవడం
సువాసనలను వెదజల్లుతూ
ఒక్కరోజునైనా పరిమళ భరితంగా
ప్రసరించాలన్న దిదృక్ష
నానాటికీపెరిగిపోయి
పటిష్టపడుతున్నది.
మృగదశను వీడడానికి
మనిషికి కింకెన్ని శకాలు కావాలి?
మనిషి మనిషిగా మనగలిగేలా చేయడానికి
మరో యుగపురుషుడు అవతరించాలా?
పరివర్తనానికి పరమార్ధం తెలుసుకుంటే
మానవ జీవితం అన్వర్ధమై నిలుస్తుంది
మానవత్వం విజయదుందుభి మోగిస్తుంది
మకిలతనం కనుమరుగై క్రమేపి అదృశ్యమై పోతుంది
మాతృదేవం
*************
అమ్మ
ఒక మధురాతిమధుర స్వప్నం
నిత్యం గుబాళించే
సుందర దరహాస సుమం
తొలిఝామునుంచి అర్ధ్రత్రిదాకా
వెసులుబాటు లేకుండా
ఇల్లంతా
కలియతిరిగే యంత్రం
కోడి కూసే వేళకే
ఇంటిముందు
వెలసే రంగవల్లి.
మంచం దిగీ దిగకముందే
చేతిదగ్గరకందొచ్చే కాఫీ గ్లాసు
రుచికరమైన పలహారపు ప్లేటు
పాఠ శాలలకూ కార్యాలయలకూ
విడివిడిగా సర్దబడే టిఫిన్ బాక్సు
మధ్యాహ్నం వేళకు
తానే వాషింగ్ మిషనై, ఆరేసుకునే తాడై
అలరారుతుంది
సాయంకాలానికి పిల్లల హోం వర్కును చేయించే
ట్యూషన్ మాస్టారుగ్లా
అప్పుడప్పుడూ ఇంట్లో తలెత్తే ఆర్ధిక సమస్యలను పరిష్కరించే
సలహాలూ సంప్రదింపుల సానుకూల మార్గదర్శి గా
పిల్లలమధ్యన తలెత్తే చిన్న చిన్న గొడవలలో ఇరుపక్షాలకూ
అంగీకారయొగ్యమైన సలహాలు చెప్పే న్యాయ మూర్తి
ఆ భగవంతుడు తనప్రతినిధిగా
భూమి పైకి పంపిన దేవతాస్వరూపం
అనురాగ మూర్తి, ఆప్యాయతల స్పూర్తి అమ్మ,
*************
అమ్మ
ఒక మధురాతిమధుర స్వప్నం
నిత్యం గుబాళించే
సుందర దరహాస సుమం
తొలిఝామునుంచి అర్ధ్రత్రిదాకా
వెసులుబాటు లేకుండా
ఇల్లంతా
కలియతిరిగే యంత్రం
కోడి కూసే వేళకే
ఇంటిముందు
వెలసే రంగవల్లి.
మంచం దిగీ దిగకముందే
చేతిదగ్గరకందొచ్చే కాఫీ గ్లాసు
రుచికరమైన పలహారపు ప్లేటు
పాఠ శాలలకూ కార్యాలయలకూ
విడివిడిగా సర్దబడే టిఫిన్ బాక్సు
మధ్యాహ్నం వేళకు
తానే వాషింగ్ మిషనై, ఆరేసుకునే తాడై
అలరారుతుంది
సాయంకాలానికి పిల్లల హోం వర్కును చేయించే
ట్యూషన్ మాస్టారుగ్లా
అప్పుడప్పుడూ ఇంట్లో తలెత్తే ఆర్ధిక సమస్యలను పరిష్కరించే
సలహాలూ సంప్రదింపుల సానుకూల మార్గదర్శి గా
పిల్లలమధ్యన తలెత్తే చిన్న చిన్న గొడవలలో ఇరుపక్షాలకూ
అంగీకారయొగ్యమైన సలహాలు చెప్పే న్యాయ మూర్తి
ఆ భగవంతుడు తనప్రతినిధిగా
భూమి పైకి పంపిన దేవతాస్వరూపం
అనురాగ మూర్తి, ఆప్యాయతల స్పూర్తి అమ్మ,
----------------------------------------
No comments:
Post a Comment