బీజావాపనం
---------------------
నాదేశం నన్నుచూసి
అప్రతిహతంగా పరిహసిస్తున్నది.
అసమర్ధుడననో అప్రయోజకుడననో
అమాయకప్రాణిననో
అనుమానం వచ్చి
అర్ధం చేసుకుని
అవగాహనకొచ్చివుంటుందని క
ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
.
పదే పదేనావైపుచూసి
పరిహసిస్తూ వుంటున్నది.
అడవులు అంటుకున్నప్పుడు
అశాంతి ప్రబలినప్పుడు
అసలు నోరంటూ విప్పితే ఒట్టు.
హింసా ప్రవృత్తిచెలరేగినప్పుడూ
ఖండించిన దాఖలా కనరాదు.
సముద్రాలు సునాయాసంగా
సునామీలను సృష్టించి
జనావళిమీదకొదిలినప్పుడు
కిమ్మిన్నాస్తిగా కూర్చున్నానేతప్ప
సంతాపాని సందేశం రూపoలో కూడా
అందించిన పాపాన పోలేదు.
రానురాను వ్యక్తినిష్టంగా మిగిలిపోయి
సమాజ హితానికి దూరమైపోతున్నానని
స్పృహలోకి ఇప్పటికి రాగలిగాను.
మానవతావిలువలకున్న ప్రాధాన్యం
క్రమేపీ బుర్రకు తట్టడం మొదలయింది.
ధర్మం దారితప్పి నడిచిన సందర్భంలో
ఆగ్రహోదగ్రుడనై అరిచి కేకలుపెట్టాను.
సత్యం నోరు చచ్చుబడిన దానిలా ప్రవర్తించినప్పుడు
బధిరునిముందు శంఖం వూదిన దానికన్న బిగ్గరగా
గొంతు చించుకుని అరవడం మొదలెట్టాను.
న్యాయాన్ని కబోదినిచేయాలని న్యాయవాదులంతా ప్రయత్నిస్తే
నా శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకునిధర్మం పక్షాన నిలబడి వాదించి గెలిచాను.
న్యాయదేవతను కళ్ళారా జనసందోహం సంతోషవదనులవడం
గమనించే సువర్ణావకాశాన్నందించాను.
ప్రకృతిధర్మానికి విరోధంగా ప్రవర్తిస్తున్న వారిని
ఖరాఖండీగా నెచ్చరించి వదిలాను.
ఎవ్వరిపాటుకు వారు తమతమ నెలవుల్లో వుండగలిగితే
ఒనగూడే మేళ్ళను కూలంకషంగా వివరించాను.
యేప్రాణీ అవమానానికీ అవహేళనకూ గురికాకుండా
అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి తు చ తప్పకుందా
పాటించేలా దీక్షగా అమలయేలా చూడగలిగాను.
ఇప్పుడు నాకు సుమ బాలల సౌకుమార్యమన్నా
నీతీ నిజాయతీలను ఊపిరులుగా స్వీకరించిన
వారిగుండెల్లో కరకు దనాన్ని ఇష్టపడగలుగుతున్నాను.
ఇప్పుడు నేను యేవిషయాన్ని గురించయినా అనవసరంగా యాష్టపడే ధోరణుకి క్రమేపీ స్వస్తి చెప్పడం అలవరుచుకున్నాను.
మానవతకు మహోన్నత దిశ సంప్రాప్తమయే దిశగా
జయపతాకలను ఎగురవేస్తూ అమందానంద కందళిత
హృదయారవిందుడనై నవనవొన్మేషంగా రూపుదిద్దుకుని తృప్తిపడుతున్నాను.
=================================================

No comments:
Post a Comment