Monday, August 3, 2015

సుమగీతం
---------------------
ఓ విశ్వమా
తోటలో విరబూసిన ఓ సుమాన్ని కోసి
అనురాగం ఉప్పతిల్లగా హృదయానికి హత్తుకున్నాను.
ముల్లు బగాగుచ్చుకుని కలతపెట్టింది.

పగటి వెలుగు క్రమేపీ  పరిసమాప్తమై
చీకటిరాత్రి చేరువౌతున్నప్పుడు
పూలు క్రమేపీ వాడి తలలు వాల్చడం గమనించాను
కానీ గుచ్చుకున్న కంటకం పెదుతున్న
బాధ మాత్రం కలకవేస్తూనే వున్నది.
ఓ అనంత విశ్వమా మరెన్నో సురభిళసుమాలు
నీ చెంతకు ఇకపైనాచేరుతూనే ఉంటాయి
కానీ నావరకు నాకు మాత్రం
పూలుకోసే వేళపూర్తయిందిసుమా
చిమ్మచీకటి సమీపిస్తున్నది
గులాబీ మాత్రం నావద్దలేదుగానీ
ఆముళ్ళు గుచ్చుకున్న బాధమాత్రం
అనవరతం వ్యధపెడుతూనే వున్నది
ఈ కంటకపు బాధ మాత్రం కలకాలం

కలకువేస్తూ కలతపెట్టేలా వున్నది
[రవీందుని తోతమాలిలోని 57 వ గీతానికి సరళానువాదం]

------------------------------------------------------

No comments:

Post a Comment