Thursday, October 15, 2015

రక రకాల రంగులతో
హంగుగా దర్శనమిచ్చిన
ఆకాశo ఇవ్వళెందుకో
ఎలా తెలా పోతూ వేదన
 కలిగిస్తున్నది.

వసంతంవెళ్ళిoదన్న
విచారం తోనా?
శిశిరం కౌగిలిలిలో
నలిగిపోతా నేమోనన్న     భయంతోనా?
అర్ధమవడంలేదు.

కవిత్వo శీర్షికలో
కమ్మని కవితనై అలరిస్తానని
కమనీయ కంఠంతో చెప్పినా,
కళ్ళల్లో ఎలాంటి  వెలుగురేకలే మీ
విచ్చుకుoటున్న సూచన కనబడక
 ఆ ఆశ  కేవలం
నిరాశగా మాత్రమే   నిలిచిపోయింది.

సాహిత్యం వేదికపై
సమ్మోహనంగా
ఓ హృద్యమైన  పద్యం
వినిపిస్తానని ఆశపెట్టాను
దానిలో ఎలాంటిమార్పూ
 కనబడలేదు.
ఆందోళనకు లోనయాను.


Friday, October 2, 2015

మనసు మూగదాయెనురా
మాధవా! మధుసూదనా!!
కొనగోటిన త్రుంచబడిన సుమమువోలె
స్రుక్కి సోలి
తుదిఘడియలతీరెరుగక
తొందరపడి పోయితినేమొతెలియదు
 ఆమెకదియె అవసానదశయగునని
ఇపుడు వగచి యేమి ఫలము?

తోటలోని పూలడిగితె ఏమిచెప్పగలనునేడు?
ఆమె ఇక పోషణకై మీ చెంతకు
రాదురాదు  రాదటంచు
పూలతీగలన్ని నేడు వాడిపోవు దశకు జేరె
శక్తిమేర ఆమె కొర్కె నెరవేర్చెద నేను కూడ
కుండీలలొ నీరు నింపి ఎందుటాకులను యేరివేసి
నాచిన్నితోటనయిన ఆమె కొరకు పోషింతును
వాటి స్మితవదనమందు ఆమెరూపు చూసుకొందు
ఇప్పటికిదియే నావినతి ఆలకించుమయ్య స్వామి
మూగవోయిన మనసుకింత ఓదార్పునందివ్వుము
గతకాలపు స్మృతులనన్ని గుర్తుంచుము నాఎదలో
మనసు మూగదాయెనురా మాధవా !మధుసూదనా!!
*******************************************
అహింస అంటరానిదై దూరంగా
దూరంగా  జరుగుతున్నప్పుడు
హింసా ప్రవృత్తికలిగివుండడమే
 హితవైనదిగా తోచినప్పుడు
సత్యాన్ని వధించడమే  శాస్త్రసమ్మతంగా
చెలామణీ అవుతున్నప్పుడు,
ధర్మాన్ని చెరలో బంధించి
వేదనపాల్జేసినప్పుడు,
జాతిపితా నీకింకెలాగా
నివాళులందివ్వగలం నువ్వే చెప్పు!
సంవత్సరానికొకసారి నీ శిలావిగ్రహానికి
రంగులేసి పూలదండలతో అలంకరించి
పూజ్య భావాన్ని ప్రకటిస్తున్నట్లు
నటించడంలో నరుని మించిన
నటులెవ్వరున్నారని?
నువ్వే ఆశ్చర్యపోతావ్ !!
ఒకసారి ఇటువైపుకు తొంగిచూస్తే.
================================
జగతిప్రస్థానం
---------------------రావెల
===========================
ఈ యావత్ప్రపంచం ఎన్నో సంగతులను
తన స్వంతం చేసుకోవాలని తాపత్రయపడుతుంది.
విజ్ఞానం తనకందకుండా అభివృద్ధిజెందండం
 మనం చూస్తూనే వున్నాం,

కొన్ని విషయాలు కాలానికని కనుగుణంగా
మారడానికి ఎంతమాత్రం ఇష్టపడవు.

ప్రధమచుంబనమే అందుకు సోదాహరణం.
అదులోని మాధుర్యం ఎంతకాలంగడిచినా
వెగటనిపించదందుకే!!

ఈప్రపంచం ఎన్నింటినో సుదీర్ఘంగా
 బోధజేయాలనుకుంటుంది.
వసంతం ఎవరి అనుమతుల్లేకుండానే
సమయానికి కాలానుక్రమంలో  మన
వాకిళ్ళలోకొచ్చి వాలిపోతుంది.

పూలన్నీ అప్పుడే కొత్తగా రెక్కలుతొడుక్కుని
నవనవోన్మేషంగా తోటలన్నింటినీ
సౌందర్య రిరంసతో నవనవలాడడానికితోడ్పతుంది.
చలితనదుప్పటిని సరయిన సమయానికే
సర్వప్రాణికోటిమీదకు విసురుతుంది.
గ్రీష్మం రాగానే పిల్లలు తమసెలవులను
ఆటపాటలతో, కేకలూకేరింతలతో గడుపుతుంటారు.

ప్రపంచం ఎన్ని విధాలుగా ఆంక్షలు విధించినాసరే
కొన్ని సంగతులు సందర్భాలకనుగుణంగా ఎలాంటి మార్పులనూ
అంగీకరించడానికి ససేమిరా ఇష్టపడవు.
మొదటి చుంబన మాధుర్యం, ప్రధమంగా సమీపించిన
మృత్యుకౌగిలీ ,ఇంకా విషాదగీతాలనాలపించడానికి
అలవాటుపడిన గొంతుక ససేమిరా ఎలాంటి మార్పులకూ తలొగ్గవు.

[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో ---]           1-10-15
నాపేరు ముద్రితమైన వలపు బాణాలు
మన్మధాకారుడొకడు, సంధించడం మొదలెట్టాడు.
అవిసరిగ్గా నా గుండెకు సూటిగా తగిలాయి.
ఇప్పుడు నేను తరుణ వయస్కురాలినీ కాను
అర్ధరాత్రిదాకా ఉబుసుపోక సంభాషణలతో
కాలాన్ని వెచ్చించి దుబారాచేయగల మనస్తత్వమూకాదునాది.

అప్పుడు మన్మధుడు సూటిగా నావైపు తన దృక్కులను సారించాడు.
నీకు సహజంగా ప్రణయానురక్తిలేకపోతే ఇప్పటిదాకా ఎందుకు మేల్కొన్నట్లో!!
కేవలం మౌనాన్నాశ్రయించడం నావంతుగా మిగిలింది..
[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో]
======================================
ఏకాంతసేవ
=================


ఏకాతంలో ఎంత హాయిద్యోతకమౌతుందో
ఇప్పుడిప్పుడే నాకవగతమౌతుంది.
అర్ధంపర్ధంలేని కబుర్లతో
కాలాన్ని దుబారాగా వెచ్చించడం
ఎంత వృధాప్రయాసోకూడా అవగతమౌతున్నది.

అపార్ధాలకాశ్రయమివ్వగలిగినదే ఏకాంతం
నిరాకరణకాస్కారమిచ్చేదే గదా ఏకాంతమంటే
అన్ని సందర్భాలలోనూ అది అందమైన
వస్తుగుణాలను సంతరించుకోదు.

ఓ ధరణీ మాతా!!
నీహృదయమెంత విశాలమైనది
నీ బాహుబంధాలెంత అనురాగ భరితమైనవి.
ఇంతకాలం ఈసత్యాన్ని గుర్తెరిగడంకోసమేగదా
నన్ను జీవించమని నువ్వు ఆజ్ఞాపించైనది,

నదులు నిరంతరం ప్రవహిస్తూనే వున్నాయి
సుమాలన్నీ సుప్రభాతవేళకే వికసించి
పరిమళాను ప్రసరింపజేస్తూనే వున్నాయి.
ఇంతకన్నా అదృష్టమైన జీవితసందర్భమెక్కడైనా
ద్యోతకమౌతుమందా చెప్పవమ్మా!!====================

Thursday, October 1, 2015

జగతిప్రస్థానం
---------------------రావెల
============================

ఈ యావత్ప్రపంచం ఎన్నో సంగతులను
తన స్వంతం చేసుకోవాలని తాపత్రయపడుతుంది.
విజ్ఞానం తనకందకుండా అభివృద్ధిజెందండం
 మనం చూస్తూనే వున్నాం,

కొన్ని విషయాలు కాలానికని కనుగుణంగా
మారడానికి ఎంతమాత్రం ఇష్టపడవు.


ప్రధమచుంబనమే అందుకు సోదాహరణం.
అదులోని మాధుర్యం ఎంతకాలంగడిచినా
వెగటనిపించదందుకే!!

ఈప్రపంచం ఎన్నింటినో సుదీర్ఘంగా
 బోధజేయాలనుకుంటుంది.
వసంతం ఎవరి అనుమతుల్లేకుండానే
సమయానికి కాలానుక్రమంలో  మన
వాకిళ్ళలోకొచ్చి వాలిపోతుంది.


పూలన్నీ అప్పుడే కొత్తగా రెక్కలుతొడుక్కుని
నవనవోన్మేషంగా తోటలన్నింటినీ
సౌందర్య రిరంసతో నవనవలాడడానికితోడ్పతుంది.
చలితనదుప్పటిని సరయిన సమయానికే
సర్వప్రాణికోటిమీదకు విసురుతుంది.
గ్రీష్మం రాగానే పిల్లలు తమసెలవులను
ఆటపాటలతో, కేకలూకేరింతలతో గడుపుతుంటారు.



ప్రపంచం ఎన్ని విధాలుగా ఆంక్షలు విధించినాసరే
కొన్ని సంగతులు సందర్భాలకనుగుణంగా ఎలాంటి మార్పులనూ
అంగీకరించడానికి ససేమిరా ఇష్టపడవు.
మొదటి చుంబన మాధుర్యం, ప్రధమంగా సమీపించిన
మృత్యుకౌగిలీ ,ఇంకా విషాదగీతాలనాలపించడానికి
అలవాటుపడిన గొంతుక ససేమిరా ఎలాంటి మార్పులకూ తలొగ్గవు.

[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో ---]

ఈ ఉత్సవాన్నిపండుగలాగా జరుపుకుండాం
లక్షలాదిమనది ఈ ప్రాంతానికి
 వెల్లవలాగా తరలిరండి
తరంగాల్లా ఉవ్వెత్తున ఎగసిపడ్వలసిన పండుగ ఇది.

ఇకపై ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఆత్మహత్యల మాటే వింపించదు.
చావుడప్పుల శబ్దాలాన్నీ నిన్నటికే పరిమితమౌతాయి నిజం నమ్మండి.

పచ్చబద్దల పల్లకీలపై ఊరేగే అవసరం ఇకపై పంటపొలాలద్వారా
నష్టపోయే రైతులే వుండరoడి.
అందుకే అలా దీక్షగా ముందుకు సాగిపోతున్నాం.
నా మనుమడిని చూసే సమయంకూడాలేదు ఇది వాస్తవం.

పంటపొలాలనన్నింటినీ రాజధాని నిర్మాణకోసం
ఒక ప్రణాలికా బద్ధంగా లాగేసుకున్నాం మీకు తెలుసుగదా!!
పంటలే లేని కర్షకావళికి ఇక చచ్చిపోయే అవసరం రాదు.
అందుకే విదేశీ పెద్దలంతా ఈ శంకుస్థాపనను వేడుకగా
చూసి కన్నులనిండా పండుగ శో భను నింపుకోవడానికి
ఉరుకులూ పరుగులతో తరలివస్తున్నారు,మీరూ తప్పక విచ్చేయండి.

రైతులంటూ లేకుండా పోతున్న రాజధాని ప్రాంతానికి మీ శుభాకాoక్షలందజేయండి.
సింగపూరు ప్రభువుల జడలో మల్లెలు తురుముదాం రండి.  రైతుల్లేని రాజధాని
దగ్గర నిర్మించే స్మారక స్థూపానికి మీ వంతు విరాళాలిచ్చి
సహకరించండి. ఇట్లు మీరు కొని తెచ్చిపెట్టుకున్న కొరివి.
==========================================

Wednesday, September 30, 2015

విసురుగా ఓ గాలి వీధిలోంచి కిటికీ గుందా
ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూకూర్చునే గదిలోకొచ్చి వాలింది.

గోడకు వ్రేలాడుతున్న నా లామినేట్ అయిన చిత్తరువు
ఊగిపోవడం మొదలయింది--నీ పేము కుర్చీలో నువ్వుకూర్చుని
లలితాసహస్రనామాలు వల్లె వేస్తున్న భ్రమ నన్ను విస్మయపరిచింది
ఈ రెండేళ్ళ రెండునెలలలో జరిగిన విశేషాలు మనుమరాలు
ఏకరువు పెడుతుంటే చెవులు శ్రద్ధగా రిక్కించి వినడం నీ వంతయింది.
నిన్ను అప్పటిదాకా చూసిన పాపానపోని చిన్ని మనుమరాలు
గుక్క తిరుగకుండా ఏడుపు లంకించుకుని ఆపకుండాఅరున్నొక్క రాగం అందుకుంది.



పెద్ద మనుమడు తను పాఠ శాల్లో సాధించిన విజయాలను ఏకరువు
పెడుతుంటే నువ్వు  నిన్ను చూసి గర్వపడుతున్నానురా కన్నా అన్నమాటలే నాచెవుల్లో వేదంలో వల్లించే పనసల్లా రింగుమనడం మొదలయింది. మనుమరాండ్రంతా పట్టు పరికిణీ వోణీలతో కనులముందు అలానడయాడుతుంటే నీహృదయం ఆనంద వార్ధిలో
మునకలేస్తూ నీ కన్నులకు విందుగా మారడం నేను గమనించాను.
ఇదంతా నిజమా కలా అని నేనుతేరుకునేలోపే నీవదృశ్యమవడం
నిజంగా నా దురదృష్టానికి నిదర్శనమని ఇట్టే అర్ధమై పోయింది. 

Tuesday, September 29, 2015

నీ మృదుమధురమైన
అనురాగబంధాలన్నింటినుంచీ
నన్ను పూర్తిగా విముక్తం గావించు.
ప్రియా నన్ను సర్వాంగాలా మత్తిలజేసే
అధరామృతాన్ని ప్రేమపురస్సరంగా నాకందించు.

నీ గృహద్వారాలనన్నింటినీ బార్లాతెరువు.
ఉదయకాంతులన్నింటినీ స్వేచ్ఛగా అన్ని మూలల్లోకీ
ప్రసరించేలా చూడు.

నాసర్వస్వాన్నీ నీకు సమర్పించుకున్నాను.
నీ అనురాగానుభూతులను మెత్తని దుస్తుల్లో మడిచిపెట్టి
భద్రంగా నులివెచ్చదనం అందేలా ఎక్కడయినా దాచిపెట్టు.

నన్ను నీ వశీకరణ పరిధుల్లోంచి విముక్తం గావించు.
మళ్ళీ నాపురుషవాన్ని నాకందించు.
అప్పుడు మళ్ళేఏ నేను స్వంత్రమైన హృదయంతో నీకు
పునరంకితమయే దిశగా చర్యలు చేపడతాను.

[టాగూరు తోటమాలిలోని కవితకు తెలుగుసేత]

బహుముఖీనంగా--------
---------------రావెల పురుషోత్తమరావు.
=========================



ఒకప్పు డు నాకు
ఒక్క ముఖమే వుండేది,
అందరి ఆదారాభిమానాలను
చూరగొంటూ ఆదర్శంగా
బ్రదుకు తుండేవాడిని.

ఆతర్వాత రెండుముఖాలొచ్చాయి
ఆంతరింగికంగా ఒక విధంగా
బాహిరకంగా మరో రకంగా
పరిచయమవుతూ
 పరకాయప్రవేశం
చేసే వాడిగా అందరినోళ్ళలో
పలుచబడిపోయాను.

ఇప్పుడిలా కాలక్రమేణా
రాజకీయాన్నాశ్రయించగానే
ఒ క్కుదుటన బహుముఖాలొచ్చి
బరితెగించిపోతున్నాను.

రాజధాని నిర్మాణంకోసం
రైతులచేతుల్లోంచి పచ్చని
పంటపొలాలను గుంజుకునేస్థితిలో
ఒక రకంగా ప్రత్యక్షమౌతాను.
దేబిరించే ముఖంతో
 దీనంగా ప్రత్యక్షమౌతుంటాను.
తరతరాలుగా, వంశానుక్రమంగా
 వస్తున్న ఆస్తిని పోట్టుకున్న రైతుల్లా
 దీనాలాపంతో  మరో దశలో దర్శనమిస్తాను.

అవినీతి అక్రమాలకు
అడ్డాగా నిలిచినప్పుడు
ఎర్రబడినమొహంతో
పే  ట్రేగి  పోతుంటాను.
అధికారులతో అనధికారులతో
గిల్లికజ్జాలు పెట్టుకుని పత్రికలకెక్కి
పొంగిపోతూ వుంటాను.

ఓదార్పు యాత్రలప్పుడూ
పరామర్శపేరుతో
 పలకరింపులకెళ్ళినప్పుడూ
దైన్యవదనం తో
 పులుముకుని
దిష్టి బొమ్మనుపోలి నిలుచుంటాను.

రంగులు మార్చుకునే రాజకీయానికి నేనే

రంగవల్లినై వూసరవల్లికి
 కూడా మార్గదర్శినైపోయాను.


నేనే నిర్వచనమై సోపపత్తికంగా
నిర్వచనంగాకూడానిలబడిపోయాను.
ఇన్నిముఖాల కవళికలమధ్యన
అసలు ముఖ కవళికలు అదృశ్యమై
అన్ని సమయ సందర్భాలలోనూ
వివర్ణుడనై వెకిలిగా అందరికీ
కనబడుతూ నవ్వుతాలుగామారిపోయాను.
------------------------------------
Ravela purushothamarao
1651 briar cliff dr
nolensville TN[USA]
37135
బహుముఖంగా
---------------రావెల పురుషోత్తమరావు.
=====================================



ఒకప్పుదు నాకు
ఒక్క ముఖమే వుండేది
అందరి ఆదారాభిమానాలను
చూరగొంటూ ఆదర్శంగా
బ్రదుతుండేవాడిని.

ఆతర్వాత రెండుముఖాలొచ్చాయి
ఆంతరింగికంగా ఒక విధంగా
బాహిరకంగా మరో రకంగా
పరిచయమవుతూ పరకాయప్రవేశం
చేసే వాడిగా అందరినోళ్ళలో
పలుచబడిపోయాను.

