Sunday, August 23, 2015

దిదృక్ష
-------------
ఔను
మళ్ళీ నువ్వునాకు కావాలి
భొతికమైన కాక్షలను
చల్లార్చుకోడానికో

రసరమ్య గీతాలు పాడుకుంటూ
జలపాతాల ఝరులను వినడానికీ కాదు.
మానసికంగా కృద్ధయౌతున్న నా హృదయాన్ని
కుదేలయి పడిపోకుండా ఓ లాలనాగా తోడుండడానికి.


అడవులను పట్టి  సినిమా నాయికలా నాయకుని వెంట
అర్ధంపర్ధంలేని గాయకుడి స్వరాలాపనకు
గంతులువేస్తూ గెంతడానికి కాదు.

నాగుండె గొంతుకలోంచి ఊడిపడే లలితభావగీతాలకు
నేపధ్యమై నిలువెత్తునా సంతోషాల సామ్రాజ్ఞిగా
సాధికారంగా నన్ను ప్రోత్సహించి మనోరంజితం గావించేందుకు.
నూత్నమర్యాదలవైపు నన్ను మార్గానుయాయిగా రూపు దిద్దుకునేలా
చూసుకునేందుకు--నువ్వు రావాలి దివినుండి భువికి--ఔను తప్పదు.

ఔను నువ్వు కావాలి--

No comments:

Post a Comment