Monday, August 3, 2015

అహంభో అభివాదయే
రావెల పురుషోత్తమ రావు
---------------------------
జీవితంలో
ఎన్నోఎదురు దెబ్బలు తిన్నవాడు
ఎంతో అనుభవశాలిగా  అత్యంత సులభ శైలిలో
జీవితాన్ని నడుపుకుంటాడు .
గుండె గొంతుకలోంచి మాట్లాడే
 గొప్పదనాన్ని సంతరించుకుంటాడు.

నన్ను నేను అంతరంగ సాగర మధనంలో
ముంచి తేల్చుకుంటున్నప్పుడు
ఎవ్వరికీ చెప్పుకోలేని విధంగా
బరితెగించిన బాధ, నన్ను నిలువెల్లా
కుంగదీస్తూ పోతుంటే
పలురకాల అవహేళనలకు గురయిననేను
కాలక్రమేణా యించుక బోధశాలినై
నా భావాలను  నిస్సంకోచంగానూ
బహిర్గతంగానూ, స్వతంత్ర ధోరణిలో
వెల్లడించగలిగినప్పుడు
 గతంలో నాకు ఎదురుతిరిగి
పెడసరంగా మారిన  తలలన్నీ
శిరసావహిస్తున్న ధోరణిలో వినమ్రమై
బుధజనవిధేయంగానూ
 విశ్వాసపాత్రంగానూ 
నాకు సాక్షాత్కరిస్తాయి.

బాల్య చాపల్యాన్ని వదులుకుని
యవ్వనోద్రేకాలను చంపుకుని
నడమంత్రపు సిరులను
 నడ్డి విరిగేలా తన్ని తగలేసి
వయసు నొసలుపై గీసిన
ముసలిరేఖలనన్నిటినీ
 గాద్గదికంగా మారిన  గొంతుకతోనూ
వణుకుతున్న చేతులతోనూ
తడుముకుంటూ
తచ్చట్లాడుతూ
ఇప్పుడు నిరామయంగా
ఉచ్చ్వాస నిశ్వాసాలమధ్య 
ఊగిసలాడే ప్రాణిగా యిలాగే మిగిలిపోతాను
యవ్వనోద్రేకాలను చంపుకుని
నడమంత్రపు సిరులను
 నడ్డి విరిగేలా తన్ని తగలేసి
వయసు నొసలుపై గీసిన
ముసలిరేఖలనన్నిటినీ
 గాద్గదికంగా మారిన  గొంతుకతోనూ
వణుకుతున్న చేతులతోనూ
తడుముకుంటూ
తచ్చట్లాడుతూ
ఇప్పుడు నిరామయంగా
ఉచ్చ్వాస నిశ్వాసాలమధ్య 
ఊగిసలాడే ప్రాణిగా యిలాగే మిగిలిపోతాను

-------------------------------------------------------

No comments:

Post a Comment