గుడిమెట్ల దారి
శిఖర దీప కాంతిలో మెరుస్తూ
-----------------------
పార్కులో
సిమెంట్ బెంచీపై
వాడిన పూలగుత్తులు
--------------------------
దబాటు వాన
పూలబ్బాయ్
నవ్వే గంపతో
-----------
దవనమో
మరువమో
పూలరాకను పరిమళిస్తూ
------------------
ఆమె వెళ్ళింది
గదినిండా
ఆపరిమళమే గుబాళిస్తూ
--------------------------
వాన వెలిసింది
గొడుగు క్రింద
నేనూ, రాలే చినుకులూ
----------------
తూనీగ
నింగి లోని చినుకుల
నాహ్వానిస్తూ
శిధిలగృహంలో
రావి మొక్కలు
యజమానులకోసం వేచిచూస్తూ
-------------------------------
హేమంతంలో
పర్వతాలను పలకరిస్తూ
నిశ్శబ్దం
---------------
వారాంతంలో
రహదారంతా పరుగెట్టే
కార్ల నక్షత్రాలు
--------------------------
No comments:
Post a Comment