ప్రభాతగీతం
-----------
ఇవ్వాళమాఇంటిముందు చెట్టుపై
ఇంకా తెలతెల వారుతున్న వేళ
ఓ కోయిలమ్మ తన గళమాధుర్యాన్ని
స్వరాభిషేకంచేసి వినిపిస్తున్నది.
అది ఒక స్వాగత గీతంలా అందరినీ
మేలుకొల్పుతూ అలరించడం మొదలెట్టింది.
ఇంకా నయం ! అది నిన్నటి బాధలనేవీ తిరగతోడనని
తీర్మానం చెసుకున్న దానిలా తిష్ట వేసుకుని కూర్చున్నది.
రేపటి స్వర్గాన్ని స్వర్ణమయంగా స్వప్నాలతొ
అలంకరించి ఊరించేలా శోభితంచేయనని విశ్వసించేలా
విడమరిచిమరీ వివాంగా బోధిస్తున్నది.
ఈనాటి ఈహాయినే కలకాలం మన మనోపధంలోనిలుపుకుని
హాయిగాజీవన యానం సాగిద్దామని మరీ మరీ గుర్తు చేస్తున్నది.
అదిమనలో ఒక్కొక్కరినీ పేరుపేరునా పిలిచి ఆప్యాయంగా పలకరిస్తున్నది.
రంది అందరం దానికి వత్తాసుగా నిలుద్దాం
అమందానందంగా అది చేసే అమృత షేచనానికి సమాయత్తమై కదులుదాం!!

========================================================
No comments:
Post a Comment