ఇప్పుడిలా కాలక్రమేణా
రాజకీయాన్నాశ్రయించగానే
ఒక్కౌదుటన బహుముఖాలొచ్చి
బరితెగించిపోతున్నాను.

రాజధాని నిర్మాణంకోసం
రైతులచేతుల్లోంచి పచ్చని
పంటపొలాలను గుంజుకునేస్థితిలో
ఒక రకంగా ప్రత్యక్షమౌతాను.
దేబిరించే ముఖంతో
 దీనంగా ప్రత్యక్షమౌతుంటాను.

అవినీతి అక్రమాలకు
అడ్డాగా నిలిచినప్పుడు
ఎర్రబడినమొహంతో
పేత్రేగిపోతుంటాను.

ఓదార్పు యాత్రలప్పుడూ
పరామర్శపేరుతో
 పలకరింపులకెళ్ళినప్పుడూ
దీనాలాపం పులుముకుని
దిష్టి బొమ్మనుపోలి నిలుచుంటాను.
రంగులు మార్చుకునే రాజకీయానికి నేనే
వూసరవల్లికి కూడా మార్గదర్శినైపోయాను.


నేనే నిర్వచనమై సోపపత్తికంగా
నిర్వచనంగాకూడానిలబడిపోయాను.
ఇన్నిముఖాల కవళికలమధ్యన
అసలు ముఖ కవళికలు అదృశ్యమై
అన్ని సమయ సందర్భాలలోనూ
వివర్ణుడనై వెకిలిగా అందరికీ
కనబడుతూ నవ్వుతాలుగామారిపోయాను.
--------------------------------
ఈకవిత నా స్వంతం దేనికీ అనువాదంగానీ
అనుసరణగానీ కాదనీ ఇది
ఎక్కడా ప్రచురితంకాలేదనీ మనవి.]
వ్యధాంతరంగం
-------------------రావెల.
^^^^^^^^^^^^^^^^^^^
నాలోకి నేనప్పుడప్పుడూ తొంగి చూసుకుంటుంటాను.
అలా చూసినప్పుడొక్కొక్కసారి ఓ శూన్య భాగీరధిలా
నా అంతరంగం నాకు దర్శనమిచ్చినా,  అది సుందరమైన
చిద్విలాసమూర్తిగానే నాకుకనిపించి కంట నీరొకేలా చేస్తుంది.

ఒక్కో సారి అదే అంతరంగం ,భీత హరిణేక్షణగానూ
సాక్షా త్క  రించి నన్ను సకృత్తుగా కళవళపెట్టి
ఆశ్చర్యాంబుధిలో ఆసాంతం మునకలేసేలా చేస్రుంది.

ఇలా ఎన్నోసార్లు నాంతరంగమే ఒక అపరిచిత బ్రహ్మ పదార్ధమై
నన్ను నేనే మరోసారి పరిచయ వాక్యాలతో ఆవిష్కారం
 చేసుకోక తప్పదనే స్థితికి దిగజారుస్తుంది.

ముందుమాటలెప్పుడూ ముఖప్రీతినే కలిగించాలి తప్పదు.
కనకపు సిం హాసనాన్నధిష్టించిన శుభ ఘడియలుకదా
వెనుకటిగుణం అంత తేలికగా మరపుకు రాదుగదా

ఆలోచనారాహిత్యానికి
అసంతృప్తి జ్వాలలో
దహించిపోక తప్పదులా వుంది
క్షమించాలి .

ఆవేశంగా అంతరంగాన్ని
 అనుమానించాననే బాధ
నా చిరకాల వ్యధ గా
పరిణమించి   నన్ను
క్షుబితుడిని గావిస్తుంది.

Monday, September 28, 2015

ఉదయాన్నే రక్తాక్షరాలతో
ప్రతి ఇంటి ప్రాగణాన్నీ
రంగవల్లులతో తీర్చి దిద్దుతుంది.
అన్ని పుటల్లోనూ ప్రమాదాల సం రంభాలే
ఫొతోలతోసహా శుభోదయం చెపుతుంటాయి.

అక్కడక్కడా ఆడవాళ్ళ
 మానాన్ని హరించే మృగాళ్ళ
మాయా వలయాల కధనాలు.
మధ్య మధ్యలో నెరవేరబోని
వాగ్దానాల స్వప్నాలను
ఆవిష్కరించే అమాత్యవరుల
శుష్క ప్రియాల   శూన్య స్వప్న రధాలు.



ఇప్పుడు మేము మాఅయుధాల లక్ష్యాన్ని సమూలంగా మార్చేసాం.
ముందస్తుగా రాజధాని నిర్మాణంపేరుతో
పచ్చని పంట పొలాలపై దృష్టి సారించాము.
వ్యవసాయం దండగన్న గత పాలనలో అన్న
 మాటనుకూడా మరిచిపోయిమళ్ళీ
 నన్నెకున్న మీకందరికీ సస్య శ్యామలమనుకుంటున్న పొలాలలన్నింటినీ స్మశానం దిశగా తరలించి
నా తఢాకా చూపిద్దామని ప్రయత్నించి సఫలమయ్యాను.

మనదేశంలో సాకేతికత పెద్దఫీట వేయాలనుకుని మీరంటుంటే
పాతపరిచయాలను పునరుద్ధరించుకుంటూ సింగపూరు వాళ్ళకు
వేల కోట్ల ప్రాజెక్టులనిచ్చి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటాను.
ఒడుదుడుకుల్లో కూడా అక్కడి నా ఆస్తులను సం రక్షించిన ప్రభువులకు
ధన్యవాదాలు తెలిపేందుకే ఈ ప్రక్రియ చేపట్టాను.

ఎండిపోయిన నదిని చూసినప్పుడల్లా
బీడువారుతున్న పొలాలకు
అది  ముఖద్వారమై
నిలుస్తున్నట్లనిపిస్తుంది.

దైవాధీనం బ్రదుకుల్లో
నిప్పులు పోస్తున్న నేతల
వాగ్దానంలా వేధిస్తుంది.

సింగపూరు కలల పూలను
ప్రతిపాకలో పూయిస్తున్న
మూర్ఖపు పెట్టెలా
ఏమారుస్తుంది.

మరా మరా అంటూ
రామాయణరచనకాద్యుడైన
వాల్మీకి మహర్షిని
వేళాకోళం చేస్తున్న ధోరణే కనిపిస్తుంది.

సాంకేతిక వలయాల్లో చిక్కుబడిపోతున్న
సాలీడులా గిల గిలా కొట్టుకుంటున్న
భారతం కట్టెదుటన  ద్యోతకమౌతున్నది.

వ్యవసాయం దండగని నుడివిన నేతకు
నీరాజనం పలుకుతూన్న జనావళికి
ముందున్న ముసళ్ళ పండుగను గుర్తు చేస్తున్న
అధ్యాయం దృశ్యమానమవుతున్నది.

నర్మగర్భంగా ఊడబెరుక్కున పొలాలరైతుల
వాడిపోయిన ముఖాలే ముఖచిత్రంగా మిగిలిపోతుందని
హెచ్చరికలు జారీ చేస్తున్న నది
భావితరాన్నే     జ్ఞప్తి  కితెస్తున్నది.
===========================

Sunday, September 27, 2015

పంట కాలువలు పరుగులు
తీయవలసిన పొలాల్లో
ఈనెత్తురు మడుగులేమిటి?


ఆరుగాలాలు శ్రమించే
కర్షకుల దైనందిన
 జీవితగమనంలో
నిర్భరమైన ఈ
 దుర్దినాలెందుకు?

పనీపా టలతో
ఉరుకులిడవలసిన
చేలగట్లపైన
ఈ శవాలగుట్టలెందుకు?





"నీ"రస గుళికలు-3
-----------------రావెల
==========================
పాల వెల్లువలో
ప్రకటితమైన
పాపాల భైరవుల
 పరిహాసపు చిట్టాలు.
---------
ఊరు పొలిమేరల్లోకి
 రాగానే
కమురుకంపుకొడుతున్న
బీడువారిన పొలాలు.
----------
ఉదయస్తమానం
కాలవ్యవధినెరుగని              
దుష్ట దర్శనం చేసుకుంటున్న
కాపురుషుల ప్రవచనాలు.


----------------
పనికి మాలిన
యంత్రాంగంతో
ఉబుసు పోక సమీక్షలు.
-----------------
అమాయకుల కళ్ళల్లోకి
సూటిగా దిగుమతౌతున్న
సింగపూరు కలలు
--------------


Saturday, September 26, 2015

నీ స్మృతులన్నీ నాకు
సుమధుర స్వప్నాలై మృదువుగా
స్పర్శిస్తాయి.
కనుకొలకుల్లో దాగిన నీటిని
కాళ్ళదాకా ప్రవహింపజేస్తాయి.

ఆ అఖండజ్యోతులతోనే నేను నా
ఏకాంతదీపాలను వెలిగించి
గుండెలోతుల్లో గూడుకట్టుకున్న చీకటిని
చివరంటా పారద్రోలే ప్రయత్నం చేస్తుంటాను.

తరుసమూహాల్లోంచి తరలివచ్చే
నీదరహాస చంద్రికలకోసం
చెవులు రిక్కించుకుని కళ్ళప్పగించుకుని మరీ
ఎదురుచూస్తూ నిలుచుంటాను.


మన మనోభావాలు వేర్వేరుగా కంపించినా
అవీ ఒక రంగుల అద్దకంలా శోభిల్లుతూ
సోయగాలనొలకబోస్తూ
 సౌందర్యసేతువులను చేఉకుంటుంటాయి.

మండించే ఎండలుగానీ ఒడలంతా  తడిపేసే వానలుగానీ
వాటిని వివర్ణంచేయగల సత్తా లేదని అర్ధమైపోతున్నది.


నీవు నాతో మాట్లాడుతున్నంతకాలం
నాలో నిశ్శబ్దం నిష్క్రమిస్తూ వుంటుంది.
నీవు మౌనాన్నాశ్రయించినప్పుడుమాత్రం
ఏవో కర్ణకఠోరమైన శబ్దాలు
 నన్ను కళవళ పెడుతుంటాయి.



నిన్నటి బాధలన్నీ ఒడ్డుకుచేరుకొని
చెలియలికట్టనుకూడా దాటుకుని
దిగంతాలదరికి మనిద్దరికీ దూరంగా
జరిగిపోవాలని స్వేదం వెలారుస్తూ సాగుతూ వుంటాయి.


కొగ్రొత్తగా కురుస్తున్న అభిమానపు చినుకులు
నా అనుభూతి సరస్సులవైపుకు మరలించాలని
నిరంతరం శ్రమిస్తుంటాను.
నీచిరుదరహాసాల్లో తొంగిచూసే
అమాయకత్వాన్ని అనవరతం
నాగుండే గుప్పిట్లో దాచుకోవాలనే తలoపుతోనే
అనవరతం శ్వాసిస్తూ జీవన గమనం కొనసాగిస్తుంటాను.

మరణ మృదంగనాదం
============================


ఎందుకో ఇప్పుడిక్కడ
చెట్లపై పక్షులు
 వాలడం మానేసాయ్.

పొలంగట్లపైమొలిచిన
బంతిపూల మొక్కలన్నీ
 మౌనవ్రతం పాటించాయ్.

పొలంలో నిలబెట్టిన
దిష్టిబొమ్మ
తను గగనం నుంచి వ్రాలే
గ్రద్దలకూ  దూడబోతులకూ
 కాపలా కాయలేనని
కన్నీళ్ళ పర్యంతమై నేలకొరిగింది.

అప్పుల ఊబిలోంచి
బయట పడే మార్గం తోచక
కర్షకులు గొంతులు నులుముకుంటుంటే
రాజకీయపు రాబందులు
చోద్యంచూస్తూ నిలుచుంటున్నాయ్.

ఈ కుంభకర్ణులను నిద్రలేపడమెలాగో తెలియక
కవిలోకం చెవిదగ్గరగా చావు డప్పు మోగిస్తూ
చైతన్యం కలిగించాలని
శతవిధాలా శ్రమపడుతూ స్వేదాన్నే సిరాగా
మార్చి మరీ కవితలనే
చెర్నా కోలాలతో అదిరించి బెదిరించాలని
చెమటోడుస్తూ ఎదురు చూస్తున్నది.
=====================================

Friday, September 25, 2015

మిట్ట మధ్యాహ్నం
నా పాదాలక్రిద నలుగుతూ
సూర్య భగవానుడు.
-----------------------
తొలకరి చినుకులు
నేలకొరిగిన రైతన్నలకు
అశ్రు నివాళి
-------------------
రాలిపడుతున్న ఆకులు
అంద రాని ఆశలకు
వీడ్కోలు గీతాలు
--------------------
సూర్యుడూచంద్రుడు
ఒకేకక్ష్యలో
యుగళగీతాలు పాడుకుంటూ.
--------------------------
గ్రీష్మంలో  చినుకుల సందడి
కుక్కలు నక్క లపెళ్ళికి
భజంత్రీల వాద్యకచేరీ. .
---------------------

సెలవయ్య సిద్ధ గణపతి
కొలువున నీవుంటివయ్య కులదైవతమై
పలువురి చందాలడుగగ
నలుగురితో దిరుగు పడతి నా ఇల్లాలే

నేను నీవంక నిశితంగా దృష్టిని నిలిపితే
అంతరాంత రాళాల్లో నీవనుభవిస్తున్న
బాధ నాకవగతమయిందిలే!
అది నీ అంతరంగంలో అట్టడుగున
నక్కివుండి నాటకమాడుతున్నదేమోనని
 నా  అనుమానం.
అది నీ చిరునవ్వు వెనుకనే
దాగి దోబూచులాడుతున్నదేమోనని
 గూడానాకు సందేహం.
నీ మౌన ముద్ర నీవు దానికందించిన
అమూల్యాభరణం కాదుగదా!!

అవును నాకర్ధమవుతున్నది
నువ్వు బయటకు చెప్పుకోలేని
 బాధ ఏదో నిన్ను
 చింతాక్రాంతను చేసి
వేధిస్తున్నట్లున్నది.ఔనా!!

ఐతే ఓ చిన్న పనిచేస్తానులే ప్రియతమా!
నాప్రేమ పూతపూసిన సూదిమొనతో
ఆ వ్రణాన్ని
తొలగించే ప్రయత్నం చేస్తాను.
ఒక్క క్షణం ఓపిక పట్టు
కాదంటే ,నామీద ఒట్టేసుమా!!!
==================================



నేను నడుస్తున్నంతసేపూ
నాతో నువ్వు నడుస్తున్న అనుభూతి
నేను నవ్వుతున్నంతసేపూ
నాతో నీవు శృతి కలుపుతున్నావనే
అమృత భావన.
 ఎన్నెన్ని అనుభవాల సమారోహమో గదా
మన జీవన సంగమం.
నడిమయాన అనుకోకుండా ఆవిర్భవించిన
ఈ పాంధశాల.

మిగిలిన జీవన సమరంలో
ఒంటరి యాత్రికుడిగానే గదా నా  ప్రయాణం.

దాహమైనప్పుడే తెలుస్తుందేమోలే
ఎడారియానంలోని ఒడిదుడుకులలో
 నేర్చుకున్న పాఠాల యొక్క సారాంశం.

ఏకాంతం వెక్కి వెక్కి  యేడుస్తున్నప్పుడేగదా
అవగతమయేది దు:ఖాశ్రువుల దాహార్తి.
======================================




Thursday, September 24, 2015

అప్రస్తుతం
==========
అతనెప్పుడూ అంతే
అర్ధంగాని పదబంధాలతో
కవితలనల్లి నన్ను
గందరగోళంలో పడేస్తాడు.

ప్రశ్నార్ధకంగా మొహంపెడితే
వినని వృత్తాలతో పద్యాలనల్లి
వేధిస్తూ వుంటాడు.

ప్రేమించు!! కవితలనూ , వాటి కవులనూ
ఎలాంటి ఇబ్బందీ ఉండబోదు.
వారిని పెళ్ళిచేసుకోవాలనుకుంటేనే
ఇంకొక్కసారి ఆలోచించి చూడు.

[షరా-మామూలుకాని విషయం-
నాకవితాయానమే తనను నాదగ్గరకు చేర్చి
నాలుగుదశాబ్దాలపాటు నవనవోన్మేషంగా గడిపించి  నడిపించింది.]
============================================

అభ్యంగన స్నానానంతరం
చిక్కుబడిన తనజుట్టును
చక్కగా సరిజేసి ముచ్చటగా
మూడుపాయల జడనల్లాలని
ఈర్పెనతో సిద్ధమయి కూర్చున్నాను.
ఇద్దరం అంతరంగాలనావిష్కరించుకునే
అత్యంత విలువైన సమయమూ
 సందర్భమూ మాకదె సుమ్మా!!!
దిగులుగా అమ్మయి దిగాలుపడుతూ వచ్చింది.
దీనికేమయిందిరా భగవంతుడా అని
 గుండెను  గొంతులోకి తెచ్చుకుని మాటాడాను.

పాకిస్తాను వాడిక మనతో
క్రికెత్ ఆడనన్ని చెప్తున్నాడే
అని కనీళ్ళపర్యంతం అయితే
నాలుగు మాటలు చెప్పి
 ఓదార్చే ప్రయత్నం చేసాను.

వాడెవడో ధీరోదాత్తుడయిన
సినీ హీరో తను ప్రేమ వివాహంచేసుకున్న
నాయికైన భార్యకు విడాకులిస్తానంటున్నాడని
గద్గమైన గొంతుతో ఘోషిస్తూ  చెప్పింది.

మళ్ళీ సాయంత్రానికి సర్దుకుపోతారులెమ్మని
సహనంతోసర్దిచెప్పాను.కనబడని దేవతలకు
స్తోత్రపాఠాలతో తనగోడును విన్నవించుకుంది.

సాయంత్రానికి వాతావరణం చల్లబడినట్లుంది.
ఇంట్లోకివస్తూనే ఘట్టిగా నన్ను కౌగిలిలో
బంధించి ఉర్రుతలూగుతూ చెప్పింది.
ట్విట్టర్లో ఇద్దరం ఇక కలిసే వుంటామని సందేశం పెట్టాడని.
అమ్మయ్య రక్షించాడు. ఓదార్పు యాత్రలకు
అవకాశమివ్వని అతనికి తల్లిగా
మనసులోనె ధన్యవాదాలు సమర్పించాను.

