కంచి కెళ్ళని కవిత
ఏ కవిత రాయాలన్నా ఏదో ఒక అడ్డంకి
అహోరాత్రాలూ పడే శ్రమంతా
అరరే మరొ సింగడి అద్దంకి
కాలేజీలో చదివేకన్నెపిల్ల
అల్లరి పడి ఆత్మాభిమానంతో
తనబతుకు పుస్తకాన్ని ముగించిందని విని
భావకవిత రాయాలని తలచిన నాకలం
ప్రణయగీతాలనూల్లే ప్రక్రియకు స్వస్తి పలికింది.
కన్న తండ్రిమీద కుంప టిగా దిగిపోయి
ఆరునెలలు తిరక్కముందే అత్తగారి మెదడులో
ప్రతినిత్యం ఊరే కొర్కెల దాహాన్ని తీర్చలేక
కట్టుకున్న మొగుడి కొంగ్రొత్త కామనలను తీర్చగలిగే స్థోమతకానరాక
ఓ కొత్తకాపురంకోలు ఉరేసుకునేందుకు సిద్ధపడిందని విని
సంసార చక్రాలమీద చకచక సాగే సుమధుర గీతంకాస్తా
అపస్వరాల స్రవంతిగామారి నన్ను నిస్తేజపరిచింది
తాను వలచి వరించిన మొగుడే తాగొచ్చి తన్నులు తినమంటుంటే
తాళజాలక ఎదురిం టి పూరిపాకలోని వెంకమ్మ వే సే వెర్రికేకలకు
శ్ర మైకజీవుల పై రాద్దామనుకున్న
అభ్యుదయ గీతాన్ని
అర్ధాంతరంగా ఆపేసాను.
ఇంకా యేకవితరాసి నన్నునేను వంచించుకోలేను
పాఠకులను మభ్యపెట్టే ప్రయత్నాన్ని కొన సాగించను?
సమకాలీన సమాజ జీవితపు ఒడిదుడుకులకు స్పందించకుండా
ఎలా నన్ను నేను మభ్య పెట్టుకోను?
ముసుగును కప్పుకుని మందహాసాలు చిందించలేను
మనసును చంపుకున్న మనిషిగా మనుగడ సాగించలేను.
------------------------------------------------------------
No comments:
Post a Comment