Monday, August 3, 2015

ఆసుర సంధ్య ఆరాటపడే వేళ------------------------
వయసు నొసలు పై ముసలిరేఖలు ముద్రితమౌతున్నాయని తెలిసాక మన స్మిత వదనంలో
 ఎన్నెన్నో కలతల కాసారాలు సాక్షాత్కరిస్తాయి 
యవ్వనంలోతృళ్ళింపజెసిన అనుభవాలు
బాల్యంలొని కేరింతలూ నడి వయసులోని నయగారాలు కలిగించిన
 నాజూకుదనాల గిలిగింతలూ యేనీ స్మృతిపధాన నిలిచి ఓదార్చాలని
ప్రయత్నించవు .మీదు మిక్కిలి ఇవన్నీ పరిహసించాలనే ప్రయత్నిస్తూ ఉంటాయి.
ఈదశకు చేరుకోవడం విధిలిఖితమనీ యేజీవికయినా
 ఈ మృదంగ నాదాలను వినక ఆసమయంలో తప్పదనీ అనిపించగా
 సర్దుకుపోయే బాటలో సానుభూతిని సహకరించమని వేడుకుంటూ శేష జీవితాన్ని
 నిరామయంగా నీరవ నిస్తబ్ధంగా గడపడం ఆనవాయితీ గా
 వస్తుండటం గమనించే ఉం టారు  మిత్రులంతా,ఇదంతా అసుర సంధ్య వే ళల
 ఆరాటంగా ఈదశకు చేరుకోవడం విధి అదృష్టానుగత ప్రాణులపై
అది నిర్దాక్షిణ్యంగా కాలక్ర మేనా ఆటాడుకునే వే ళ  భావిస్తాను.

------------------------------------------------------------------------
ఆధునికఋషి
మట్టిని చేతుల్తో ముట్టుకుని
కళ్ళకు దగ్గరగా తీసుకుని
కళ్ళకద్దుకునే మనిషి నాకు
అపరబ్రహ్మలా సాక్షాత్కరిస్తాడు.

నాగలి కర్రుతో దున్నుతూ అడుగు మట్టి పెళ్ళలను పైకి లాగుతూ
రెండు చేతులా మట్టిని తడపలు తడపలు గా  పొడిపొడిగా చేసుకుంటూ
ముందుకు సాగే మనిషి నాకు త్రికాలజ్ఞుడిగా గోచరిస్తాడు.

ఆరుగాలాలపాటూ ఆమట్టినే నమ్ముకుని
 చెమటోడ్చి శ్రమజేస్తూ
స్వయంకృషితో, నాస్తిని దుర్భిక్షం చేసే
 ఆవ్యక్తి  నాకు త్రికాలజ్ఞుడిలా సాక్షాత్కరిస్తాడు

జోరుగా వాన పడుతున్నా పొలాల్లో సాలు సాలుకూ నీరందించాలని
పగలనకా రాత్రనకా
 కష్టపడే వ్యక్తి జగజ్జేగీయమానంగా,ప్రకాశిస్తూ
 ఒక దివ్య శక్తిగా
నామనోఫలకంపై సువర్ణాక్షరమై సందేశమందిస్తాడు .
 పాలపొట్టమీదున్న వరికంకులు
పైరగాలికి తలలూపుతూ నాట్యంజేస్తుంటే
కృషీవలుడు తన శ్రమకు ఫలితం చేతికందబోతుందన్న
 ఆనంద నందనుడైన కృతికర్త
 గొప్ప
ఆవిష్కర్తగా నాకు అవగతమౌతాడు

పంటంతా పండి నిండు గర్భిణిగా బరువులను మోయలేక
తలను నేల బారుగా వంచే పనలను, కట్టలు కట్టలుగా కట్తి
కుప్పగా పేర్చెస్తూ కంటికి రెప్పల్లా
కుప్పలను కాపాడుకుంటూ

తనచేతుల్తో గాలివాటంగా ధాన్యాన్ని చేటల్తోచెరుగుతూ తూర్పారబట్టి
తాలు గింజల్ను వేరుచేసి ,
నికార్సైన గింజల్ని బస్తాలకెత్తి
చీకటి పడే లోపు బస్తాలను ఇంటికిచేర్చి  మెట్టుగట్టో ,పాతరలలో పోసి, దాచో
యావత్ప్రపంచపు ఆకలి ని తీర్చి
 ఆదుకునే కృషీవలుడు
ఆధునిక ౠషిలా ప్ర్యత్యక్షమై
మనకు  మరో మహర్షిలా  ధ్వనిస్తాడు
స్వేదసింధువును సంధిస్తూ  శ్రమైక సామ్రాజ్యాన్ని
 పాలించే ప్రభువుగా ద్యోతకమౌతాడు

ఆమనిషిని తలచుకుంటూ తెల్లకాగితాలను
 తన మేధో శక్తితో కవితల రూపంలోమలచగలిగే
కవులను వారు సమర్పించేఅక్షరనైవేద్యాన్ని
నేను అమృతోపమంగాభావిస్తాను.
ఆకృషీవలురు కలకాలం చిరంజీవులుగా
సుఖ శాంతులతో   వర్ధిల్లా లని
భోగభాగ్యాలతోవిలసిల్లాలని
మరీ మరీ అభిలషిస్తాను  .
-------------------------------------------

No comments:

Post a Comment