శిశిర రుతువులా వృద్ధాప్యం
నిన్నటిదాకా ఈపూలు
ఎంతపరిమళాన్ని ప్రసరింపజేసాయి?
చుట్టూ వున్న పరిసరాల్ని
ఎంతగా గుబాళింప జేసాయి?
మరి ఇప్పుడు ఎందుకిలా
ఈ తోట కళా విహీనంగా తయారయింది?
పొరుగున పారే మురుగునీటితో
ఎవరో చేజేతులా
ఈ నిర్ఝరిని
కళంకితం గావిస్తున్నారు ?
పడమటి శాంబరం మొదలయినప్పుడే
ఈ కుడి ఎడమల
దగా ప్రారంభమయింది
మన స్వేదఫలాన్ని వాళ్ళు డాలర్లుగా, సులుసూత్రంగా
మార్చేసుకుంటూ
శ్రీ పతాకాన్నెగరేసుకుంటున్నారు! !
ఈ డాలర్ వెన్నెల
వికసించడం మొదలయాకే
ప్రతి ఇంటా ఒంటరితనపు చీకట్లు
కమ్ముకోవడం గమనిస్తున్నాం
ఎదుగూ బొదుగూ లేని భవితవ్యం
ఎదురుగా కునారిల్లుతున్న ముదిమితనాన్ని
ఆసాంతం పరిహసించడం
అప్పుడే ప్రారంభం జేసింది.
గమ్యం యెరుగని పయనానికి దారి
గాసట బీస ట మారి
ముళ్ళ బాట గా తయారయింది
వయసు నొసలుపై గీస్తున్నవృద్ధాప్యపు రేఖలకు క్షణ క్షణానికీ వాడిపో యి ,
రాలి పడే గుణం
వడి వడిగా అద్దబడుతున్నది.
పడమటి సంధ్యారాగానికి దగ్గరవుతున్న
వృద్ధాప్యపు అసుర సంధ్య వేళా వ్యగ్రతకు
వసివాడిపోయే శిశిర రుతువు
శాశ్వతమయేలా కనిపిస్తున్నది
ఇకపై ఒంటరి తనపు చీకట్లు
దట్టంగా కమ్ముకుని
జీవనసమరంలో పరాజి త మవుతూ
ఆకులు రాలే కాలం అనుస్యూతంగా సాగడం
ఒంటరితనపు చీకట్లే
ఇంటింటా శాశ్వతంగా మిగిలిపోయే తీరే
ఖాయమయేలా కనిపిస్తున్నది.
88*************************************************8
ఈ కవిత నాస్వంతం
దేనికీ అనుకరణ గానీ,అనుసరణ గానీ
అనువాదంగానీకాదని హామీ
అనువాదంగానీకాదని హామీ
----------------------------
రావెల పురుషో
త్త మరావు
ఇంటినంబర్: 360
2/5 కృష్ణ నగర్ గుంటూరు
522006
9394100531
No comments:
Post a Comment