Saturday, August 1, 2015

నూత్న మర్యాద
--------------
మండే వేసవికాలంలో
నిద్రపట్టని రాత్రుల్లా
కలల కాసారం ఒడ్డున కూర్చొని
నా హుండే ఎదురుచూస్తుంది
 ఒంటరితనాన్ని బందీ చేయాలని
ప్రగాఢంగా విశ్వసిస్తూ .

శిశిరంలో నగంతరువులా
పండనికోర్కెలన్నింటినీ ఒక్కొక్కటిగా
నేలకు రాల్చేపనిలో నిమగ్న మౌతుంది.
శర్దృతువులోనైనా,హేమంతంలోనైనా
ఉక్కబెట్టిన చందాన ఉక్కిరి బిక్కిరై
ఊపిరాడనట్లుగా నిట్టూర్పులను వదులుతుంది.

అగ్ని గోళంలా మండిపోతున్న వేసవి చందాన
నాలుగు చినుకులు రాలితే చాలునన్న ఆలోచన
మదిలోకి చొరబడగానే ఓ నూత్న మర్యాదను
నా జీవనం సంతరించుకుని సంతోషసాగరంలో
మునిగితేలుతూ మురిసి ముక్కలవుతుంది.

No comments:

Post a Comment