Sunday, August 23, 2015

నీ ముఖద్వారంవద్ద
ముభావంతో నిలబడియున్నాను
మందస్మిత హృదయారవిందుడవై
లాలనగా నన్ను కరుణించేందుకు
జాగేల ప్రభూ  వెన్నెల కరిగినీరవకముందే
ప్రభాతాన భక్తులసంఖ్యపెరుగుతూ వచ్చి
నీ ముఖద్వారం రాకపోకలకు క్రిక్కిరిసిపోకముందే
తక్షణమే కరుణాంతరంగుడవై నీ దయార్ద్ర హృదయసౌహార్దతను ప్రకటించే వీలుంది స్వ్మీ వెనువెంటనే భీరుడను నన్ను దరిజేర్చుకునేందుకు ధీరుడవుగదా బిరాన

రా కదలిరా-- నీమ్రోల విన్నపాల సుమమాలను చేతపట్టి
ఆశగా ఎదురుచూస్తున్నాను జాగేలరా ప్రభూ! రా కదలిరా!!

========================================

No comments:

Post a Comment