విసురుగా ఓ గాలి వీధిలోంచి కిటికీ గుందా
ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూకూర్చునే గదిలోకొచ్చి వాలింది.
గోడకు వ్రేలాడుతున్న నా లామినేట్ అయిన చిత్తరువు
ఊగిపోవడం మొదలయింది--నీ పేము కుర్చీలో నువ్వుకూర్చుని
లలితాసహస్రనామాలు వల్లె వేస్తున్న భ్రమ నన్ను విస్మయపరిచింది
ఈ రెండేళ్ళ రెండునెలలలో జరిగిన విశేషాలు మనుమరాలు
ఏకరువు పెడుతుంటే చెవులు శ్రద్ధగా రిక్కించి వినడం నీ వంతయింది.
నిన్ను అప్పటిదాకా చూసిన పాపానపోని చిన్ని మనుమరాలు
గుక్క తిరుగకుండా ఏడుపు లంకించుకుని ఆపకుండాఅరున్నొక్క రాగం అందుకుంది.
పెద్ద మనుమడు తను పాఠ శాల్లో సాధించిన విజయాలను ఏకరువు
పెడుతుంటే నువ్వు నిన్ను చూసి గర్వపడుతున్నానురా కన్నా అన్నమాటలే నాచెవుల్లో వేదంలో వల్లించే పనసల్లా రింగుమనడం మొదలయింది. మనుమరాండ్రంతా పట్టు పరికిణీ వోణీలతో కనులముందు అలానడయాడుతుంటే నీహృదయం ఆనంద వార్ధిలో
మునకలేస్తూ నీ కన్నులకు విందుగా మారడం నేను గమనించాను.
ఇదంతా నిజమా కలా అని నేనుతేరుకునేలోపే నీవదృశ్యమవడం
నిజంగా నా దురదృష్టానికి నిదర్శనమని ఇట్టే అర్ధమై పోయింది.