ఆమెకు నచ్చిన దిగుమతి కధానాయిక
నటించిన సుత్తి సినిమా వందకోట్లకు
వసూళ్ళలోపడగలెత్తిందని ఉషారుగా చెప్పి
నన్ను మురిపాల ముద్దులతో ముంచెత్తేసింది.
అహహా నా భాగ్యము మాతగా ఎంతనో అనుకుంటూ
మురిసి ముక్కలయిపోయాను.
ఈ యవ్వనోద్రేకం మా ఇంటికే పరిమితమేమోనని
దిగాలుపడుతూ కూర్చున్నాను. పొరుగింటి బామ్మగారు
తనమనుమరాలి ధోరణీ ఇదేనని గవాక్షం
 దగ్గరకొచ్చి నొక్కివక్కాణించింది.
ఎదురింటి మీనాక్షి అక్కయ్యకూడా ఇదే అనుమానంతో
చిక్కి శల్యమవుతున్నదట ! కూరగాయలు కొంటూ
అసలు విషయం చెవులో ఊదేసింది.
అమ్మయ్య ప్రతి ఇంట్లో ఇదే మహా  భాగవతం
ఇదే రామాయణ కలవృక్షమనీ  , తెలుసుకుని
పాత చింతకాయ పచ్చడిలాంటి నా మనస్సును
సంబాళించుకుని సర్దుకుపొమ్మని సలహా ఒకటి విసిరేసి
వంటపనీ , ఇంటిపనిలో హాయిగా మునిగిపోయాను.
===================================

Wednesday, September 23, 2015

విరబోసుకున్న జుట్టునుచూసి తనను  గద్దించి మరీ
 జడవేయవలసి వచ్చినప్పుడే
మామ్మాయికీ నాకూ మట్లాడుకునే
సమయం సందర్భమూ కలిసొస్తాయి.


తనేమో  ప్రాపంచిక విషయాలను
తాజాగా మనసుకు పట్టించుకుని
సుఖ దు:ఖాలమధ్యన ఊగిసలాడుతూ
భావోద్రేకాలకు లోనయి యాగీ పెట్టేస్తుంటుంది.

చిక్కు తీసినంతసేపూ గగ్గోలు పెడుతూ గాబరా
ప్రతి విషయాన్నీ మనసుకు పట్టించుకుని
బహు విధాలా సతమతమౌతూ హైరనా పడుతూ వుంటుఇంది.


పాకిస్తాను ఆటగాళ్ళు ఇండియాతోఇక
ఆడే ప్రసక్తిలేదన్నారని చింతాక్రాంత అవుతుంది.
హిందీ సినిమాలలో నటించిన జంట ఉత్తుత్తి కారణానికే
విడాకులకోసం దరఖాస్తు పెట్టుకున్నారని విని
దు:ఖ భాజన ఔతుంది. మళ్ళీ కలిసి జీవిస్తామని
ట్విట్టెర్ళో చెప్పారని సంతోషంలో నన్ను
ఘట్టిగా వటేసుకుని మరీ చెప్పింది.


ఈ అకారణప్రేమకు ఉబ్బితబ్బినైన నేను
తను పెట్టిన ముద్దును అమృతతుల్యంగా భావిస్తాను.
తన ధీరోదాత్తుడి సినిమా వంద కోట్లను
వసూలు చెసిందని కేక్ ను కట్చేసిమరీ సంబరపడింది.


నాకు తలనొప్పొచ్చినా, ఆయనకు నడుంపట్టేసి బాధపడుతున్నా
యేమీ ఎరగనట్టుగానే తను ప్రవర్తించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ యవ్వనోద్రేకం మాఇంటికే పరిమితమేమోనని ఖేదపడ్డాను.
ఎదురింటి పిన్నిగారు,ప్రక్కింటి బామ్మగారూ ఇదే ధోరణిని
వ్యక్తపరిస్తే వాళ్ళను ఊరడించడం నావంతయింది. నిజం సుమా!!
========================================
అటుమొన్న
తెల్లటి కాగితాన్ని
మొన్న
నీలి సిరా వున్న
కలాన్ని.
నిన్న
ఓ కవితని.
నేడేమో
వదనగ్రందంలో
ఇస్ఠులకోసం
ఆరాటపడే
'భార' విని
ఔనన్నా కాదన్నా
======================
ప్రతి పుస్తకానికీ పీఠికలా నీవొస్తావు
  ప్రతిపూవులోనూ పరిమళమై ప్రసరిస్తావు.

  ముందు మాటలోనిముఖస్తుతివై నీవు నిలుస్తావు
 అందులోని అంతరార్ధం గ్రహించక నేను విలపిస్తాను.

  పానశాలలోని మధు పాత్రలా మెరిసిపోతావు
  గరళంలా గళం దిగకుండా నన్ను యేడిపిస్తావు.

 ఆధునిక చిత్ర కళాఖండమని దానిని  నీవు గౌరవిస్తావు
 అది అవగతం కాలేదని నేను  అప్పిసెం  వగరుస్తుంటాను.

అస్తమయమప్పటి ఆకాశంలా రంగులుమారుస్తావు
 అసూర్యంపశ్యవు నీవేనన్న భ్రమలోనే జీవిస్తాను.

కలకాలమిదే కధను కవితలా వినిపిస్తాను
నీవు కాదంటే ధృవతారలా నింగికెగసిపోతాను.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
నన్ను నీలోకి తొంగి చూసినప్పుడలా
ఓ చీకటికోణం బహిస్కృతమౌతుంటుంది.
నీలోకి నన్ను ఆవిష్కరించుకున్నప్పుడలా
ఓ కాంతిపుంజం వెలుగులీనుతున్నట్లుంది.

మనిషికీ మనసుకూ మధ్యన అంతుబట్టకుండా,

అర్ధంకాకుండా మిగిలిపోతున్న
అంతరంగ కధనాలు అనల్పం

మనసుకూ మనసుకూ నడిమయాన
దట్టంగా పెరుగుతూన్న మొగలిపొదలు.
వాటిని చూసీ చూసీ భయం భయంగా జారిపడి
అస్తిత్వాన్నికోల్పోతున్న ఆలోచనా వల్మీకాలు.

హృదయగతంగా యేకాంతా లేని
యేకాంతంలోకూడా
పట్టుకుని వదలనుపొమ్మనే
మల్లె పూల సుగంధాలు.

ఎక్కడో ఏదో తేడా గొట్టింది.
విషణ్ణవదనంలో ఎక్కడో
ఓ స్మృతివనం మొగ్గతొడిగింది.
అటకమీద భద్రంగా
దాచుకున్న జ్ఞాపకాలకు
సజీవమైన స్పందనేదో
సాక్షీ భూతంగా తగిలింది.

ఈ అస్తినాస్తి విచికిత్సలో
అంతరంగం అగ్నిపరీక్షకు
సిద్ధమవుతున్నది
సీతమ్మ వారిని తలచుకుంటూ
మనసు దు:ఖ దఘ్నమైనా
తేలిగ్గా పరిష్కారం దొరకాలని శతవిధాల
ప్రయత్నలోపంలేకుండా శ్రమకోరుస్తున్నది.
=================================



Tuesday, September 22, 2015

దరహాస చంద్రికలు
----------------------
నువ్వు నిరంతరం అలా నవ్వుతూనే
నన్ను ముందుకు నడిపించాలి.
నవ్వంటే ఏమిటో మరచిపోతున్న
మానవాళికి నీనవ్వు
 పూలగుత్తిలా పరిమళించి
సువాసనలతో గుబాళించాలి.

అంతర్వీక్షణం చేసే దశలోకూడా
నీ నవ్వే అంతటాప్రతిధ్వనించాలి.
నవ్వుకున్న నుజమైన విలువలను
నీ దరహాసమే ప్రతిపాదించాలి .

ప్రతి మనిషి బ్రతుకులోనూ
నీ నవ్వులే నిఘంట్వార్ధాలుగా
నిలబడిపోవాలి.
అన్ని రుతువులలోనూ
అవేరుజువులుగా మిగిలిపోవాలి.

===========================

కొత్తపాఠం---
--------------రావెల

మళ్ళీ మనోజ్ఞంగా
నాకలానికి పదును పెట్టాలి.
ఈ సాహితీ గృహానికిపట్టినబూజునంతా
ఒక్కుదుటున దులిపేప్రయత్నం చేయాలి.

అర్ధం పర్ధంలేని సినీగీతాలతో
విసుగెత్తిపోయిన హృదయానికి
కొత్తదనం సంతరించుకునేలా సాయపడాలి.

మకిలపట్టిపోయిన మానవతావిలువలలు
కిలుముపోయేలా చింతపండుతో
తళతళలాడేలాతోమేసెయ్యాలి.

మరో నవశకానికి నాందీవచనం
పలికేందుకు యువతను ఎగసి ఉరికే
తరంగాల్లా తయారు చేయాలి.

మసకబారిపోతున్న మన సమాజానికి
మంచి రూపునుకల్పించే
దిశగా నిరంతరం స్వేదంచిందిస్తూ
శ్రమించాలి--గమ్యం
 శీఘ్రగతిలో చేరుకోవాలి.

===========================

Monday, September 21, 2015

మౌనాన్నాశ్రయించిన భాషలో
మనం సంభాషించుకుందాం!
బాధపడడం నా చరిత్రలో
యే అధ్యాయంలోనూ నీకు కనబడదుసుమా!

నీతో గడిపిన మధురాతి మధురమైన
క్షణాలనే మనసులో  ముద్రవేసుకుందాం.
మనం కలిసిపాడుకున్న యుగళగీతాన్నే
పదే పదే పాడుకుంటూ పరవశించి పోదాం.

మనo  వనచరులమై సాగుతున్నప్పుడంతా
ప్రక్కనే పారుతున్న సెలయేటి గల గలలనే
అనునిత్యం గుర్తుచేసుకుంటూ
మురిసి ముక్కలమవుదాం.

చెట్లపై విశ్రాంతి తీసుకున్న పక్షుల
కిలకిలారవాలనే ఖిలం గాకుండా
అంతరాతరాళాల్లో నిక్షిప్తం చేసుకుందాం.

నీపిలుపు ఆశిఖరాగ్రం నుంచి వినబడుతున్నా
అత్యంత సమీపంలో నాకు సన్నిహితంగానే
ధ్వనిస్తున్నదని విశ్వాసం నన్ను
విస్తృతమైన భావాలతో
ఉయ్యాలలూపుతూ ఊరిస్తూ   జీవింపజేస్తున్నది.
-----------------------------------------------------
దారంతా
గులాబీలు
ముళ్ళన్నీ
నాగుండెకా?
-----------
కొద్ది కొద్దిగా
చలి దుప్పటి
 కప్పుతోంది
చెలితో చలి మృగ్యమా?
------------------
నిన్నటిదాకా
హరితపత్రాలు.
నేడేమో స్వర్ణ
 ఖచితాలు
శిశిరానికి
చిరుసత్కారమా?
---------
రంగులు మార్చేది
రాజకీయమా?
మరి నాపెరట్లో
చెట్లన్నీ
వెలిసిపోయాయి
యేపార్టీలోకి
దుమికాయి?-
===================
ఎగసాయం---
--------రావెల పురుషోత్తమరావు.
=================================


ఊరు ఊరంతా
బందెల దొడ్డిగా మారింది
మృత్యు గహ్వరానికీ దీనికే
భలేగా సామ్యం కుదిరింది.

తెల్లబంగారమని పండిస్తే
తెల్లటి వస్త్రమై
మనిషిని కప్పేసింది.

మిర్చి బాగుందనుకుంటే
ఆ దిగుబడి తగ్గిపోయి
ఘాటుగా గుండెకు తగిలింది.

వరిపంట గదాని
 నారునాటి నీరుపోస్తే
పొట్తకొచ్చిన కంకులను
మిడతలునమిలేసాయి.

చెరకు తీపిని తలచుకుని
ఎకరాలను సాగుచేస్తే
అదికాస్తా చేదువిషమై
కుటుంబాన్ని రోడ్డున  పడేసింది.

భీమా వస్తుందని కిస్తీలుకడితే
సొమ్ములుకాస్తా స్వాహా చేయబడింది.

అమ్మయి పెళ్ళి అబ్బాయి చదువు
ఇప్పుడిలా ప్రశ్నార్ధకమై మిగిలింది.

ఆశించిన పురుగును చంపలేని సం హారక మందు
మనుషులను చంపడంలో మొదటిస్థానానికెదిగింది.

పొలం గట్లమీద పిట్టల్లా రాలిపడుతున్న శవాగారం
రాజకీయానికి రాబందులా సహకరించింది.

చేతగాని నేతల వాగ్దానాలకొలిమిలో
రైతాంగం బ్రదుకు మాడి మసై
 బూడిదగా చివరకు మిగిలింది.

వ్యవసాయం ఆధునికంగా వ్యధార్త జీవితపు
యదార్ధ దృశ్యమై
 హృదయమంతటినీ కలచివేసింది.
===================================

Sunday, September 20, 2015

ఎండకాలమందు మండెడు భానుడు
ఆవిరౌను ఆయుషంతగూడ
నెలవు శూన్యమాయె నేలన నింగిన
బ్రదుకుతెరువు ఎంత బాధగొలిపె

గంగ కాలుచున్నదినేలపై కాలుమోప

మానభంగాలహోరుతో మారుమ్రోగ
తీవ్ర వాదాలజోరుతో తిక్కరేగ
నింగినేలయు నేరుగా భంగపడగ
గంగ కాలుచున్నదినేలపై కాలుమోప

Saturday, September 19, 2015

నీవు నీ జ్ఞాపకాల నన్నింటినీ
మరచిపోయి నాదగ్గరనే వదిలి వెళ్ళిపోయావు.
వాటినన్నింటినీ ఒకదగ్గరగా ఏర్చి కూర్చి
భద్రంగా నా హృదయకుహరంలో దాచుకున్నాను.

ఎండకయినా నానకయినా అవి యేమాత్రం
చెక్కుచెదరకుండా కంటికి రెప్పలా వాటిని
కాపాడుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాను.
రాత్రంతా ఏకాంతంగా ఒక్కడినే
సంతోషపు, సంతాపపు పాటలను జమిలిగా వింటూ
మృదు మధురంగా కాలం గడుపుతున్నాను.

నీవు నాతో పలికిన పలుకులన్నింటినీ గుది గుచ్చి
నా ఎదలో అసంపూర్తిగ మిగిలిన ఖాళీ లన్నింటినీ
చాక చక్యంగా పూర్తిచేసాయని నీకెలా తెలియజేయాలో నేనెరుగను.

ఇంతకన్నా  అధికంగా  నేనాశించేదేమీలేదని గ్రహించు.

నల్దిశలా అల్లుకు పోయి అందంగా విస్తరించిన నీ దరహాస
చంద్రికలు నన్ను అనుని త్యం ఉత్తేజపరుస్తూ ఊపిరులూదుతున్నాయి.

నీ జ్ఞాపకాలనన్నింటినీ ఓ మెత్తటి వస్త్రంలో దాచివుంచాను సుమా!!
అవి నీవు నాకనూహ్యంగా అందించిన
అమూల్యమైన వరుమానంగా భావిస్తున్నాను, తెలుసుకో!!

వాటినన్నింటినీ నాగుండెకు అప్పుడప్పుడూ హత్తుకుంటూ
అపరిమితానందాన్ని అనుభవిస్తుంటాను అర్ధం చేసుకో!!

వాటినన్నింటినీ అద్వితీయమైన అపురూపమైన
ఆభరణాలుగనాంతరాంతరాళాల్లొ  హృదయకుహరమనే గట్టి ఖజానాలో భద్రపరుచుకున్నాను.నీవు వాటిని నాదగ్గరనుoడి ఎప్పటికీ సంగ్రహించలేవని ఒక మాట గా హెచ్చరిస్తున్నాను.
-------------------------------------------------------------
వందలకొద్దీ మృతకళేబరాలు
 నదుల ఒడ్దులకు కొట్టుకొస్తూ.

వెలకొద్దీ మానవ దేహాలు
ప్రవాహతతులపై తేలియాడుతూ

చేయని నేరాలకు చేసినట్లు రుజువు కాని
తప్పిదాలకు కారాగారాల్లో మగ్గిపోతూ.
లక్షలకొద్దీ మానవ శరీరాలు

కోట్లకొద్దీ అధోజగత్సహోదరులు
 ఆహార, పానీయాలకోసం
అనునిత్యం  చేస్తున్న  అనంత సంగ్రామాలు.
అన్నీ స్వార్ధపరుల ఈర్ష్యా ద్వేషాల
విజృంభణకు ఎదురీదినందుకు
పడుతున్న శిక్షలకు సోదాహరణాలు.

అన్నింటినీ ప్ర్త్యక్షంగా చూస్తూ
తట్టుకోలేని కలాల మూకుమ్మడి విజృంభణలు.
===========================
ఒక మహా సముద్రం నుండి
ఇంకో మహాసముద్రాన్ని దాటి
పొట్టచేత్తో పట్టుకుని
పిల్లలనూ పెళ్ళలనూ
కుటుంబసమేతంగా బ్రదికే
మార్గాలకోసం నిత్యాన్వేషణగావిస్తూ
మార్గమధ్యంలో ద్రోచింతనగలవారి
ద్వేషాసూయలకు ఎరలుగా మారి బలై
జీవన్మరణ సమస్యలలో మరణానికే ఆహుతై
కాలయమునికి వారి భటులకూ
విందుభోజనంగా మారి రాబందుల
రెక్కల చప్పుడుల మధ్యన
నిస్సబ్దాన్ని వరించి విగతజీవులై పడిన
మానవ కళే బరాలు గుట్టలు గుట్టలుగా
ఒడ్డున కుళ్ళిపోతూ.

పెరుగుతున్న జనసమ్మర్దాలతో కిట కిటలాడుతూ
చేయని అపరాధాలకు మరణ శిక్షలనే అనుభవిస్తూ
ఇనుపతీగలతో నిర్మితమై గాఢ్హంధకారం అలముకున్నా
కారాగారాలలో రక్షక భటుల పర్యవేక్షణలో
యజమానులకు విస్వాస పాత్రమైన శునక సరంభాల
కపాలాలమధ్య దడులవెనుక దయనీయమైన బ్రదుకును వెలారుస్తున్న జీవన్మృతులు.

