Tuesday, August 4, 2015

అంధకారాని వతలి దిశగా--
చీకటి చిత్రమైనది
ఒక్కొక్కప్పుడు
పలుచని దుప్పటిలా
నేలంతా వెలితెలిగా
పరుచుకుపోయి
కొంత వెసులుబాటు
కలిగిస్తుంది
మరి0కో సమయంలో
దళసరి గొగళిలాగా
దట్టంగాపొగ చూరిన రీతిగా 
దారంతటా విస్తరి స్తూపోతుంది
కన్నుపొడుచుకున్నా కానరానంతటి
గాఢాంధకారాన్నిసైతం
తిమిర తతి మరిపిస్తున్నది
వెలుగును చొరనివ్వకుండా
విశాలమైన వేదికను నిర్మిస్తుంది
వెలుతురురేకలను నేలకు
దిగిరా నివ్వకుండా
వేనవేలవిధాలుగా వ్యతిరేకిస్తుంది
ఐనా చీకటిని కౌగలించుకుని
కుబేరులై మురిసిపోతున్నవారిని
ఎందరిని మనం ఇలాతలంపై గమనించలేదు?
అంధకార సామ్రాజ్యానికి వారే
స్వయంప్రకటిత  సామంత రాజుల్లా
వెలిగిపోయేవారెందరిని వీక్షించలేదు?
వాళ్ళందరికీ వెలుగు ద్వారాలగుండా
వెళ్ళాలన్న కోరికలు ససేమిరా ఉండవు.
ధర్మానికి దాసు లై  దాని
దయాదాక్షిణ్యాలకు నోచు కోకపోయినా
 నిత్యజీవన గమనంలో
సన్మార్గగాములై సుఖజీవనం సాగిస్తున్నవారే సంఖ్యలో అత్యల్పం గా గా నైనా నిత్యజీవన గమనంలో స్వయంప్రకాశుల్లా  సాక్షాత్కరిస్తారు
వారిని మన హృదయకోశాల్లో
అంతరాంతరాల్లో నింపుకుందామన్న
ధ్యాస ప్రస్పుటంగా కలిగిన వాణ్ణి
అంధకార సీమల అవతలి ఒడ్డుకు
వడి వడి గా అడుగులువేసుకుంటూ

నడచి పోవ నుంకిస్తున్నాను

No comments:

Post a Comment