Thursday, September 10, 2015

అది ఎంత రహస్యమైనాసరే
నీహృదంతరాళాల్లోనే దాచుకోకు.
నాతో దాన్ని సవివరంగా పంచుకో
నేను దాన్ని గూఢంగా దాచిపెడతాను.
నీ మందస్మితదరహాసాలను
మృదువైన సంభాషణా  చతురిమలను
నాగుండెకేవలం  ఒక శ్రోతగా
 మాత్రమే ఆలకిస్తుంది.
శ్రవణెంద్రియాలతోకాదుసుమా!!

రాత్రి బాగా చిక్కబడడం మొదలయింది.
ఇల్లంతటినీ నిశ్శబ్దం ఆవరించింది.
పక్షులగూళ్ళన్నీ నిద్రానిమీలిత
 నేత్రాలతో జోగుతున్నాయి.

నాతో మనసారా సంభాషించు.
అనూహ్యంగా జలువారుతున్న
అశ్రు నాయనయనాలను చూడు.
తడబడుతున్న నీ చిరు దరహాస చంద్రికలతో
బాధలబరువుతో అవనతమైన సిగ్గు వంకర్లతో
నీ హృదయగతమై ఇప్పటిదాకా నీలో నిబిడీకృతమైన
రహస్యాన్ని పెదవి విప్పి పలుకుతూ ఆవిష్కరించు.
-----------------------------------------------------------------
[టాగూర్ తోటమాలిలోని కవితకు స్వేచ్చానువాదం] 

No comments:

Post a Comment