అనాలోచితంగా రాజ్య విస్తరణకాంక్షతో సమర శంఖాన్నూది
మహానగరాలనన్నింటినీ నేలమట్టం గావించిన కాంక్షా తత్పరులు

మనినీ మాన భంగాలతో విజయదరహాసాన్ని పేదవులపై
పులుముక్న్న మృగాళ్ళూ

ప్రజలతోతలెత్తిన ప్రతి అసంతృప్తినీ తమ స్వార్ధంకోసం
అనుకూలంగా మలచుకుని ఆశోపహతులైన అదృష్టహీనులను జతగా చేర్చుకుని మూగజీవాలుగా వారిని వెంటబెట్టి త్రిప్పుకుంటూ
దండయాత్రలపేరుతో మానవ ప్రాణాలతో చెలగాటమాడుతున్న
అగ్రరాజ్యలకు కుత్రలు అక్షరాభ్యాసం నాటినుంచీ నేర్పుతున్న
జాత్యహంకార జనగణాలు.

వీటన్నిటినీ వినోదప్రధానమైన అంశాలుగా మలచుకున్ని
గోడలంత మేరా విస్తరించిన టీవీ సెట్లముందు కుటుంబసమేతంగా
త్రాగుతూ కోరుకున్న వంటకాలతో ఆహ్లాదపడుతూ నిమిషానికొకరకంగా క్రీడాభిమానుల్లా కేకలతో కేరింతలతో
మృతులై గుట్టలుగా పడివున్న వారిని గూర్చి అసభ్య పదజాలంలో
ప్రేలుతూ, పరిహాసపు పదాలతో కాలహరణంగావిస్తూ.

Friday, September 18, 2015

అగమ్య గోచరం---
---------------

అందరూ అలా ఎలా హాయిగా
నిద్రపోతున్నారో అర్ధం గాలేదు.
అంతా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు.
మరి నాకెందుకు ఈ ప్రభాత
 వేళనుంచీ ఒడలెరుగని ఉలికిపాటు?

నాలో ఇంకో ప్రపంచమమేమన్నా
నిదురలేచిందంటారా?
గడియారం ముల్లుతోపాటు
తెల్లవార్లూ నిద్రలేమితో
రాత్రంతా మేలుకొన్నాను.

ఓ అర్ధమయిందిలే ఆ
 చిదంబర రహస్యం
లబ్ డబ్ అండానికి బదులు
నాగుండే లవ్ లవ్ అని
ధ్వనిస్తున్నది.

ఒహ్! అందుకేనా, ఈప్రపంచం
నాఏకాంతాన్ని దొంగిలించి
చీకటిరాత్రిని నాకు తోడుగా
నిలిపి వెళ్ళింది?
==================

Thursday, September 17, 2015

నింగి శకలం
------------------------
నల్లటి ఈ విత్తులను గట్టిగా చిదిమితే
ఓ గగన శకలం చేతికొచ్చింది.
ఎందుకో ఈ సాయంత్రమంత టా
 దు:ఖ భాజనమై మిగిలింది.

బహుశా, ముదిమితనం వల్లనో
లేదా అమితమైన భావోద్వేగం
నన్ను కౌగిలించుకోవడం వల్లనో.

 పాదరక్షలేమీలేని  నా పాదాలక్రింద
ఈ గడ్డిపరకలు చురుకుగా
ముoదుకు  క్షిపణుల్లా  పొడుచు కొస్తున్నాయ్.
అనూహ్యంగా నా హృదయం
కోయిల కంఠస్వరాన్ని అందిపుచ్చుకుంది.

దానికేవో కొత్తగా ఈకలు పుట్టుకొచ్చినట్లుగా
సంతోష సామ్రాజ్యంలో మునిగి తేలిపోతుంది.

ఆ సాయంత్రం ఎందుకోఇలా
 దు:ఖ దాయిని  ఐపోయింది.
నల్లటి ఈ   విత్తనాలను గట్టి గా చిదిమితే
ఓ నింగి శకలం చేతిలోకొచ్చిపడింది.
----------------------
ఆంగ్లమూలం-- dah Helmer                 తెలుగుసేత: రావెల.
[కవి లిఖిత పూర్వక  అనుమతితో]

Wednesday, September 16, 2015

అవును నీకుతెలుసు! నాకు మనస్ఫూర్తిగా
నచ్చిన వాటినే నేను నీ దగ్గరనుండి
ఆనందగా అందుకుంటానని.
అంత కన్నా ఎక్కువగా దేన్నీ నే ను ఆశించను.
నాకదే కావాలనిగానీ మొండిగా వాదించను.

అదే నీసంగతిపూర్తిగా విభిన్నంగా వుంటుంది.
నాదగ్గరున్న వన్నింటినీ నీకే కావాలని
అభ్యర్ధిస్తూ వుంటావు.



నువ్వు అడవి పూవునిచ్చినా సరే
కిమ్మన్నకుండా స్వీకరిస్తాను.
వాటికి ముళ్ళున్నాయని తెలిసినాసరే
నేను నిరభ్యంతరంగా స్వీకరించి
హృదయానికి హత్తుకుంటాను.
ఆ కంటకపు బాధనుకూడా భరిస్తాను.

నీకు గుర్తుందా ఒకసారి నీ నేత్రాలను విప్పారుస్తూ
నావైపు లాలనగా చూస్తూ అనుభూతిప్రధానంగా పలుకుతూ

నీ జీవితాన్ని మృదుమధురంగా తీర్చి దిద్దుతానని
మాటిచ్చావుగదా! గుర్తుందికదా!!

అదే  నీవు క్రూరంగా నావైపు నీ దృష్టిని సారిస్తే
అది గునపంలా నగుండెకు గాయంచేస్తుందని తెలుసు.
అయినా ఆ సంఘటను అతి సామాన్యమైనదిగా భావిస్తాను.


ఔను నాకు తెలుసు నీవు అతి సాధారణమైన వ్యక్తివనీ
ఆధునికతా వ్యామోహంలో వెర్రితలలు వేయవనీ నేనెరుగుదును.
కననడినవన్నీ నాకేకావాలని మొండికేసి మొరాయించవనీ నేనెరుదును..

[టాగూర్ తోటమాలిలోని ఓ కవిత కు   స్వేచ్ఛానువాదం]
గణుతికెక్కినావు గణపయ్యగానిచట
విఘ్నములను బాపు వేల్పు కతన
మనిషి మంచితనము మనసున వెన్నయే
శివుని సుతుడనీకు శుభము నిచ్చు 
నాలో నేను తొంగి చూసినప్పుడల్లా
నీ నగుమోమె నా మనస్సుపై
 ముద్రితమై దర్శనమిస్తుంది.

నా గుండెను నేనే తడిమిచూసుకుంటే
ఎక్క్కడనుంచో తడి తడిగా
 తేమ ఊరుతున్నట్లనిపిస్తుంది.

మనింటిపెరట్లో పూచే ప్రతిపువ్వులోనూ
నీఅనురాగమే సుతిమెత్తగా సాక్షాత్కరిస్తూ
నన్ను అప్రతిభుడిని గావిస్తుంది.

ప్రతిక్షణం నా ఊపిరితిత్తుల్లో
నీ శ్వాసతోనే ఊసులాడుతున్నట్లనిపిస్తుంది.

అనుభూతిప్రధానమైన కవితను వ్రాసినప్ప్పుడల్లా
అక్షరాలన్నింటినీ నీవే దగ్గరుంది యేర్చి కూర్చినట్లుగా
అనుభూతి నన్ను అశ్రునయనాలతో
వీక్షిస్తున్నట్లుగా
 దృష్టిగోచరమౌతుంది
ఎక్కడినుంచో యేదో గుబాళింపు నన్ను కట్టిపడేసి
బందీగా నీసాన్నిహిత్యానికి చేరువగా బడిపిస్తున్న భావన
నన్ను ధరణిపై ఇప్పుడు బ్రతికిస్తున్నట్లనిపిస్తుంది.
============================================

Tuesday, September 15, 2015

ఎందుకౌ నావాళ్ళు నాకు ఇంత జనసమ్మర్దమున్న ప్రదేశంలో
ఇల్లు కట్టించి ఇచ్చారో ఇప్పటికీ అర్ధమవడంలేదు.

ఇక్కడందరూ తమతమ పడవలను ఒడ్దుకుచేర్చి
లంగరువేసి ఒడ్డున నిలబడుతుంటారు.
వాళ్ళు హడావుడిగా అటూ ఇటు తిరుగుతూ
రోజంతా సందడిచేస్తూ వుంటారు.

నేను కిటికీ దగ్గర కూర్చుని వాళ్ళ కదలికలన్నింటినీ
తీరిగ్గా గమనిస్తూ కాలక్షేపం చేస్తూవుంటాను.
ఇటువైపు రావద్దనీ దూరంగా వెళ్ళిపోండని ఎలా చెప్పగలను?
వాళ్ళలా దూరంగా వెళ్ళిపోతే ప్రతిరోజూ నాకు కాలక్షేపం ఎలా అవుతుంది?

రాత్రనకా పగలనకా వారి పాదాలస  డులు నాముఖద్వారంచెంతగా
 వినిపిస్తూ అలరిస్తూ వుంటాయి.
నిస్ఫలమని తెలిసీ నేను బిగ్గరగా అరచి గోలచేస్తూ వుంటాను.

కొందరు నా వ్రేళ్ళకు పరిచితమైన వాళ్ళు
మరికొందరు నానాసికాపుటాలచెంత వాసనలతో గుబాళించినవారు.
మరికొందరు నానరాలకు అతిదగ్గరగా మసలినట్లనుభూతి.
ఇంకొందరేమో  నాకలలకు అతి సమీపంగా సంచరిస్తున్నట్లనిపిస్తారు.
ఇంత మంచివారిని నాదగ్గరకు రాకుండా దూరంగా జరిగిపొండని ఎలా చెప్పగలను?

అప్పుడప్పుడూ వాళ్ళతోనేనంటూ వుంటాను మీరవసరమని తోచినప్పుడల్లా
నా గృహప్రాగణంలోకి అడుగువేసి కొంతసేపు సేదతీర్చుకుని వెళ్ళొచ్చని చెపుతుంటాను.

ప్రభాతసమయాన గుడిలో గంట మ్రోగుతూ మేలుకొలుపు పాటలు వినిపిస్తూ వుంటాయి.
ఆడవాళ్ళంతా పూలసజ్జెలతో గుడి ద్వారం ముందు బారులుతీర్చినిలుచుంటారు
వాళ్ళపాదాలన్నీ గులాబీ రంగుతో కాంతివంతంగా మెరిసిపోతుంటాయి.
వాళ్ళనెలా నిర్దాక్షిణ్యంగా నాకుదూరంగా జరిగి వెళ్ళిపొండని చెప్పగలను?

ఎప్పుడయినాసరేమీరు నాతోటకు వచ్చి రకరకాలపూలను పూసెజ్జలో నింపుకోమని చెప్పాను.

వాళ్ళంతా పనులన్నీ మానుకుని నా గుమ్మం ఎదుట వినమ్రంగా నిలుచుంటారో నాకవగతం కాదు.
కొందరు నా వ్రేళ్ళకు పరిచితమైన వాళ్ళు
మరికొందరు నానాసికాపుటాలచెంత వాసనలతో గుబాళించినవారు.
మరికొందరు నానరాలకు అతిదగ్గరగా మసలినట్లనుభూతి.
ఇంకొందరేమో  నాకలలకు అతి సమీపంగా సంచరిస్తున్నట్లనిపిస్తారు.
ఇంత మంచివారిని నాదగ్గరకు రాకుండా దూరంగా జరిగిపొండని ఎలా చెప్పగలను?

అప్పుడప్పుడూ వాళ్ళతో నేనంటూ వుంటాను మీరవసరమని తోచినప్పుడల్లా
నా గృహప్రాగణంలోకి అడుగువేసి కొంతసేపు సేదతీర్చుకుని వెళ్ళొచ్చని చెపుతుంటాను.

ప్రభాతసమయాన గుడిలో గంట మ్రోగుతూ మేలుకొలుపు పాటలు వినిపిస్తూ వుంటాయి.
ఆడవాళ్ళంతా పూలసజ్జెలతో గుడి ద్వారం ముందు బారులుతీర్చినిలుచుంటారు
వాళ్ళపాదాలన్నీ గులాబీ రంగుతో కాంతివంతంగా మెరిసిపోతుంటాయి.
వాళ్ళనెలా నిర్దాక్షిణ్యంగా నాకుదూరంగా జరిగి వెళ్ళిపొండని చెప్పగలను?

ఎప్పుడయినాసరే! మీరు నాతోటకు వచ్చి రకరకాలపూలను పూసెజ్జలో నింపుకోమని చెప్పాను.

వాళ్ళంతా పనులన్నీ మానుకుని నా గుమ్మం ఎదుట వినమ్రంగా నిలుచుంటారో నాకవగతం కాదు.
భక్తి భావన పెంపొంద భాగవతము
ధర్మ మార్గము చూపగా రామయణము
కృష్ణస్వామిని తలపోయ గీత సరము
తెలుగువాడికి వెలుగులే నిలుచు నిజము.


అంతిమ గీతాన్ని ఆలపించి
ఇక మనం నిష్క్రమిద్దాం
ఈ రాత్రిని పూర్తిగా మరచిపో!
కరగిపోతున్న రాత్రిని
 గుర్తుంచుకుని మాత్రం యేంలాభం?

ఇప్పుడింకెవ్వరిని
ఆబగా గుండెకు హత్తుకోగలను?
 ఆతృతగా నాచేతులు
శూన్యాన్ని గట్టిగా హత్తుకున్నాయ్ !!
గుండెకయిన గాయమే ఇక
శాశ్వతంగా మిగిలిపోతుంది---
[టాగూర్ తోటమాలిలోని కవితకు నా అనువాదం].
================================
వెన్నముద్దలు
===========

లాలిపాటలను
కంఠ స్తం చేసుకుంటూ
రేపటి మాతృమూర్తి.
------------
ఎవరినుం చోతెలియని
ఫోన్ కాల్
క్లేశందిశగా మనస్సు.

--------------------
గుర్తుపట్టలేని
స్వరం
మాజీ ప్రేయసిది కాదుగదా!!
------------------
చింతల  తోపులో
ఉదయం నడక
కోయిలల  చిరునామాఎక్కడ?
----------------
సూరీడుకు
వీడ్కోలు పలుకుతూ
వెన్నెలగూట్లో చందమామ

---------------
ఆబాల గోపాలం-----
------------------
బాల్యం బాధామయమై వగరుస్తున్నది
ఆటస్థలాలప్రసక్తిలేని
ఆకాశహర్మ్యాలలో
అలమటిస్తున్నది.

యవ్వనం కాటేసే త్రాచులా బుసలుకొడుతున్నది.
ప్రేమా ద్వేషాలమధ్య ఎంపికసరిగ్గా కుదరనందుకు
విషాదహృదయంతో విలపిస్తున్నది.

నడివయసు జమాఖర్చులను సరిగ్గా తూ చగల
తూనిక రాళ్ళుదొరకడంలేదని వెదుకులాటలో
నగుబాట్లపాలవుతానేమోనని వగరుస్తున్నది.

ముదిమితనం మీసం మెలేస్తున్నది.ముందున్నదoతా
 ముసలోళ్ళ పం డు  గలేనని
మీసం మెలుస్తూ కాలచక్రాన్ని వెనక్కుమరల్చడం
ఎవరివల్లా కాదని పదే పదే హెచ్చరిస్తూ మౌనాశ్రయంలో తొంగుంటున్నది.
================================================

Monday, September 14, 2015

ఎందుకునన్నలా చూపుమరల్చకుండా
 ఏకధాటిగా చూస్తూ
సిగ్గుతోమొగ్గనయేలా చేస్తావ్?

ఏదో కాలక్షేపంకోసమే నేనిలా
నీగృహప్రాంగణం బయట తోటకావలగా చెట్టునీడననిలుచుని
నిలుచునుని వున్నాను అంతేసుమా! నన్నపార్ధంచేసుకోకు!


నేను నేతోటలోంచి ఓ చిన్ని గులాబీనికూడా
త్రుంచితీసుకున్న  పాపానపోలేదు.
కనీసం ఓ పండునయినా కోసిన దాఖలాకూడా కనరాదు.
నేనందరు పాదచారుల్లాగానే
ప్రహరీగోడనానుకుని సేదతీరుతున్నానంతే

ఒక్క చిట్టి గులాబీనుగూడా త్రుంచలేదుగదా!!


నిలబడి నిలబడీ నాపాదాలు నొప్పెడుతున్నాయ్
ఇంతలో అనుకోని అతిధిలా చినుకులూ వచ్చిపడుతున్నాయ్!
ప్రక్కనున్న వెదురుపొదల్లోంచి గాలి గబగబా
శబ్దంచేస్తూ హడావుడిగా వచ్చి వెళ్ళిపోతుంది.

ఆకాశంలో మెఘాలుకూడా అటూ ఇటూ పచార్లుచేస్తూ
ఓ సమరం యొక్క దృశ్యాన్ని గుర్తుచేస్తూ సంభ్రమం కలిగిస్తున్నాయ్.

నాపాదాలు అలసి సొలసి నెప్పెడుతున్నాయ్!
నేనెందుకు ఇలా ఆరుబయటనేను నుంచున్నానోతెలీక
నన్ను పూర్తిగా అపార్ధం చేసుకున్నట్లున్నావ్!!

నువ్వెవరికోసమో ఆశగా ఎదురుచూస్తున్నావని మాత్రం గ్రహించగలిగాను

నీకళ్ళల్లో కనుపిస్తున్న మెరుపులేదానికి రుజువులుగా
నాకు కనబడుతున్నాయ్!

నేనిలా చీకటిలోనిలుచుంటే అపార్ధం పాలవుతానని ఊహించలేకపోయానుసుమా!!

నీవు నన్ను గురించి యేం ఊహించుకున్నావోనాకెరుకలేదు.


నీతోటకవతలగా ప్రహరీగోడనానుకుని నిలుచుని
సేదతీరుతున్నాను అంతే మరొకలా భావించకు!!

నాకిప్పటిదాకా ఆశ్రయమిచ్చిన తరుచ్చాయనక్కడే
వదిలేసి వెళుతున్నాను ! నేను తీరిగ్గా కూర్చున్నచోటునుగూడా ఆపచ్చికబయలుకే వదిలేసి
తిరిగి ఇంటికి వెళుతున్నాను తెలుసుకో!

చీకటి చిక్కబడుతున్నది,త్వరత్వరగా తలుపేసుకో
నేను వచ్చిన దారినే నాఇంటికి వెళ్ళిపోతాను.
ఈరోజు ఇంకా పూర్తయిపోయినట్లే వుంది,గ్రహించు!!

