Wednesday, August 12, 2015

ముక్తకాలు
========రావెల
-----------------
సన్నగా తమలో తాము
సణుగుకుంటున్న చెట్ల ఆకులు
పేద్దగా శబ్దం చెయ్యకుండా
దగ్గరగా ప్రవహిస్తున్న నీటి చాలు.


యేదో ఒక అలజడితో
 వెనుకడుగు వేస్తున్న
ప్రజాప్రతినిధుల
కర్తవ్యతా మూఢత్వం.


రాసేదానికీ నిజజీవితానికీ
పొంతనలేదేమోననని
అస్తి నాస్తి విచికిత్సా హేతువులో
ఊగిసలాడుతూ సందేహాల
వలయంలో చిక్కుకుని కలలతీరంలో
చేరుకోవాలని తహతహపడే కలాల యువగళం.


అయిన దానికీ కానిదానికీ
అవతలా ఇవతలా మూడుతరాలను
ఎత్తిపొడుస్తున్న వసివాడిన దాంపత్యం.
యెలా వీళ్ళ్ళను సర్దుకునేలా చేయాలో
అర్ధమవక తికమక పడుతున్న వృద్ధాప్యం.
==============================







No comments:

Post a Comment