Friday, June 26, 2015

ప్రళయగీతం
--------------
అనకు నువ్వు ప్రేమించానని
ఆశబ్దం మరుగున పడిపోయింది
చెప్పకు నువ్వు నా ప్రణయ పాదోధివని
ఆ మహాసంద్రం ఎప్పుడో ఇంకిపోయింది.

పువ్వు చూడు నవ్వుతూ తాను
ప్రేమించాననిమురిసిపోతుంది
తుమ్మెద తన ఝంకార రవంతో
జగతికంతటికీ ఢంకా
 బజాయించి తన ప్రేమను ప్రకటిస్తుంది.

నీలా యిన్నాళ్ళూ ఈవిషయాన్నిలా నాంచదు
నెలవంక కనబడగానే తనమృదువైన
భావనలను  ఇట్టే వెల్లడిస్తుంది.
ప్రభాతం వేళకళ్లా ప్రత్యుత్తరంతో
కలయికకు సిద్ధమవుతూ తహతహలాడుతుంది.
నువ్విప్పుడు నా దృష్టిలో  ,.అప్రాప్త మనోహరివి.
అసలు సిసలుప్రణయానికిపనికిరాని పువ్వువు.
--------------------------------------

No comments:

Post a Comment