[టాగూరు తోటమాలిలోని 53 వకవితకు నానువాదం]



నీకు కష్టంగా అనిపిస్తే చెప్పు
నాపాటను నిరభ్యంతరంగా ముగిస్తాను.
నీ గుండెలోని కదలికలు మారుతున్నట్లనిపిస్తే
నీ ముఖం మీదనుండి నా చూపులను మరలుస్తాను.

నీవు నడకలో తడబడుతున్నట్లు భావిస్తే
నేను నీ మార్గాన్నుంచి ప్రక్కకు తప్పుకుని
నీకు రహదారిని యేర్పరుస్తూ
 మరోత్రోవ చూసుకుంటాను.

నీవు మాలలను అల్లేక్రమంలో
ఏమయినా గందరగోళమనిపిస్తే చెప్పు
నీ పూదోటలోంచి వైదొలగి వెళ్ళిపోతాను.

నిశ్చలంగాపారే జలాలను నేను
కుదుపుతున్నట్లనిపిస్తే
నేను నా నౌకాయానాన్ని విరమించి
తీరానికే పరిమితమై వుండిపోతాను.

[టాగూరు  తోటమాలిలోని 47 వకవితకు నా అనువాదం]
==========================================
గీతార్ధసారం--
---------------------

అతను కుంచెను చేతబట్టినప్పుడల్లా!
ప్రపంచమంతా ముగ్ధ మనోహనరూపం దాల్చి
అతనిముందు వినమ్రంగా మ్రోకరిల్లడంగమనించాను.
ఫల పుస్పాదులతో విస్తరించిన వనసమూహం
అతని కుంచెకు కొత్త సొబగులు దిద్దినట్లనిపిస్తుంది.

అసుర సంధ్యవేళన ఆకాశం అతని ముఖద్వారం వద్ద నిలిచి
నన్ను అన్నింటికన్నా అందంగా రూపుదిద్దుకునేలా చేయమని
శతవిధాలా ప్ర్రాధేయ పడుతుండడమూ, నాకేమీ కొత్తగాదు.

తనూలతలు చంచలించిపోగా
తరుణీలాలామలు అతడి అందమైన
బృందావనంలో గోపికలై భాషించారు.

వాయువు వీచినప్పుడలా ఆకుల కదలికలు
తమ అంతరంగాన్నిఆవిష్కరించమంటూ
అభ్యర్ధించిన సన్నివేశాలు   నాకు తెలుసు.

అతని ఒడిలో ఒదిగి ఎoద రో   కధకులు తమ కధల
నుదుటన    కొత్తగీతలు రాసిన బ్రహ్మ
ఆతడని వినయ విధేయతలను ప్రకటించారు.

అతను గీతా రహస్యమెరిగిన మహర్షి
మౌనానికి భాష్యం చెప్పిన మౌని.
---------------------------------------------------

============================================
నీతో ప్రాధమికంగా పరిచయమేర్పడ్డాక
అహాన్నీ అసూయనూ పోగొట్టుకుని ఆనందించాను.
హృదయ భారం పలచబడిందని పొంగిపోయాను.

నీతోకలిసి అగ్ని సాక్షిగా అడుగులువేసాక
 లక్ష్యాలను  చేరుకోవాలన్న  పట్టుద లను పెంచుకున్నాను.
క్రమేపీ అందరి బంధువుల గుండెల్లో తలలో నాలుకలా
మారావని వింటున్నంతకాలం సగర్వంగా పొంగి ప్రవహించాను.

మన సంగమంలో కలిగిన తొలి ప్రసూనం వాడి నేల రాలినప్పుడు
బ్రదుకు భారమయిపోతున్నదెందుకో తెలియక కృంగి కృశించి పోయాను.

ఆరరువాతి పూలమొక్కలు అందరి అభిమానానికి నోచుకునేలా
నీ సమయాన్ని హెచ్చించి పాదుచేసి పెంచి పోషించి ఇవే నా కృషికి
తార్కాణమని సోదాహరణంగా భూమిపై నిలబెట్టినప్పుడు
జనకుడిగా గర్వపడుతూ నీప్రేఆనురాగాల ధృతికి వరదగా
రూపాన్ని మ్ర్చుకుని గుండె గొంతులో అనుభూతుకలిగించే ఆనందానికి
శిరస్సు వంచి వినమ్రమై విధేయతను పెంచుకున్నాను.

మాయదారి కాలం నిన్ను నాకు దూరంగా విసిరేసి బలవంతగా
పృధీతలంపైనుండి పరాకును కలిగించి తోద్కొని
తీసుకెళుతుందని తెలిసాక శిశిర తరువులా
శీర్ణమై దు ఖదాయిని కాబోతున్న జీవితానికి
ముందుమాట రాయాలని తహతహ లాడాను.
ఇప్పుడు ఈ జీవన కావ్యం ముగింపుకు చేరువవుతుందని తెలిసినా
కర్తవ్యతా మూఢతతో మూగవోయిన మురళినై బ్రదుకునీడుస్తున్నాను.
ప్రతి ప్రకృతి రామణీయకతలోనూ నిన్నే తలుచుకుంటూ
నాలుగు గోడలమధ్యనా నవ్వలేక నడుస్తున్నాను,
నిశ్శబ్దాన్ని నేస్తంగా చేసుకుని కాలాన్ని ణారంగా దొర్లిస్తూ
తృప్తికోసంవెదుకులాటలో జీవనమధురిమలను
చేదువిషం చేసుకుంటున్నాను.
--------------------------------------------------------------------------------------------

Sunday, September 13, 2015

ప్రభాతసమయాన
కాలినడకన బయలుదేరితే
దారిప్రక్కన రాలిపడిన
పారిజాతాలు పలకరించాయి.
 అచ్చు అవన్నీమాఇంటావిడనవ్వులానే
స్వచ్చంగా వినిపించాయి.

దూరంగా ఓ చెట్టుమీదనుంచి కోయిలమ్మ
కుహూకుహూరవాలు సంగీత కచేరీని
తలపిస్తూ నన్ను తన్మయత్వంలో ముంచెత్తాయ్.

రహదారిమీద రయ్యిమంటూ నేలమీద పరుగెట్టే
 విమానాల వేగాన్ని మరిపించే
 కుర్రకారు వాహనాల రణగొణధ్వనులు
మాటమాత్రమైనా వినిపించకుండా గుండెకు
ఆందోళను తగ్గించి ఆనందాన్ని కలిగించాయ్.

దినపత్రికలను సైకిల్కు కట్టుకుని
సవ్యసాచుల్లా విసిరే యువకుల హడావుడి మొదలైంది.

దారిప్రక్కన ఫలహారాలు తయారుచెసే తోపుడుబండ్ల
నెట్టుకుంటూ తరలివస్తున్న
 ఇంటిల్లిపాదీ జనం కసరత్తూ మొదలయింది.
గుడిదగ్గర ఇవ్వాళ పెద్దతిరునాల జరుగుతున్నది.
ఉదయాన్నించీ కురిసిన దబాటు వాన
ఆ ప్రదేశాన్నంతా బురదమయం చేసేసింది.

చిన్న చిన్నగా చీకటి ముసురుకుంటున్నది.

అందరి ముఖాలమీద పరుచుకున్న సుఖం ,సంతోషం
క్రమేపీ విస్తరిస్తూ పోతుంటే ఆ చిన్నపిల్ల ముఖంలో
ఆనందం ఒక్కుదుటున వెల్లువై ప్రవహిస్తున్నది.
చేతిలో తాటాకు బూర అoదించిన కానుక ఇది.


తొడతొక్కిడిగా జనం సంఖ్య పెరిగిపోయి
అందరూ ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.
భుజం భుజం రాసుకుంటూ ఇసుకవేస్తే రాలనంతగా
దట్టంగా ముందుకు సాగిపోతున్నారు.

దారంతా బురదతో తొక్కిడి తొక్కిడిగా తయారయింది.
దగ్గరగా ప్రవహించే నది వేగంగా వచ్చిన వరదతో
వెల్లువెత్తి ఉరకలేస్తూ ఉద్ధృతిని పెంచుకుంటూ పోతున్నది.
ప్రక్కనున్న పొలాలుగూడా నిండా నీటితో మునిగి జలమయమయాయి.

ఇన్ని కష్టాలకన్నా మిన్నగా ఆ బుల్లి కుర్రాడి ముఖంపైన
 దు:ఖం విస్తృతంగా పరుచుకుని భరించనలవిగాకుండా పోతున్నది.

అందంగా అలంకరించబడిన పిల్లంగ్రోవి ఆదుకాణంలో
తనకందుబాటులోలేని ధర చీటీతో వ్రేలాడుతూ వేధిస్తున్నది.


ఆశగా అతను తన కళ్ళను ఆ దుకాణానికే అంటించి అటూ ఇటూ తిరుగుతున్నాడు.

ఈ జనసమ్మర్దమంతటినీ ఆ దృశ్యమొక్కటే బాధామయంగావించి గాయపరుస్తున్నది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
[టాగూర్ తోటమాలి 76 వ కవితకు నా అనువాదం ]

Saturday, September 12, 2015

నేను ఓ బాంగారు లేడిని
 వెంటాడుతూ వేటాడుతున్నాను.

మిత్రులారా మీకిది
వేళాకోళంగా తట్టవచ్చు.
ఇది నేను నవ్వుతాలుగా
అంటున్న మాటకాదుసుమా!!
నన్ను దూరంగా నెట్టేసిపారిపోయే
ఆ దృశ్యమైనే నా దీక్షా,  దృష్టిని
 కేంద్రీకరించాను.

కొండాకోనలన్నింటి వెంట నేను
పరుగులిడుతున్నాను.
నామరహితమైన ప్రదేశాలనుకూడా
చుట్టబెడుతున్నాను. చెప్పానుకదా
నావేట బంగారులేడికోసమేనని.


మీరు మీకు కావాల్సిన సరుకులనుకొని
ఇంటికిమీరు తీరిగ్గా వెళ్ళిపోతారు.



స్వంత ఇల్లంటూలేని గాలులు బలంగావీచి
తనితీరా నన్ను తడిమేసి సాగిముందుకు పోతున్నాయ్.


ఎక్కడా? ఏమిటి? అనే మీ ప్రశ్నలకు
నాదగ్గర ఎలాంటి సమాధానంలేదుసుమా!

నాహృదయం మీద నేనింకా తీసుకోదగిన
జాగ్రత్తలేమీమిగిలిలేవని తెలుసుకో చాలు.
నాకు సంబంధించిన సామాన్లన్నింటినీ
దూరంగా గిరాటేసి వచ్చాను.

ఇప్పుడు నేను
 కొండాకోనలనంటిపెట్టుకుని
 తిరుగుతున్నాను.
నామరహితమైన ప్రదేశాలన్నింటినీ
చుట్టబేట్టిమరీ తిరిగి వస్తున్నాను.
చెప్పానుగదా బంగారులేడికోసమే
 నాచెమటోద్చే శ్రమంతా!!
************************************
[టాగూరు తోటమాలిలోని 69 వకవితగు నా తెలుగు సేత.]

Friday, September 11, 2015

హృదయమా!ఇక శాంతించు!!
  మనవీడ్కోలుకూడా మధుర స్మృతిగా మిగలనీ!
అదిమృత్యువులా మారిపోకుండా,
సంపూర్ణమైనట్లుగా సాక్షాత్కరించనీ!!
ప్రణయమ క్రమేపీ ప్రవహించి ఓజ్ఞాపకంగా మిగిలిపో!!
మనసునంటిపెట్టుకున్న బాధలన్నీ
పాటలుగా ప్రవహించనీ!!

ఆకాసం మీద విహారమంతా సమాప్తమైపోనీ!!
రెక్కలు ముడివడి  గూళ్ళదగ్గరకు చేరుకోనీ!
నీఆఖరు స్పర్శంతా నిశీధిపుస్ఫంలా మెత్తగా  తగలనీ!!
చిట్టచివరి సమయమంతా సౌందర్యహేతువుగా మిగలనీ!!

నీవు చెప్పదలుచుకున్న మాటలన్నీ నాచెవులచెంతకు నిశ్శబ్దంగా చేరుకోనీ!!
నేను శిరస్సు వంచి వినమ్రంగా మ్రోకరిల్లుతున్నా!
నీకు మార్గ దర్శనం కావాలన్న తపనతో
కరదీపికను చేతబట్టి ఆశగా నిలుచుని ఎదురుచూస్తున్నా!!
[టాగూర్ తోటమాలిలోని కవితకు స్వేచ్చానువాదం]

అరసికాయ నమో నమో
-------------------------రావెల
************************************

వంట చేసినప్పుడల్లా వంకలు పెడుతూ
విసుగును ప్రకటిస్తావ్.

ఆరుబయటవెన్నెల్లో ఎండాకాలం
కూర్చుని సరదాగా మాట్లాడుకుందామంటే
పడిసెం పడుతుందేమో వద్దంటుంటావ్!

రాత్రయేసరికి నూలుచీరెకట్టుకుని
కొప్పులో మల్లెలు తురుముకుని వస్తే
తుమ్ములోస్తాయేమో  పూలను పెరికేయమంటావ్.

రాత్రంతా ఒక్కటవుదాము రమ్మంటే
 చెమటలు పడతాయేమోనని
సిగ్గులను మొగ్గ లుగా బలకబోస్తావ్

ఇంకా ఈ బ్రదుకుకర్ధమేమిటని ప్రశ్నిస్తే
సన్యాసిస్వామిఫొ టోచూపి సాష్టాంగపడమంటావ్!!

రసికరాజా !!నీకు తగినదానిని కదా? అంటే
అరసికుడిని నన్ను వొదలమంటూ ప్రాధేయపడతావ్!
==================================10-9-15
చిన్ని కృష్ణుడు కనుపించె చేయినందు.
ముద్దుమురిపాలు   వికసించెమోమునందు.
ఎంత మోహనరూపమో, వింతగాదు
బుజ్జి కన్నయ్య మాయింట భూరి  వెలుగు.
===================================
నేనొక కస్తూరిమృగంలా
తనసౌరభానికితానే
మత్తిలిపోయేలా వనచరుడినై
అడవిదారులవెంట ఆనందగా
పరుగిడతాను.
అది గ్రీష్మ రుతువు.
నడినెత్తిన సూరీడు
నాట్యంచేసే సమయం.
అప్పుడే దక్షిణ దిశనుంచి
మలయమారుతాలు వీచే
 శుభ ఘడియలుకూడా.

నేనప్పుడు దారితప్పి
వెదుకులాటలోపడ్డాను.
నాకవసరంలేనిదంతా
ఎదుటన ప్రత్యక్షమౌతుంది.
నాక్కావాల్సినదంతా
ఎండమావిలా దూరం
 దూరంగా జరుగుతూ
కనుమరుగైపోతుంది.

నా హృదయం ఒక్కుదుటన బయటకు గెంతి
నాట్యమాడడం మొదలెట్టింది.


ప్రకాశవంతంగా కనుపించే
 నాదృష్టికోణం క్రమేపీ కనుమరుగవుతున్నది.
దాన్ని చేజారకుండా గట్టిగా పట్టుకోవాలని
విశ్వప్రయత్నం చేస్తూనేవున్నాను.
అది తెలివిగా నానుండి తప్పించుకునిపోయి
నన్ను సందేహాస్పదుడుని గావించింది.
నేను కొరేదేదీ నాకు లభ్యంకాదు.
నాకు దొరికినవన్నీ నాకుపయోగపడనివే.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
[టాగూర్ తోటమాలిలోని కవితకు స్వేచ్చానువాదం.]

Thursday, September 10, 2015

అది ఎంత రహస్యమైనాసరే
నీహృదంతరాళాల్లోనే దాచుకోకు.
నాతో దాన్ని సవివరంగా పంచుకో
నేను దాన్ని గూఢంగా దాచిపెడతాను.
నీ మందస్మితదరహాసాలను
మృదువైన సంభాషణా  చతురిమలను
నాగుండెకేవలం  ఒక శ్రోతగా
 మాత్రమే ఆలకిస్తుంది.
శ్రవణెంద్రియాలతోకాదుసుమా!!

రాత్రి బాగా చిక్కబడడం మొదలయింది.
ఇల్లంతటినీ నిశ్శబ్దం ఆవరించింది.
పక్షులగూళ్ళన్నీ నిద్రానిమీలిత
 నేత్రాలతో జోగుతున్నాయి.

నాతో మనసారా సంభాషించు.
అనూహ్యంగా జలువారుతున్న
అశ్రు నాయనయనాలను చూడు.
తడబడుతున్న నీ చిరు దరహాస చంద్రికలతో
బాధలబరువుతో అవనతమైన సిగ్గు వంకర్లతో
నీ హృదయగతమై ఇప్పటిదాకా నీలో నిబిడీకృతమైన
రహస్యాన్ని పెదవి విప్పి పలుకుతూ ఆవిష్కరించు.
-----------------------------------------------------------------
[టాగూర్ తోటమాలిలోని కవితకు స్వేచ్చానువాదం] 
తనగురువులెవ్వరనగా
తన శిష్యరికపు గొప్ప చాటించె నెడన్
ఘనుడా కవి యందరిలో
పనితనమున కావ్య పరిమళమందున్!!
=================================
అక్షర యజ్ఞం--
------------------
మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద 
మన పేరుంటుందంటారు.
ఆరుగాలాలపాటూ
చెంటోడుస్తూ శ్రమించే రైతన్నపేరు
యేగింజమీదా రాసుండలేదా?
అతనలా అర్ధాంతరంగా
బ్రదుకుపుస్తకాన్ని మూసేసి
 మాయమవుతున్నాడు!!!
అతన్ని సృష్టించిన /పుట్టించిన  బ్రహ్మకేమయినా
 మతిమరుపొచ్చిందా ఏమిటి ఖర్మ ఖర్మ!!

Wednesday, September 9, 2015



ఉక్కిరిబిక్కిరి-----
--------------------
నగరంలో జడివాన
రహదారులన్నీ జలమయం
లోతట్టుప్రంతాలలో ఇళ్ళన్నీ
 వాననీటిలో మునిగి మునకలేస్తున్నాయి.

పల్లెటూళ్ళన్నీ పరాకుగా చూస్తున్నాయి
మానేలను రాలితే నాలుగు చినుకులు
నలభై బస్తాల ధాన్యాన్ని అదనంగా
పండిస్తాంగదా అని బుంగమూతి పెట్టుకుని
వరుణదేవుడిని అదేపనిగా ప్రశ్నలతో
ఉక్కిరిబిక్కిరిచేసి ఊపిరాడకుండా వేధిస్తున్నాయ్!
===================================
విరామసమయంలో కాళ్ళు బారజాపి
తీరిగ్గా నువ్వు పోగుట్టుకున్న
నీ అంతరంగంకోసం వెదుకుతున్నావా?

