Monday, August 3, 2015

సంధానం
రావెల పురుషోత్త్తమరావు
9394100531
నిన్నటిదాకా నేను
ఎదురయిన ప్రతి వాడినీ
ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసాను.

కప్పదాటు జవాబులతో కొందరు
వినీ వినబడనట్లు నటిస్తూ, మరికొందరు
 నేనుకనబడగానే దివాంధుల్లా నటిస్తూ
తడబడుతూదారిమర్చేవారు , ఇంకొందరు.

ఎవరూ నాప్రశ్నలకు సూటిగా
సమాధానం చెప్పలేకుండా  పోయారు.
అందుకేకొన్నాళ్ళు  నేను  ఆప్రశ్నలను
వాటి  మానాన  వాటిని వదిలేసి
మౌన్నాన్నశ్రయించాను ,మహర్షిలా.

ఇప్పుడు కాలం పూర్తిగా
మారిపోయింది
అందరూ నన్ను ప్రశ్నల తో
మూకుమ్మడిగా అదేపనిగా,
 దాడి చేస్తున్నారు.
భావికాలపు జీవనగతిని గూర్చి
నిజం చెప్పండంటూ నిలదీసి
నిలువునా వేధిస్తున్నారు.
అనూహ్యమైన ప్రశ్నల జడిలో నన్ను
అన్యమనస్కం గావిస్తున్నారు
అమ్మయ్య ఇప్పుడు జనంలో
చైతన్యం, ప్రవాహంలా
ఉరకలెత్తుతున్నది
అబ్బబ్బబ్బో
నన్ను  ఎనలేని ఆనందం
 ఆర్ణవమై ముంచేస్తున్నది .
చిరకాలపు నా వాంచ, చిత్రంగా
నెరవేరుతున్నది.
సమాధానాలతో సంధానమై
నిలువెల్లాపులకించి పోతున్నాను
---------------------------------------------

కవితలు నాస్వంతం
దేనికీ అనుకరణ గానీ,అనుసరణ గానీ
అనువాదంగానీకాదని హామీ
----------------------------
రావెల పురుషోత్త్తమరావు
ఇంటినంబర్: 360
2/5 కృష్ణ నగర్ గుంటూరు
522006
cell 9394100531
email supani@gmail.com


No comments:

Post a Comment