Friday, August 14, 2015

స్వాదుఫలం-చేదువిషం
------------రావెల

స్వాతంత్రం వచ్చిందని
సంబరపడి ఫలమేమిటి?
ఎవరికోసమొచ్చిందిది
ఎవరినుద్ధరించింది?


శ్రీనివాసుల జాబితాలో
శిఖరారోహణమొదలైంది
పేదవారిజనాభాలో
నైరాశ్యం గూడు కట్టుకుంది.

రాజకీయరణరంగం

ధనికులకో వరమైంది
దేశసంపదనంతా వారలే
దోచుకునే వీలయింది.

ఆడువారి మానానికి
అపసవ్యం తోడయింది.
మంచితనమం, మానవత్వం
వంచనకు బానిసయింది.


వారసత్వపు పాలనమంతా
వంచనాత్మకమై నిలబడింది.
అధోజగత్సహోదరుల త్రోవ
అవమానపు బాట పట్తింది.


స్వాంతత్రపు స్వాదుఫలం
చేదురుచిని తెచ్చుకుంది
స్వేచ్చా వాయువులన్నీ
కలుషితపు రంగుపులుముకున్నవి
.
===============================





No comments:

Post a Comment