భూనభోంతరాళాల్ల్లో దుర్భిణిపెట్టిచూసినా
దానిజాడకనబడడంలేదా!ఒక్క క్షణం ఆగు.
నాకు ఓ సందేశాన్ని ఆ మబ్బు తెరలతోనో
దట్టంగా కమ్ముకున్న మేఘాల ద్వారానో,
మరో వాహికద్వారానో సదేశం పంపు!!

నా మనోఫలకంపై ముద్రితమైన
నీ జ్ఞాపకాలను తిరుగు టపాలో నీకు
మొయిలు ద్వారా మెయిలు చేస్తాను.

నిన్నటిదాకా నాదగ్గరేగదా దాన్ని మరిచి
నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయావు.

నీ స్మృతుల జడిలోంచి ఇంకా నేను మేల్కొని
గతకాలపు అనుభూతులనూ, అనుభవాలనూ
ఇంకా చెరపలేదుగనుకనే అదికూడా సాధ్యమవుతున్నది.
మనసుతోటిమనసెపుడూ మాటాడుకుంటుంది
మధురమైన జ్ఞాపకాలను తన హృదిలో భద్రపరుచుకుంటున్నది.
===========================================

వికల్పం--
=========
నేనెవ్వరినీ ఇంతవరకూ
ఉత్సాహపరచిన సందర్భం లేదు.
ఈనాటివరకూ ఎవ్వరికీ నే ను
ఆదర్శవతుడనై నిలిచిన
 దాఖాలాకూడాకనరాదు.

ఎవ్వరు విజయయం సాధించినా
ముందువరుసలోవుండి వారినభినందించిన
సూటియైన వ్యక్తిత్వం నాది.
నాకరతాలధ్వనులతో వారిని
మన: పూర్వకంగా అబినందించిన
మనో నిబ్బరం నాది.

ఇప్పుడిలా కనులను మూసుకుని
భక్తి శ్రద్ధలతో నీ యెదుట
 వినమ్రంగా నిలుచున్నాను.

చదరంగం క్రీడలో బంటుకు కూడా
ఓ విశిష్టమైన స్థానమే వుంటుంది.
నేనా బంటుకన్నా భిన్నమైన
వాడినేమీకాదు.
అలా ఎప్పుడూ ఊహించన
క్షణమూ కనరాదు.

విభిన్నమూ, విలక్షణమూ ఐన
వ్యక్తిత్వంగల మనస్తత్వం నాది.
మరోలా భావించకండి.
నామానాన నా బ్రదుకును
 వెళ్ళదీసుకోనివ్వండి చాలు.
==========================

Tuesday, September 8, 2015

రంగులు మార్చుకోగలిన రాజకీయం
జగజ్జేగీయమానం గా వెలిగిపోతూ
సిగ్గూ శరానికి విలువేమిటని?
బహిరంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది.

ఎన్నికలలకు ముందు ఇచ్చిన
 వాగ్దానాల ప్రమాణ పత్రాలను
మలమూత్రాలను తుడుచుకుని శుభ్ర పరిచే
కాగితాలకన్నా హీనమేనని
అక్షరాలా ఋజువు పరిచే దిశలో
శ్రమకోరుస్తూ స్వేదం వెలారుస్తున్న
అధికారసిమ్హాసనంపై మధిష్టితమై
తమ జబ్బలు తామే చరుచుకుంటూ
 ఆరంభ శూరత్వాన్నే  ఆత్మ వంచనగా యెంచుకుని
ముందుకు సాగుతున్నామని మురిసి ముక్కలవుతున్న
మోసానికీ దగాకూ సోదాహరణంగా నిలిచే
రాజకీయ భేతాలుడి వారసత్వపు సంతతి.

ఎక్కడ అసంతృప్తి తలెత్తినా అక్కడకు క్షణాల్లో
చేరుకుని మతగ్రంధం సాక్షిగా మనసు పొరలను
ఓదార్పు యాత్రలతో ఊరిస్తున్న జగనేక శూరుడు
ఆర్ధికంగా కాకికిగూడా ఎంగిలిచేతిని చూపనుంకించని
జనసేవకుడు.అధినాయకులను ఆకట్టుకుని స్వేచ్చావాయువులను
పీల్చడంలో సంతోషాన్ని వెదుక్కుంటున్న్న పేలవమౌ ప్రజా ప్రతినిధి.

స్వార్జితమైన ఆస్తులు కాపాడుకోవాలని
అవతల నిలిచిన శత్రువుతో కరచాలనం చేసి
తబ పబ్బం గడుపుకుంటూ ప్రజల దృష్టిని
పరిశీలనగా ప్రక్కదారి పట్టించగల
వలపక్షం వైపు వాలుచూపులతో వంచించగల నెపంతో
కాలం గడుపుతున్న ప్తైపఖం
వలపక్షానికే నిర్దేశిస్తూన్న నయవంచనలో
నాలుగాకులు ఎక్కువచదివిన మాటల మాంత్రికుడు.

=============================================
పగలే వెలుగుతూన్న
పట్టణ మునిసిపల్ దీపంలా
భారతం ఎలాతెలాపోతుంటే
దేశం వెలిగిపోతున్నదని
మాయలాంతరు పట్టుకున్న
అధినాయకత్వం ఆత్మస్తుతి
మొదలెట్టింది.

ఇక పరనిందలపర్వంలో
అటు అధికార పక్షం
ఇటు ఊసుపోని ప్రతిపక్షం
ఒకరైపై ఇంకొకరు వ్యంగ బాణాలు
సంధిచుకోవడం సాధికారంగా ప్రారంభించారు.

స్వచ్చ భారత్ ధర్మమాని
ప్రతినగరం చెత్తకుప్పలా తయారయింది.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
కార్మికలోకం కళ్ళప్పగించి చూస్తున్నది.

సమ్మెలూ ఘెరావులూ సమకాలీన సమాజ
 జీవితపు  సంక్షేమానికి సాక్ష్యమని
నిత్య సంఘర్షణలే నిలువెత్తు నిజరూపాలనీ.
వామ పక్ష పార్టీలు ఊదరగొడుతన్నాయ్.

========================================
వడివడిగా ఆవిడ అడుగులు వేసుకుంటూ
నాకత్యంత సమీపంలోంచి నడుచుకుంటూ వెళ్ళింది.
ఆతొందరపాటులోనేమో ఆమె చీరచెరగు నన్ను తాకింది.


నాహృదంతరాళాల్లోనుండి ఓ అవ్యక్తానుభూతి
వసంతంలోవీచే నులివెచ్చని శ్వాసలా
నా వైపు వీచినట్టుగా మధురానుభవం కలిగించింది.



ఇంతలోనే ఓ నునులేత స్పర్శ  నా బుగ్గలను స్పృశించింది.
అది ఒక పూరేకు బలంగా వీచిన గాలికి ఎగిరినట్లుగా
నా స్మృతిపధంలోనుంచి అకస్మాత్తుగా అదృశ్యమై పోయింది.

ఓ మలయ మారుతం ఓ నిశ్వాసంలా నా గుండెను తాకింది.
ఆమె హృదయం ఒక మధురానుభూతికి లోనై
తనకు తానే సణుగుతూ తనలో తనే గొణగడం ప్రారంభించింది.
[టాగూర్  'తోటమాలి'లోని కవితకు స్వేచ్చానువాదం.]
=======================================



అతను ఈ ప్రపంచాన్ని
ప్రాణాధికంగా ప్రేమించాడు.
దానితోపాటే తను ఎదుగుతూ వచ్చానని
ఎంతగానో ఉత్సాహపడుతుంటాడు.
ప్రతి సూర్యోదయం తనకు ఒక
పుట్టినరోజులాంటిదని
 సరదాగా పలుకుతుంటాడు.

అసురసంధ్యవేళను ఎప్పుడూ
ప్రస్తావించిన పాపానపోడు.
చీకటిరాత్రినిగూడా
 చిత్రంగా ప్రేమిస్తూ వుంటాడు.

మరిప్పుడు విధివశాన అతని
ఒంటరివాడైపోయాడు.
ఎప్పుడూ తనను తనైంటిదాకా వచ్చి
సాగనంపుతూ వెళ్ళే ప్రపంచం
 ఇప్పుడతన్నిపట్తించుకున్నా
పాపాన పోలేదు.

అతని ప్రాంగణమంతా ఇప్పుడు
 బోసిపోయినట్లనిపిస్తుంది.

అతని ఒంటరితనం ప్రపంచానికికూడా
వేళాకోళమయిందేమోనని అతను ఆలోచనల
అగ్నిజ్వాలలలో దహిస్తున్నాడు.

అతనికిఓ సానుభూతి వచనాన్నిపలికి
సంతోషపెడతామని నా కలం
 ఇలా కాలాన్ని ఎదిరించి
ముందుకడుగులు వేస్తూ వెళుతున్నది.
=======================================
అతను కుంచెను చేతబట్టినప్పుడల్లా!
ప్రపంచమంతా ముగ్ధ మనోహనరూపం దాల్చి
అతనిముందు వినమ్రంగా మ్రోకరిల్లడంగమనించాను.
ఫల పుస్పాదులతో విస్తరించిన వనసమూహం
అతని కుంచెకు కొత్త సొబగులు దిద్దినట్లనిపిస్తుంది.


అసుర సంధ్యవేళన ఆకాశం అతని ముఖద్వారం వద్ద నిలిచి
నన్ను అన్నింటికన్నా అందంగా రూపుదిద్దుకునేలా చేయమని
శతవిధాలా ప్ర్రాధేయ పడుతుండడమూనాకేమీ కొత్తగాదు.


వాయువు వీచినప్పుడలా ఆకుల కదలికలు తమ అంతరంగాన్ని
ఆవిష్కైంచమని అభ్యర్ధిస్తున్న సందర్భాలెన్నో నాకు తెలుసు.

అతని ఒదిలో ఒదిగి ఎన్నో కధలు తమకు

ఇది పున్నమిరేయి
పిండారబోసినట్లుగా వెన్నెల
పరుచుకునిపోయింది విశాలంగా
నల్లటిమబ్బులు ఆకాశాన్ని కమ్ముకుని
ప్రాణికోటినంతా ఉక్కిరిబిక్కిరిచేసే సమయాన
సరిగ్గా నీ వు నాచెంతకు చేరి నామెడచుట్టూ
నీ కరకమలాలను మృదువుగా అల్లుకునేలా చేసి
నన్ను ఆనంద వార్ధిలో మునకలేసేలా చేసావు.


ఆమరుక్షణమ్నుంచీ నాతనువులోని ప్రత్యణువూ నీకోసం
తహతహలాడడం మొదలెట్టాయి గమనించావోలెదోనువ్వు.
ఇప్పుడు కొంగ్రొత్త వూహలు నామస్తిష్కంలో ఊరి
నన్ను నాలోని రామణీయకతను సందడిచేయమని
గొడవచేసి గోల చేస్తున్నాయి. ఇదేమిచోద్యమోమరి!

రా గబగబా నాచెంతకు చేరి నీ ఉచ్చ్వాస నిశ్వాసాలలో
నన్ను ఊపిరులు  పీల్చుకునేలా సన్నిహితంగా నాదగ్గరకు చేరుకో!
నీ చిరునవ్వుల సవ్వడిలో నా హృదయగతులను వేగవంతంచేసి
నా ప్రణయగాఢానురక్తికి అద్దంపట్టవా నీ ఆశంసలతో!!
-----------------------------------------------------------------------

దశరధసుతుడారామా
కుశలమ్మే  భక్తజనులు కూర్మిన ధరలో
విశాల హృదయుడవైతివి
వసివాడనిఖ్యాతినీది వందిత చరణా!!
========================
కాలం అంచులమీద ఎంత సుందరంగా
నాపేరును చెక్కివెనువెంటనే అదృశ్యమయావు.
ఎక్కడని నీకోసం నియతంగా వెదకను?
నాప్రంపంచంలోనేను అభిమానించే
అక్షరాలన్నింటినీ పదాలుగా  పోహళించి
ఒకచోగుదిగ్రుచ్చి నాగొంతులో పలికిస్తూ
నిన్ను ఎలుగెత్తి పిలుస్తున్నాను.

నీ చెవులకు ఆ పిలుపులు వినబడుతున్నాయా?
నా గొంతు క్రమేపీ గద్గదమౌతున్నది.
నీదాకా నాపిలుపు చేరడానికి విశేష శ్రమకులోనవుతున్నది.

నీవు ఎండమావివి కాదు.
భ్రమల వికసనమూ కానేకాదు.
ఎక్కడో నిద్రావస్థలో జోగుతున్నావా?

ఇక నేను నీకోసం మేల్కొలుపు పాటలు
 పాడాలేమో,  తప్పదులా వుంది.
ఒక్కసారి నీ మృదుమధుర స్వరంతో
 నాపేరును ఉచ్చరించల్గలిగితే ఇవాళ
నీ పిలుపుతోనేఈప్రాంగణమంతా నందనవనమై
కోకిల మధుర స్వనంలా ప్రతిధ్వనిస్తుంది.
ఆకమ్మని పిలుపుతోనే నాజీవన పధం
శోభిల్లకతప్పదని నా అచంచలవిశ్వాసం.
[ఓ ఆంగ్ల కవితను చదివిన  --అనుభూతులతో]
=====================================

Monday, September 7, 2015

చక్కని కవితా చక్షువు
చిక్కనిదౌ భావలహరి చెక్కిన ప్రతిదీ
నిక్కము జీవన సత్యము
తిక్కన్నా !! తెలుగువారి ధీధితి నీవే!!
అక్షంతవ్యం-----
==============రావెల
**************************


మందుతోకూడిన విందా?
క్షమించండి నేనురాలేను.

స్థాయిని మించి అమ్మాయిపెళ్లి చేస్తున్నారా ?
క్షమించండి నేను హాజరు కాలేను.

యౌత్ ఫుల్ వినోదమందించే సినిమానా?
క్షమించండి నేనా అసందర్భపు
 దృశ్యాలను,ప్రేలాపనలను  చూసి తట్టుకోలేను.

అధునాతనమైన ఇతివృత్తంతో కధానికా
ఆ అసభ్యతా, కుసంస్కారలను చదివి
నిగ్రహించుకోలేను నన్ను క్షమించండి.


వినూత్నమైన పొందికతో అల్లిన సినిమా సంగీతమా?
ఆమణిప్రవాళపు రీతులను కర్ణకఠోరమైన నాదాన్ని నా చెవులు
భరించలేవు నన్ను మనసారా క్షమించండి.

=====================================


Sunday, September 6, 2015

ఇంకొక్కసారి ---
=========

ఇంకొక్కసారి నీ
మాటలతో మంత్రించి
నన్ను ఆసాంతం మత్తిలజేయవా?

నీ అధరామృతం
అణువులా నాలో ప్రవహింపజేసి
అనురాగాభిషేకం చేయవా?

ఎందుకో ఇవ్వాళనాతనువులోని
 ప్రత్యణువూ నీకరస్పర్శకోసం
తహలాడుతున్నాయ్ గమనించావా?
 ఇంకొక్కసారి నీలోపెరుగుతున్న తృష్ణ
నాలో రాజుకుని రగులుతున్న కోర్కె లన్నింటినీ
దహించుకునిపోయేలా చూడవా?

నాలోని ప్రత్యంగమూ
నీ అనుభూతి సంద్రంలో
సుఖ స్నాతలయేలా స్వేదంవెలార్చవా?

[ఓ ఆంగ్లకవితను చదివాక]

---------------------------------------------

Saturday, September 5, 2015

ఇప్పుడందరూ ఆ బాబును గురించే
హృదయాలను విప్పి చర్చించుకుంటున్నారు.
ఎవరి బిడ్డడయితేనేం పాపం.ముక్కుపచ్చలారకుండానే
తల్లితోసహా నౌకా భంగమై పోట్టను చేత్తోపట్టుకుని
వలసపోయి కులాసాగా బ్రదుకుదామన్న నాన్నకు
శోకసముద్రాన్ని కానుకగా రాసేసి ఇట్టే ఒడ్డుకు కొట్టుకొచ్చాడు
విగతజీవిగా నూరేళ్ళూనిండిచుకుని ఎంతదయలేనిదోగదా విధి.

కరుణ కాసింతకూడా దాని గుండెని కరగించకపోవడం ఎంత శాపమోగదా!!
ఇది ఉగ్రవాదుల ఉన్మాదచర్యా!! లేక అగ్రదేశాలకుట్రలో ణాగమా?
అన్న మీమాంసలోనే అందరి బుర్రలు వేడేక్కి ఆవిరైఆకాశపు

అంచులదాకా ఎగసిపడి అందరినీ కంట తడిపెట్టిస్తున్నది
బాబు ఎవరి పిల్లాడయితేనేం అసువులుబాసి విషారాన్ని తిన్న విహంగంలా --విలలాడిపోయేలా విషాద సంద్రంలో
ఒడ్డుకు కొట్టుకొచ్చి
కంట తడిపెట్టించి అందరి గుండెలను లుంగలు
చుట్టించినలిపేస్తున్నాడు.
===========================



 నువ్వే కావాలని ---
--------------------------
నేనెందుకు అనునిత్యం విలపిస్తానో తెలియదు.
నీ వదానరవిందాన్ని వీక్షించి నప్పుడల్లా
నువ్వే కావాలని పరితపిస్తుంటాను.
అప్పుడప్పుడూకోపారుణనేత్రాలతో
 నీవు గద్దిస్తుంటావు
అయినా మనసు నువ్వే కావాలని
నిరంతరంతపిస్తుంది.

నువ్వు చిరాకు పడినా సరే
 చిరునవ్వుతో మనసు దానిని  స్వీకరిస్తుంది.

ఎందుకిలా జరుగుతున్న దంటావ్?
కొంపదీసి నేను నిన్ను గాఢంగా ప్రేమించానంటావా?

Friday, September 4, 2015

వానాకాలం
మొదటిరోజు
కన్నీటితొ సాగును
ఖాయం చేస్తున్న
వర్షాభావం.
-------------
మృగ్యమైపోతున్న
మట్టిపరీమళం
బీటలువారుతున్న
పొలమే ఖేదక్షేత్రం.
-----------------
అసంకల్పితంగా
------------------

అసంకల్పితంగా
------------------

అర్ధరాత్రో అపరాత్రో నీముఖద్వారం ముందునిలబడి
ఓ పాంధుడిలా తలుపు తట్టానని ఆశ్చర్యపడిపోకు.
నేను ప్రణయాన్ని  పరాకుచిత్తగించనిచ్చగించని సమయంతో పనిలేని సందర్భాన్ని.


