రుతు నర్తనహేల
గ్రీష్మంలో మిట్ట మధ్యాహ్నం
నడక దారిలో నేను సాగుతూ వుంటే
దక్షిణ దిశగా వీచే మలయమారుతమై
నన్ను
అలరిస్తూ ,ఆహ్లాదపరుస్తావు
చలివణికించే,
హేమంత రుతు కాలంలో
నన్ను వెన్నంటి అనుసరిస్తూ
ఉన్ని శాలువలా, నన్ను కప్పేసి
నులివెచ్చని సౌఖ్యాన్నందిస్తావు.
శిశిరంలో నేలకురాలిపడిన
ఎండుటాకులను గమనించి
నేను గాబరాపడుతుంటే
రాబోయేది వసంతకాలమే గదా అని గుర్తుజేసి
నా ఆశలకు చివుళ్ళు తొడుగుతుంటావు.
నిరాశా నిస్పృహలు ,నన్ను
నిలువునా జడిపిస్తుంటే
దయామృతవర్షిణివై నన్ను అనురాగ గంగతొ
పరిషేచనంజేసి, పుణ్యావహుణ్ణి గావిస్తావు.
ప్రేయసీ ఈ వసంత వేళల్లో
మావిచిగురులు తిన్న కోయిలవై
నన్ను నీ మనోహరగీతాలతో అలరిస్తూ
అమందానంద కందళిత
హృదయారవిందుణ్ణి గావిస్తున్నావ్.
***********************************
రుతువర్తనం
గ్రీష్మం
సాయంత్రానికి
ఆరుబయట జనం
గాలికోసం నిరీక్షిస్తూ
హేమంతం
గాజు కిటికీపై
రకరకాల పక్షులు
రెక్కలు విదుల్చుకుంటూ
శిశిరం
రాలిపడిన ఆకులు, నేలపై
అద్భుత కళాఖండాల్లా
దర్శనమిస్తూ
వర్షం
పంటపొలాల్లో
పెరిగే మొక్కలకు
చిటారుకొమ్మల గూళ్లపై
పక్షులు
జంటకోసం తపిస్తూ
వసంతం
పూలన్నీ
పరిమళ సౌరభాలను
పొందుపరుచుకుంటూ
No comments:
Post a Comment