నీవు నీ జ్ఞాపకాల నన్నింటినీ
మరచిపోయి నాదగ్గరనే వదిలి వెళ్ళిపోయావు.
వాటినన్నింటినీ ఒకదగ్గరగా ఏర్చి కూర్చి
భద్రంగా నా హృదయకుహరంలో దాచుకున్నాను.
ఎండకయినా నానకయినా అవి యేమాత్రం
చెక్కుచెదరకుండా కంటికి రెప్పలా వాటిని
కాపాడుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాను.
రాత్రంతా ఏకాంతంగా ఒక్కడినే
సంతోషపు, సంతాపపు పాటలను జమిలిగా వింటూ
మృదు మధురంగా కాలం గడుపుతున్నాను.
నీవు నాతో పలికిన పలుకులన్నింటినీ గుది గుచ్చి
నా ఎదలో అసంపూర్తిగ మిగిలిన ఖాళీ లన్నింటినీ
చాక చక్యంగా పూర్తిచేసాయని నీకెలా తెలియజేయాలో నేనెరుగను.
ఇంతకన్నా అధికంగా నేనాశించేదేమీలేదని గ్రహించు.
నల్దిశలా అల్లుకు పోయి అందంగా విస్తరించిన నీ దరహాస
చంద్రికలు నన్ను అనుని త్యం ఉత్తేజపరుస్తూ ఊపిరులూదుతున్నాయి.
నీ జ్ఞాపకాలనన్నింటినీ ఓ మెత్తటి వస్త్రంలో దాచివుంచాను సుమా!!
అవి నీవు నాకనూహ్యంగా అందించిన
అమూల్యమైన వరుమానంగా భావిస్తున్నాను, తెలుసుకో!!
వాటినన్నింటినీ నాగుండెకు అప్పుడప్పుడూ హత్తుకుంటూ
అపరిమితానందాన్ని అనుభవిస్తుంటాను అర్ధం చేసుకో!!
వాటినన్నింటినీ అద్వితీయమైన అపురూపమైన
ఆభరణాలుగనాంతరాంతరాళాల్లొ హృదయకుహరమనే గట్టి ఖజానాలో భద్రపరుచుకున్నాను.నీవు వాటిని నాదగ్గరనుoడి ఎప్పటికీ సంగ్రహించలేవని ఒక మాట గా హెచ్చరిస్తున్నాను.
-------------------------------------------------------------

No comments:
Post a Comment