రాసిన కవితలనన్నింటినీ
ఒక్కొక్కటిగా చెరుపుకుంటూ
తన పబ్బం గడుపుకోవాలని
తొందర పడుతున్నాడు ఆ దైవం.
ఆలోచనలకు ఆస్కారం లేకుండానే
అన్నింటినీ మూకుమ్మడిగా మూగ భాషణలతో
మునకలు వేయాలని ఉత్తర్వులను జారీ చేసి
మూగనోము నందుకుని మురిసిపోతున్నాడు.
సంతోషమూ సంతాపాల నడిమయాన
సగం చచ్చి చిక్కి శల్యమై
ససేమిరా నిన్ను అనుసరుంచేదుకేదని
యముని మహిషం ముందు భీష్మించుకుని
లోహపు గంటలు వినబడరాదని శాసించేదిశగా
ఘెరావొలూ సమ్మెలూ చేయాలని తీర్మానం సిద్ధమయింది.
మేఘావృతమైన ఆకాశం ఉరునులనూ మెరుపులతో
అలజడిని కొనసాగించాలని నిర్ణయం,
=========================================
No comments:
Post a Comment