నీ పూలతోటలో విరబూసిన పుష్ప వనంలో
ఓ శ్వేతగులాబీని పుటుక్కున త్రెంచి నీకిచ్చానని నిందించకు.

ఆ శ్వేతగులాబీని మించిన స్వచ్చత నాప్రేమలో భావగర్భితమైవుంది.మరువకు.

అసంకల్పితంగా ప్రతిదానికి నవ్వును జవాబుగా అందిస్తున్నానని అచ్చెరువందకు.
నా ప్రణయానికెన్ను కున్న సమయానికి  సంకల్ప బలం మహోత్తరమైనది.మన్నించు.
విషాదాతరంగం--
=====================
అనుకోని తిధిగా వచ్చి
ఆసాంతం నన్ను కలవరపరుస్తుంటావు.
ఆమూలాగ్రంగా నన్ను తునా తునకలుచేసి
శిధిలావస్థకు చేరుస్తూ పోతావు.

అప్పటిదాకా ఆనందం నా హృదయంలోకి
పొరలు పొరలుగా విస్తరిస్తూ పోతుండి.
పైకేమాత్రం కనబడకుండా హృదయాన్ని
గట్టిగా పట్టుకుంటూ ఓ పెంకును తగిలిస్తావు.

కాలక్రమేణా అవన్నీ కరైపోయి
దు:ఖపు శకలాలుమాత్రం జ్ఞాపికల్లా మిగిలిపోతుంటాయి.

హృదయంపై సమ్రక్షణ కవచం గా నీవుంచిన ఆ పెంకుగూడా
నీవే కొద్ది కొద్దిగా తొలగిస్తూ పోతుంటావు.
సత్యాలనూ అసత్యాలనన్నింటినీ బయటకు లాగేసి
హృదయాన్నంతా ఖాళీచేసి ప్రక్కనే నిలుచుంటావు.
నీవు వస్తూ పోతూ నన్ను ఆశ్చ్ర్యంపాలు చెస్తుంటావు.
అదేమిటో నీవు వెడుతున్నప్పుడలా నాలో కొంత భాగాన్ని
వెంటబెట్టుకుని పెకలించి వెళ్ళిపోతావు.

నన్నంటిపె ట్టు  కున్న రంగులన్నీ వివర్ణమైపోతుంటాయి.
నాలో వున్న దయా దాక్షిణ్యం క ణా
అన్నీ ఒక్కొక్కటిగా మృగ్యమైపోతుంటాయి.
ఓ బాధాతప్త హృదయమా! నీవెప్పుడయినా నిష్క్రమించవచ్చు!.
=================================
ఎక్కడో ఒకచోట రాలిపోక తప్పదని తెలుసు శీర్ణ పత్రానికి
అందుకే శిశిరం వచ్చేదాకారూపు రేఖలను మార్చుకుంటూ
తనకు తాను సహనంతో ఆఋతువు  దిశగా అడుగులువేసుకుంటూ
ఆత్మహననం చేసుకుని ఆనందిస్తుంది.మరోజన్మను నాకు
ప్రసాదించమని ప్రకృతిమాతను ప్రాధేపడుతూ వినమ్రంగా!!
=======================================
ఆశోపహతo
-------------------

ఎప్పుడూ అలా హడావిడిగా వస్తుంటావ్
వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళిపోతుంటావ్!!
యేం కొంపలు మునిగిపోతున్నాయని ఆ దుందుడుకు దూకుళ్ళు?

మనిషన్న తర్వాత కొంతయినా నియమ నిబద్ధత అవసరమే కాదనను
అంతమాత్రాన మా బాగోగులు పట్తించుకోకుండా అలా
వచ్చిన దారినే వచ్చిన దానికన్నా వేగంగా తిరోగమనం న్యాయమేనా?

అలా సుర్యుడుకేసి ఒక్కసారిచూడు
 ఋతువుమారేదాకా నింపాదిగావచ్చి
నింపాదిగా నిష్క్రమిస్తూ వుంటాడు.

చందమామాను చూడు గ్రీషంలో ఎక్కువసేపు మనతో బాటు
ఆరుబయట అందంగా పరుచుకుపోయి అందరినీ అనంతంగా ఆహ్లాదపరుస్తూ వుంటాడు.

శిశిరంలోనయినాసరే గమనించావోలేదు శీర్ణతరువులను
అనురాగానుభూతులుప్పతిల్లగా ఆలింగనంచేసుకుని
ఆనందాన్నందిస్తూ వాటిని ముద్దు మురిపాలతో ముంచేస్తూ వుంటాడు.

మరచిపోతామేమోనని సాయంసమయానికి కొలనులోకి జారిపడి
నేత్రానందం కలిగించే దిశగా నెప్పులుపడుతూ వుంటాడు.

ఇక వానాకాలంలో వరుణదేవుడు పిల్లలతో మమేకమై
కాలువల్లో పారే నీటిపై కాగితం పడవలను వదిలి
కాలక్షేపం చేస్తూ వుంటూ కేరింతలు కొడుతూ వుంటాడు.

అoదరు అధిదేవతలకన్నా నీవెందుకిలా ఆధిక్యం ప్రకటించి
మమ్మల్ను అల్లకల్లోలం పాల్జేసి ఆనందం పడుతూ ఆవేదనకలిగిస్తూ వుంటావు?

అదృశ్యరూపంలో సాక్షాత్కరించే ఆ పరమాత్ముడిలా నిరాకారివై
నింగినీ నేలనూ ఒక్కటిగాజేసి మాచేత కన్నీటికడలను సృష్టించే
సావకాశాన్ని అందించి అయోమయంగా అపురూపమై 
ఆశోపహతులను చేసి అల్లరిపెడుతుంటావ్?
=======================================================================
R.PURUSHOTHAMARAO
1651 BRIAR CLIFF DR
NOLENSVILLETN 37135
USA
supani@gmail.com

Wednesday, September 2, 2015

నేను లేస్తాను,పడుకుంజ్టాను,మరలా నిద్రకుపక్రమిస్తాను.
మళ్ళీ అతనితోపాటే మేల్కొంటూ దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తుంటాను.

ఆమెను నా గదిలోకి మెల్లగా ఆహ్వానిస్తాను.
అందమైన చందమామ నాగవాఖ్సంలోమి నాగదిలోకి
వచ్చినంతగానుభూతిచెందుతూ  సంబరపడిపోతాను .

ఆమె వదన సౌందర్యాన్ని నాముఖంలోకి
అతి సమీపంగా చేర్చుకుని హత్తుకుని
ప్రసరించే విధంగా పాటుపడతాను.
వెన్నెలంతా నాగదిలోకి విస్తరిస్తూ పోతుంది.
అలసి సొలసిపోయిన నాంతరాత్మ
ఆ దివ్య సౌందర్యానుభూతిలో పరవశించి పోతుంది.

నా ప్రార్ధనలన్నింటినీ ఆనాలుగుగోడలమధ్యనే
పరిమితమై పోయేలా జాగ్రత్త వహిస్తాను.
నాకుతెలుసు అతనొస్తే నాహృదయకుహరాల్లో
ఓ ఘంటానాదం ప్రతిధ్వనిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.



నా గమ్యం నన్ను శీఘ్రంగా లక్ష్య సాధన దిశలో నడిపిస్తుందనే నా నమ్మకం.
అతను ప్రసిద్ధిచెందిన నాట్యాచార్యుడు.
నన్ను తనపాటకనుగుణంగా నృత్యంచేయాలని అభిలషించగల ధీశాలి.
బాపు బొమ్మలరేడవ
    సొంపు వంపుల కన్నె సౌందర్యముతో
    ఇంపుగ తెలుగున పలుకగ
    హంపీ శిధిలమ్ములైన హాయిగనవ్వున్
వీక్షణం--
===============

అసుర సంధ్య వేళయింది.
అప్పటిదాకా అ శిశిర తరువుపై
వాలిపోయి సేదతీరిన పక్షులన్నీ
ఒక్క సారిగా గూటిబాట పట్టాయ్.
చెమర్చిన కనులతో బాధగా ఏకాంతంలోనికి
మరల తిరిగి తొంగిచూసి విషాద గీతాలాపనలో
కృద్ధయై కునారిల్లడం మొదలెట్టింది.

మళ్ళీ ప్రభాతసమయందాకా ఒంటరిగానే
వుండిపోవడం తప్పదని తీర్మానించుకుని
దిగులు దుప్పటిని  కప్పుకుని దీనంగా
శిక్షకు గురయిన సుశిక్షితుడైన సైనికుడిలా
వినమ్రంగా నిలుచుండిపోయింది.

========================
మన అంతరాంతరాళాల్లో
ధారావాహికంగా ప్రవహించే
నదిపేరు ప్రేమ.

కొండాకోనలనెక్కుతూ
పర్వతాలనధిరోహించే
ప్రక్రియను ప్రారంభించేందుకు
 సంసిద్ధమయే
ఆరోహణ క్రమం కూడా ప్రేమే.

గుండెలోతుల్లోకి దూసుకెళ్ళే
శరసంధానమూ ప్రేమే.

గడియపడని తలపులను
గట్టెక్కించే దిశగా
పరుగులుపెట్టించేదీ ప్రేమే.


మౌన భాష్యాలకు
ముద్దుముద్దుగా
భాష ణలు భాషణలు నేర్పించగలదీ  ప్రేమే.
=================

Tuesday, September 1, 2015

నీ వెల్లువగా ప్రవహించే
వెలుగులో  నేను ప్రేమించడం


అభ్యసిస్తాను.
నీ సౌందర్యలాలసలో
నేను కవితలల్లుకుంటాను.
నువ్వు నా హృదయాంతరంగలో
స్వేచ్చగా నాట్యంచెయ్.
నిన్నెవ్వరూ గమనించరని గ్రహించు.
నెనొక్కదాన్నే గమనించి
నీ రూపురేఖలను కుంచెతో దిద్దుతూ
పరవశించి పోతాను కన్నయ్యా!! మరువకు!!1
==============================
ఒక జ్ఞాపకనికిరంగులద్దాలని
రాత్రంతా మెలకువగా కూర్చున్నాను.


కలలన్నీ ఖర్చయిపోయాయి
చేతిదగ్గరున్న  రంగులన్నీకూడా
 పూర్తిగా వెచ్చించబడ్డాయి.

కానీ ఆ మధురాతి
మధురమైన జ్ఞాపకం మాత్రం
నిజాయితీగా నిలబడింది.

రంగులద్దుకుని కులికే
రాజకీయంకన్నా
నా జ్ఞాపకమే నన్ను
ఆప్యాయంగా కౌగిలించుకుని
ముద్దాడింది.ఎలాంటి రంగూ
నాబుగ్గనంటుకున్న దాఖాలా లేదు.
సహజసిద్ధమైన గులాబీ రంగుకదా
 తన పెదవులది.కృత్రిమానికి చోటివ్వలేదు.
==============================
నాకొక విత్తనాన్నివ్వు
మరిన్ని మంచి ఆలోచనలను తామరతంపరగా
ననవలాడుతూండేలా  మొలకెత్తింపచేస్తాను.

నాకొక ఆలోచననివ్వు
అందరూ మెచ్చే విధంగా ఒక కవితను రచిస్తాను.

నాకొక గొప్ప  కవితను చదివిపి వినిపించు.
యావత్ ప్రపంచాన్నీ మరో మంచి
ప్రస్థానంవైపు అడుగులువేయిస్తాను.
===========================
కవిత్వం ఎక్కువసార్లు ప్రాణ వాయువులా పనిచేస్తుంది.
గవక్షాల్లోంచి కిటికీల్లోంచి రివ్వున సాగుతూ వచ్చే
మలయ మారుతంలా మనసు నాహ్లాద పరుస్తుంది.


కలుషిత్మ్ కాని ఆహారంలా మనుషులకు శక్తినందిస్తుంది.
కనీసం జీవకోటికవసరమైన,తప్పకుండా  కావాల్సిన నిద్రలా
మనసుకు తగు విశ్రాంతినందించి హాయినిగొలుపుతుంది.
ఉత్తర ధృవాల దగ్గరగా పేరుకుపోయిన మంచు గుట్టలనుకూడా
అవలీలగా కరిగించగల సామర్ధ్యం కవితలకుందని మీకు తెలుసా?

కవిత్వాన్ని మనం కలికాలం ప్రభావంతో మత్తుజల్లి నిద్రబుచ్చుతున్నాం.

ఎక్కడకో దూర దూర తీరలకు సగనంపే ప్రక్రియలను ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభిస్తున్నాం.




మనస్సుయొక్క చాంచంల్యం మనిషిని కృంగదీస్తున్నప్పుడు
నడుస్తున్న చరిత్రంతా నెత్తురుతో చిత్రితమౌతున్నప్పుడు
మానవ మాత్రులమైన మనం చీకటికోణాల్లొంచి
దూసుకొచ్చే బొద్దింకలను చంపినట్లు వెలుగుదారులవెంట మనల్ను
నడిపించే కవితలను కాలక్రమంలో మృగ్యంచేసే మార్గాలనన్వేషిస్తున్నాం.
అభం శుభం తెలియని పిల్లలనందరినీ అనధాశ్రమాలకు తరలించే రీతిలో,అమాయకమైన ఆడపిల్లల్ను వ్యభిచారగృహాలకు
తరలించేలా కౄరంగా కాగితం మీద ముద్రితమై ఫెళ ఫెళ లాడుతూ
యావత్ప్రపంచాన్ని దాసోహమనిపించుకుంటున్న దేశపు కరెన్సీ నోటులా
జగత్తంతా మనీ వెంట గుడ్డిగా పరుగులుపెట్టించేలా దేశం దిగజారుడు వస్తువైనప్పుడు
జనాన్ని జాగృతంచేయగల కవిత్వమెవడికి కావాలని నిరసన ధ్వనులను నిరంతరం బజాయిస్తున్నాం.
===========================================================



Monday, August 31, 2015

అసుర సంధ్యవేళ దాటాక
నాప్రియుణ్ణి ఏకాంతంగాకలుసుకునేందుకు
ఒంటరిగా ఎంతో ఉత్సుకతతో బయలుదేరాను.

పక్షుల కిల కిలారవాలేం వినబడడంలేదు.
గాలివీచిన జాడాకనరావడంలేదు.
చెట్లమీద ఆకూల గలగలలూ చెవికి సోకడంలేదు.
బజారుకు రెండువైపులా ఉన్న గృహసముదాయం
సైనికుళ్ళా క్రంఅశిఖణతో సైనికుల్లా నిలుచున్నాయ్.

ప్రక్కనదిలోని నీరుకూడానిద్రవస్థలోమునిగిన
 ఘూర్కా చేతిలో బెత్తంలా స్థాణువుగా మిగిలింది.


నాగుండెచప్పుడు నాకే వేగంగా వినబడుతున్నది.
దాన్నెలా సముదాయించి సద్దుమణిగేలాచేయాలో బోధపడడంలేదు.
నాకాలీందెల సడికూడా నాకు వింతగానే వినబడుతున్నది.

నేను అతని ఇంటి ప్రాగణంలో కూర్చుని
ఆతృతగాతని అడుగులసవ్వడికోసం ఎదురుచూస్తున్నాను.
అతను నెమ్మదిగా అడుగులో అడుగులు వేసుకుంటూ నన్ను సమీపించి
నాకొక ప్రక్కనాత్యంత  సమీపంలోనే చతికిల బడ్డాడు.
నాకన్నులు క్రిదకు వాలిపోయి నిద్రను కౌగలించుకుంటున్నాయి.
తనువంతా కొద్ది కొద్దిగా వణకడం ప్రారంభమయింది.
రాత్రి ఇంకా చిక్కబడడమూ ఆరంభమయింది.
బలంగా వీస్తూ వచ్చిన గాలి దీపాన్ని కొండెక్కించింది.
నా వక్షస్థలం మీద ఎగిరెగిరిపడుతుమ్న్న ముత్యాలహారంకాంతులే

పరిసరాలను దీప శిఖలా వెలుగులు విరజిమ్ముతుంది.
అవెలుగును సైతం ఎలా చిన్నగా తగ్గించాలోకూడ నాకవగతమవడంలేదు.

[టాగూరు-- తోటమాలిలోని ఆంగ్లకవితకు స్వేచ్చానువాదం]

===========================
చదువరీ ఎక్కడున్నావు నీవు?
వంద సంవత్సరాలక్రితమ్నుంచీ
నా కవితలను చదువుతూ వస్తున్న
అవిమల ఖ్యాతినీది.

కనీసం భాగ్యశాలియైన వసంతపు వనమ్నుంచి
ఓ సుమన్నయినా కానుకగా నీకందివ్వలేకపోయిన వాడినినేను.
ఆకాశంలో వెల్లివిరిసిన ఓ స్వర్ణ మయూఖాన్నయినా నీకు
వరుమానంగా అందివ్వలేని అసమ్ర్ధుడనయాను నేను.

ఐతే ఓ చిన్నపనిని చేయగలవేమో ఆలోచించు.

ఈకవితావనంలోంచి వందేళనుండి సువాసనలను గుబాళించిన
ఓ కవితను తీసుకుని పున పున వల్లించు. అది వాడుముఖం  పెట్టినట్లున్నా
   పరవాలేదు.   ఆపురాతనపు గుబాళింపును
ఒక్కసారయినా నీ స్మృపధంలోకి తెచ్చుకునే ప్రయత్నంచెయ్.

హృదయసన్నిధానంలో చదువరుల హృదయంచెంత
నవ నవ లాడినచరిత్రగదా ఆకవితాసుమానిది.
ఇప్పుడు కొంత వాడుముఖంతో వున్నా  ఆకవిత
చదువున్నంతసేపూ ఆనంద వార్ధిలో నిన్ను తేలియాడించగలిగితే చాలు.
నేనూ మందానంద కందళిత హృదయారవిందుడనై మురిసిపోతాను.

[టాగోర్  తోటమాలిలోని కవితకు స్వేచ్చానువాదం]

Sunday, August 30, 2015

ఎదురుతెన్ను
-------------
నేను ఇవ్వాళ పాడదలుచుకున్న పాట
ఇంకా పాడటం మొదలిడనేలేదు.
తీగలు తెగిన ఆ వాద్యాన్నింకా
సరిగా సృతిచేయశ్డమూ కుదరలేదు.

గీతరచనా ఇంకేమీ పూర్తయిన దాఖలాలేదు.
పదాలపోహళిమౌ ఇంకా పూర్తి కావడంలేదు.
గుండే గొంతుకలోమొదలైన ఆరాటం
ఇంకా తగ్గుముఖం పెట్టినట్లుకూడాలేదు.

