Monday, August 3, 2015

ఉడుగర
మాటలాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయ భట్టు
ఈనాటి కవిసామ్రాట్టు
గోదావరి పలకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలువాళ్ళ గోల్డు నిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మిహీకాంతం
అతగాడు తెలుగు వాడి ఆస్తి
అనవరతం తెలునాట ప్రకీర్తి
 చందస్సులేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద
---------------------------------------------------
[శ్రీ శ్రీ 27-10-76 స్వాతి సంచికలో]

కవ్యుధ్ఘ విస్వనాధ వారికి  ఉడుగర

No comments:

Post a Comment