తాజాకలం
=========రావెల
ప్రతిరోజూఇంటిముందు
భాను కిరణాలకన్నా
ముందుగా ముఖ ద్వారం ముందు
వాలిపడేది రక్తాక్షరాలతో
అచ్చొత్తించబడిన దిన పత్రిక.
మానభంగాల అమంగళ వాద్యాలతో
పలికే మృత్యు మృదంగస్వనాలు.
రజకీయ రాబందులు వరుసగా
జనాన్ని పీక్కుతినే ప్రణాళికల
అప్రయోజకమైన ప్రకటనల పరంపరలు.
వార్తా స్రవంతులపేరిట అసమర్ధనేతలను
వంది మాగధుల్లా ప్రశంసలతో హోరెత్తించే
చోటా మోటా నాయకుల శుభాకాంక్షల సం రంభాలు.
నగరాల్లో నాలుగు వాన చినుకులు పడగానే పేక మేడల్లా
కూలిపడేప్రభుత్వ ప్రతిపాదిత భవనాల పరంపరలు.
============================================
=========రావెల
------------------------------
ప్రతిరోజూఇంటిముందు
భాను కిరణాలకన్నా
ముందుగా ముఖ ద్వారం ముందు
వాలిపడేది రక్తాక్షరాలతో
అచ్చొత్తించబడిన దిన పత్రిక.
మానభంగాల అమంగళ వాద్యాలతో
పలికే మృత్యు మృదంగస్వనాలు.
రజకీయ రాబందులు వరుసగా
జనాన్ని పీక్కుతినే ప్రణాళికల
అప్రయోజకమైన ప్రకటనల పరంపరలు.
వార్తా స్రవంతులపేరిట అసమర్ధనేతలను
వంది మాగధుల్లా ప్రశంసలతో హోరెత్తించే
చోటా మోటా నాయకుల శుభాకాంక్షల సం రంభాలు.
నగరాల్లో నాలుగు వాన చినుకులు పడగానే పేక మేడల్లా
కూలిపడేప్రభుత్వ ప్రతిపాదిత భవనాల పరంపరలు.
============================================
No comments:
Post a Comment