అతనెలా వుంటాడోకూడానకవగతం కాలేదు.
అత్ని ముఖాన్నెప్పుడూ ఇత పూర్వం
 చూసినట్లుగా గుర్తు కూడాలేదు.
అతన్ని జరూరుగా కలుసుకోవాలన్నాతృతమాతం
అధికంగా నాలో పొంగి సజీవంగాప్రవహిస్తూనే వున్నది.

ఇంటిముందు గూజ్ట్లో సంధ్యా దీపాన్నింకా వెలిగించనూలేదు.
అతన్ని ఈ చీకటిగుయ్యారంలోకి రమ్మని ఎలా సాదరంగా ఆహ్వానించను.

అతన్ని నేను తప్పకకలుసుకోగలనన్న ఘట్టినమ్మకం మాత్రం నాకుంది.
కానీ మా ఆ సమావేశానికి సరయిన ఘడియలు  ఆసన్నమైనట్లుగాలేదు,

[టాగోర్ కవితకు స్వేచ్చానువాదం]

Friday, August 28, 2015


---------

నిన్ను తలచుకున్నప్పుడలా
పొంగిపొరలుతూ ప్రవహించే
దు:ఖ సాగరాలు.
సునామీలను మించినట్లుగా
సుఖాలను ముంచేసిన ప్రవాహలు


నిన్నుపోగొట్టుకున్నరోజునే నేను
కోహినూరు వజ్రాన్ని పోగుట్టున్నంతగా
విలపించి విషణ్ణవదడునై పోయాను.

కోహినూరు పొందగలిగే స్తోమతనీకుందా?
 అని ఎవరు ప్రశ్నించినా
 నా సమాధానంకేవలం
మౌనాన్ని నిర్వచించే ఓ చిరునవ్వు.

ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఆవజ్రంతో
నిన్నెందుకు పోల్చవలసి వస్తున్నదో.
అనుభవించిన వాడికేగదా
అనుభూతి సాంద్రత అర్ధమయేది?
===========================
నా చాయాచిత్రం[సెల్ఫీ]

---------------
ఇప్పుడు నాన్న నాకొక గోడమీద వ్రేలాడే చాయాచిత్రం.
అమ్మ ఒక అనునిత్యం కాళ్లకడ్డం వచ్చే ముసలిదై
మూలకు పరిమితమై పోవాల్సిన  చీపురుకట్ట.

మాతృ స్తన్యం రుచితెలియకుండా గొల్లభామ పాలడబ్బాలను తాగుతూ
పెరిగిన అల్లరి చిల్లరగా పెరిగిన  శ్రీకృష్ణావతారాన్ని.
అనురాగాలనూ అనుబంధాలను అప్పుడెప్పుడొ మరాచిపోయి మనుగడ సాగిస్తున్న మృణ్మయరూపాన్ని కలికాలంలోని కాలుష్యాలను ఒంటికంటిచుకుని
ఊరేగుతున్న ఉత్సవ విగ్రహాన్ని.
ఓ వింత రూపసియైన  మనిషిని నేను.
==========================
ఎందుకని ఎందుకెందుకని?
------------------------రావెల.

ఒక్కుదుటన నిద్రమత్తులోంచి అధాటుగా లేచాను.
అంతా ఎందుకో అయోమయమే ఎదుటనిలిచింది.

ఇప్పటిదాకా అజ్ఞానతిమిరమే
నన్ను బందీని చేసి ఆడించింది.
నిన్నటిదాకా నా కళ్ళెదుటనే కనిపించి
కాలాన్ని ముందుకు నడిపించిన ప్రతిభావంతులైన
సాహితీ మూర్తులేమై పోయారు.
వర్ధ మాన కవుల మనో ఫలకాలమీదనుంచి
ఎలా ఒక్కౌదుటన అదృశ్యమై ఆస్చర్యచకితులను గావించారు.?
ఎవరి కవితా సంపుటులలోని మరచిపోలేని మంచి వాక్యాలనెవరూ ఉదాహరించిన దాఖలాలుండాడాం లేదెందుకని?

సమసమాజ స్థితిగతులపై సిమ్హ గర్జనలు చేసి
మనుషులందరినీ మహాప్రస్థానం వైపు నడిపించిన మహాకవి
శ్రీ శ్రీ మరుగునపడిపోతున్నాడెందుకని?

దమన నీతినెదిరించి ముసలి నక్కకు రాజరికంబు దక్కదని
ఘంటాపధంగా విన్నవిస్తూ, తిమిరంతో సమరం జరిపిన ధీశాలిని
ఎవరూ ఇప్పుడు గుర్తు చేసుకోవడంలేదెందుకని?

తన గొడవనే జనాభా గొడవగా చేసి ప్రభంజనం సృష్టించిన
కాళోజీని కాల క్రమేణా కనుమరుగు చేసుకుంటున్నామెందుకని?
ఉన్న స్థాయినుంచి ఉత్తమ స్థాయి కెదగాలని
వర్ధమానకవులెవ్వరూ సుదీర్ఘంగా కృషిచేయడంలేదెందుకని?
============================================
ఇద్దరమ్మాయిలు తమలోతాము
తమకోర్కెల అణచివేతనుగురించి
సవివరంగా చెప్పుకుంటున్నారు.



నాకు  చిరుతరువులను చూసినప్పుడల్లా
గబ గబా వనంలో విహరించాలని
సరదా పుడుతుంది.అది క్రమేపీ
వృద్ధి దిశగా అడుగులేస్తుంది.
అలాగే చిన్ని నీటిపాయను చూసిన
ఏదయినా సముద్రంలోకి దూకి ఈత కొట్టాలన్న తపన.



ఎదురుగా వున్న పర్వతాలను చూడగానే
వాటిని వెన్వెంటనే అధిరోహించి
ఆశిఖరాగ్రంచెంతకు చేరి ఒంటరిగా
తారలతో  సంభాషించాలన్న కుతూహలం .



మాట తొట్రుపడింది.
ఆ ఆమ్మాయిల కోరికల్లానే--

Thursday, August 27, 2015

నీ మాటల నెవరూ చెవులొగ్గి
ఆలకించనప్పుడు ఆశాభంగం చెందకు.

నీ కవితల్ను అంత శ్రద్ధగా ఎవరు వింటారు?

నావైపు తిరిగ్గి ఒక్కసారిచూడు.
చెవులు రిక్కించుకుని మరీ నీ వైపే
 లాలనగా చూస్తున్నాను.



నీ కవితలనన్నింటినీ క్రమంతప్పకుండా వినిపించు.

చక్కని శ్రోతనై శ్రద్ధగా ఆలకిస్తాను.


మధ్య మధ్యలో పానకంలోపుడకలా
అనవసరపు ప్రశ్నలతో వేధించను.నన్ను పూర్తిగా నమ్ము.
నీ కవితల స్వారస్యాన్ని సహృదయంతో స్వీకరిస్తాను.
హృదయానుగతం చేసుకుని ఉత్సాహపడతాను.

========================
పడిగాపులు----- రావెల
===================================

నాలుగు వానచినుకులను గుప్పెట్లోపెట్టుకుని
నాశిశిరహృదయంలో వసంతాభిషేకం చేసుకుని
తరించాలని తహతహ లాడాను.

నాలుగు కుండపోతలను బుంగలోకెత్తుకుని
నాఇంటిచుట్టూ ఆనందంగా
 ప్రదక్షిణ గావించాలని
అనేకానేకమైన కలలుగన్నాను.


వర్షపాతాన్నంతటినీ
చుక్కకూడా పారుబోకుండా
నా కావిడిలోకెత్తుకుని
నాపంటపొలంచుట్టూ
పనిగట్టుకుని మొక్కలకు కొద్దికొద్దిగా
జల్లుకుంటూ నృత్యంచేయాలని
ఎంతగానోఅభిలషించాను.

అందుకే నాచూపులనన్నింటినీ ఆకాశానికే
అతికించి ఆశగా ఆవానతుంపర్లకోసం
అనవరతం ఎదురుచూస్తూ కాలాన్ని ఖర్చుచేసుకుంటున్నాను.
ఇక వరుణదేవుడికరుణకోసమే పడిగాపులుగాస్తున్నాను.

Wednesday, August 26, 2015

 ఇతిశివం ----
=============

నవ్వులనదిగామారిన నయాగరా జలపాతం దగ్గర
ఆరోజు నీవు విరబూయించిన నవ్వులకోసం నడుంపడిపోయేలా
వెదకడం మొదలెట్టాను,ఆజలపాతపు ఝరీ ప్రవాహపు
రణగొణ ధ్వనులమధ్య ఎక్కడో జారిపడి నలిగిపోయివుంటాయి.
ప్రతివుదయాన మనసుకాహ్లాదంకలిగించే నీ స్తోత్రరత్నాల
సుశ్లోక పఠనాలు ఎక్కడమరునపడి  మాయమయాయో తెలుసుకోలేక సతమరమై పోతున్నాను.

కష్టాలనన్నింటినీ నీకు దూరంగా జరపాలని ఎంతగా స్వేదసంద్రాలను వెలార్చానో
ఆ దేవదేవుడికే విదితమై ఉంటాయనిమాత్రం తలపుకొచ్చి తర్జన భర్జన పడుతూంటాను.

ఆనవ్వులూ ఆ ఆనందమయమైన సంతోషపు సాయంత్రాలన్నీ
యేగంగలోకలిసిపోయాయో ఎవరినడిగి తెఉసుకోవాలి?యేఅగ్నికీలకాహుతయి బూడిదగా
మిగిలిపోయాయో తెలుసుకుని ఇప్పుడు యేం ప్రయోజనముందో తెలుసుకోవాలనే నాతపన.
ప్రతిపువ్వు విరబూయడంలోనూ నీపరిమళ సురభిళాలే సాక్షాత్కరిస్తాయి.
ప్రతి పక్షిపాటలోనూ నీవు గొంతుకలిపి సంతోషపడిన ప్రభాతసమయాలే
కన్నులముందునిలిచి కన్నీటి కడలులను కళ్ళెదుట కనిపింపజేస్తాయి.
ప్రతిరాత్రినీ వసంతరాత్రిగామార్చిన నీవు తిమిరంతో చేసిన సమరాలేజ్ఞప్తికొచ్చి
నన్ను మరింతగా నీచేరువకు చేరిపోవాలని తొందరపెడుతున్నాయి.

ఆమల్లెల సౌరభమూ మరపుకురాదు,సంపెగల సునితత్వమూ మరపుకురానీయవు.
మనోపధంలో ఆ స్మృతులే తారకల్లా ప్రకాశిస్తూ నిద్రపట్టని రాత్రులను
నాకు నజరానాగా అందించి అదృశ్యమైపోతుంటాయి.ఇతిశివం
=======================================================
విహంగ గానం
-------------============రావెల పురుషోత్తమ రావు.
పక్షులెలా వేదికమీద భయం లేకుండా
ఎలా పాడగలుగుతున్నాయోతెలుసా?
శ్రోతలు రాలేదన్న దిగులులేదు.
ఆహ్వాన పత్రికలు
 అచ్చొత్తించాలన్న ఆతృత కూడా కనరాదు.
సభామందిరాన్ని శ్రోతలకనుకూలమైన
ప్రదేశంలోపెట్ట వలసిందే నన్న నిబంధన కనిపించదు.


ప్రవేశద్వారం వద్దనే టిక్కెట్లను గబ గబా అమ్ముకోవాలన్న గాబరానూలేదు.
తరుశాఖలనే వేదికలుగా మార్చుకోగల  సత్తా వాటికుంది.

గాలి వీచే ప్రకంపలనే మైకుల్లా మార్చుకోగల
సాంకేతిక సహకారం వాటికి స్న్నిహితంగనే లభ్యమౌతుంది.

లేచివురాకులనే నమిలి అవి గాత్ర శుద్ధిని
చేసుకోగల సౌకర్యమూ సన్నిహితంగానే  వుంది.
గాన కచ్చేరీ ప్రారంభమయాక  వాయు తరంగాలే ప్రసార
మాధ్యమాలుగా పనిచేయించుకోగల పటిష్టమైన సామర్ధ్యం వాటికుంది.


ఒక్కొక్క సారి తమ రెక్కలనే ఒత్తి పట్టుకుని
గళలను సవరించగానే పాటపల్లవై ప్రభవిస్తుంది.
లోపల ఆంతరింగికంగా వాటిలో పొంగిపొరలే చైతన్య స్రవంతులే
చరణాలై ఉద్భవించి ఉప్పొంగి పారుతూ ఉరుకులెట్టడం మొదలెడతాయి.
ఆకులగలగలలే వతికిప్రశంసలనందిచే సహృదయ శ్రోతల కర్తాళ
తోసమ్మిళితమైన  ధ్వనుల హర్షామోదాలు.
కోయిలమ్మలు చెంతజేరి పాడె కోరస్ సహకారాలే
వాటికందే అనూహ్యమైన అభినందనలు.
పైగా  శతాయుస్షులందించే  కరుణారస హృదయ స్పందనల ఆశీర్వచనాలు.

=====================================================
రావెల పురుషోత్తమ రావు.
1651 briar cliff dr
nOLENSVILLE Tn 37135
=======

తాజాకలం
=========రావెల
------------------------------

ప్రతిరోజూఇంటిముందు
భాను కిరణాలకన్నా
ముందుగా ముఖ ద్వారం ముందు
వాలిపడేది రక్తాక్షరాలతో
అచ్చొత్తించబడిన దిన పత్రిక.

మానభంగాల అమంగళ వాద్యాలతో
పలికే మృత్యు మృదంగస్వనాలు.
రజకీయ  రాబందులు వరుసగా
జనాన్ని పీక్కుతినే ప్రణాళికల
అప్రయోజకమైన ప్రకటనల పరంపరలు.

వార్తా స్రవంతులపేరిట అసమర్ధనేతలను
వంది మాగధుల్లా ప్రశంసలతో హోరెత్తించే
చోటా మోటా నాయకుల శుభాకాంక్షల సం రంభాలు.

నగరాల్లో నాలుగు వాన చినుకులు  పడగానే పేక మేడల్లా
 కూలిపడేప్రభుత్వ ప్రతిపాదిత భవనాల  పరంపరలు.
============================================





Tuesday, August 25, 2015

సుమాల్లాసుదీర్ఘమై  సున్నితత్వానికిప్రతీకలైన
ఆమే కళ్ళలో పొంగి జాలువారే ఆకన్నీరేమిటి?

ఇప్పటికీ ఆమె ఒంటరిగానే పడకగదిలో
నిట్టూరుస్తూ ప్రతి నిట్టూర్పులోనూ నిరాశనూ
నీవు నెరవేర్చకుండామిగిల్చిన వాగ్దానాల
వేడికుంపటిలో రగిలిపోతూ రాసిక్యానికి దూరంగా
జీవిత పధంలో ఏకాంతంగా సాగిపోతున్నది తెలుసా?
=====================================
శివోహం---
==========
అవును అతడిమీద ఓ కవిత రాయాలి.
మట్టిపరీమళాన్ని మనకు పరిచయంచేసి
మన మనసులన్నింటికీ సువాసనలద్దిన ఘనుడుడాతడు.

పల్లె తల్లి మూర్చనలన్నింటినీ పసిగట్టిన ప్రయోజకుడు.
పశువుల హృదయాలను సైతం క్షుణ్ణంగా  చదివిన పసి హృదయుడు.
మనోరంజకంగా మనిషినిగూర్చి మహోన్నతంగా చెప్పగలిగినవాడు.

కలంలో కరుణను నింపి కవితలల్లిన కరుణాంతరంగుడు
అవును అతడిమీద ఓ కవిత రాయాలి.
===========================
ఎప్పుడు విషాదం తలెత్తి దండయాత్రను కొన సాగించినా
ఆలోచనలన్నీ మూకుమ్మడిగా ముభావాన్ని ముద్దిడడం మొదలెడతాయి.
భావోద్వేగం గుండెను గట్టిగా అదుముకుని
లుంగలు చుట్టేయడం మొదలెడుతుంది.
కనుకొలకుల్లో కన్నీటిజలపాతాల సం రభం
సమరోత్సాహంతో సర్వంసహా సార్ధకమై ప్రవహిస్తుంది.

అంతటా అనూహ్యమైన గందరగోళమే
ఆత్మానుసంధానమై ఆందోళనాపధాన్ని ఆశ్రయించడం ఆరంభిస్తుంది.
సరిగ్గా ఆసమయంలోనే ఎక్కడినుంచో దూర దూర తీరాల దగ్గరనుండి
ఓ మలయమారుతం మనోహరంగా వీవడo మొదలెడుతుంది.

వ్యధార్తమైన నా మనసుకూ అనిశ్చితమై ఊగిసలాడే హృదయానికీ
ఆచల్లని పిల్లగాలిఓ ఆలింగనంతో   ఆకట్టుకుని
ఆనందానికి నిర్వచనం చెప్పాలని తహతహలాడుతుంది.

ఆకాశంలో మబ్బులు సైతం తామేమీ తక్కువకాదని అరుపులతో మెరుపులతో
అల్లకల్లోలానికి ఆస్కారమివ్వడం  ఆశ్చర్యహేతువై  నిలుస్తుంది.

 తంపటిలాంటి కొలిమిలోంచి తనువును బయట  పడేసే ప్రయత్నం  ప్రారంభమౌతుంది.
అనూహ్యంగా వాతావరణం, వర్షం రాకడ తో చల్లబడడo మొదలౌతుంది.

నేలకు రాలిపడే ప్రతిచినుకులోనూ ఓ సందేశo ఉదాహృతమై వుంటుందనుకుంటా!!
ప్రతిక్షణాన్ని నన్ను ఉత్సాహపరిచే దిశగా ఊపిరులూదుతూ
సమాయత్తం  జేస్తూ సాగిపోవ నుంకిస్తూ  సంతృప్తిపడుతుంది.

జ్ఞాపకాల  సంకెళ్ళనుండి  విముక్తమైన కన్నీ రు ధారాప్రవాహాన్ని
జలపాతాల వేగంతో క్రి0దకు దుమికేలా చేస్తుంది.
అప్పటిదాకా నన్ను ఆందోళనా పధంలో నడిపించి కునారిల్లజేసి
కుదేలయేలా చేసిన వాతావరణమంతా ఆ స్థితికి స్వస్తిపలికి
నన్నుస్వస్థతామార్గంవైపు అడుగులు పడేసేలా ఆశీర్వదించడం ఆరంభిస్తుంది.
============================================================