Monday, August 24, 2015

వివర్ణమైన నింగిని చూస్తూ
--------------------------------


అన్నిరంగులనూ అదృశ్యంచేసుకున్న ఆకసంలా
నవ్వునూ నయగారాన్ని పోగుట్టుకుని కునారిల్లుతూ నేను.


ఇంకెంత దూరమోగమ్యం ఒకపట్టాన అవగతమవడంలేదు.
ఒంటరితనం వేసిన సంకెళ్ళు ఎప్పుడు
నన్నువిశౄంఖలుడిని గావిస్తాయో
కాలమే నిర్ణయించాలి.

ప్రతిపదార్ధమూ తాత్పర్యసహితమైన
పద్యంకాదుకదా ఇట్టే అర్ధమై
మదిలోకి చొచ్చుకుపోవడానికి!!
ఇది కట్టుకధలుగాని గాధలతో రచియింపబడ్డ
గాధల బాధాసప్తశతి.


ఈ అపూర్వ సహస్ర శిరచ్చేద చింతామణిలో
ఇంకెన్ని తలలు తెగిపడి వినమ్రమై మిగిలిపోవాలో.
తీర్పు తీరిగ్గా చెప్పగల అధికారం ఒక్క విధిలిఖితమైన
వ్రాతకే సాధ్యమౌతుందని వేరుగా విన్నవించుకోవాలా?

వివర్ణమైన నింగిని తదేకంగా తిలకిస్తూ
ఈ విషణ్ణ వదన మిలా
 శోకతప్తయై శేషజీవితం కొనసాగించవలసిందే తప్ప వేరుగాదు.
===========================================================

No comments:

Post a Comment