నింగి శకలం
------------------------
నల్లటి ఈ విత్తులను గట్టిగా చిదిమితే
ఓ గగన శకలం చేతికొచ్చింది.
ఎందుకో ఈ సాయంత్రమంత టా
దు:ఖ భాజనమై మిగిలింది.
బహుశా, ముదిమితనం వల్లనో
లేదా అమితమైన భావోద్వేగం
నన్ను కౌగిలించుకోవడం వల్లనో.
పాదరక్షలేమీలేని నా పాదాలక్రింద
ఈ గడ్డిపరకలు చురుకుగా
ముoదుకు క్షిపణుల్లా పొడుచు కొస్తున్నాయ్.
అనూహ్యంగా నా హృదయం
కోయిల కంఠస్వరాన్ని అందిపుచ్చుకుంది.
దానికేవో కొత్తగా ఈకలు పుట్టుకొచ్చినట్లుగా
సంతోష సామ్రాజ్యంలో మునిగి తేలిపోతుంది.
ఆ సాయంత్రం ఎందుకోఇలా
దు:ఖ దాయిని ఐపోయింది.
నల్లటి ఈ విత్తనాలను గట్టి గా చిదిమితే
ఓ నింగి శకలం చేతిలోకొచ్చిపడింది.
----------------------
ఆంగ్లమూలం-- dah Helmer తెలుగుసేత: రావెల.
[కవి లిఖిత పూర్వక అనుమతితో]
------------------------
నల్లటి ఈ విత్తులను గట్టిగా చిదిమితే
ఓ గగన శకలం చేతికొచ్చింది.
ఎందుకో ఈ సాయంత్రమంత టా
దు:ఖ భాజనమై మిగిలింది.
బహుశా, ముదిమితనం వల్లనో
లేదా అమితమైన భావోద్వేగం
నన్ను కౌగిలించుకోవడం వల్లనో.
పాదరక్షలేమీలేని నా పాదాలక్రింద
ఈ గడ్డిపరకలు చురుకుగా
ముoదుకు క్షిపణుల్లా పొడుచు కొస్తున్నాయ్.
అనూహ్యంగా నా హృదయం
కోయిల కంఠస్వరాన్ని అందిపుచ్చుకుంది.
దానికేవో కొత్తగా ఈకలు పుట్టుకొచ్చినట్లుగా
సంతోష సామ్రాజ్యంలో మునిగి తేలిపోతుంది.
ఆ సాయంత్రం ఎందుకోఇలా
దు:ఖ దాయిని ఐపోయింది.
నల్లటి ఈ విత్తనాలను గట్టి గా చిదిమితే
ఓ నింగి శకలం చేతిలోకొచ్చిపడింది.
----------------------
ఆంగ్లమూలం-- dah Helmer తెలుగుసేత: రావెల.
[కవి లిఖిత పూర్వక అనుమతితో]
No comments:
Post a Comment